క్రేజీ ఆఫర్ వద్దన్న అనుపమ పరమేశ్వరన్

Published : Nov 10, 2017, 12:04 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
క్రేజీ ఆఫర్ వద్దన్న అనుపమ పరమేశ్వరన్

సారాంశం

తెలుగులో క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ వరుసగా హిట్లు రావటంతో వరుస ఆఫర్లు ఓ క్రేజీ ఆఫర్ ను సైతం వదులుకున్న అనుపమ 

తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంత ఆషా మాషీ కాదు. ఇక్కడ టాప్ బ్యూటీస్ నుంచి ఎప్పుడూ వర్థమాన హిరోయిన్లకు గట్టి పోటీ వుంటుంది. అటువంటి పోటీని కూడా తట్టుకుని... తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న కొద్దిమంది హిరోయిన్స్ లో కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ కూడా వుంది. ఆఫర్లు దక్కించుకోవడమేకాక.. వరుసగా హిట్ సినిమాల్లో నటించిన క్రెడిట్ అనుపమది.

 

తాజాగా ఉన్నది ఒక్కటే జిందగీలో రామ్ సరసన నటించిన అనుపమ తనకు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌజ్ ల నుంచి ఆఫర్ వచ్చినా కాదంటోంది. ఒకే తరహా చిత్రాలు వరసగా చేయాలంటే కష్టమే అంటోంది కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. పదహారణాల తెలుగమ్మాయిలా కనిపించే లుక్.. అందం, ఆకట్టుకునే రూపం అనుపమకు ప్లస్ పాయింట్లు. తెలుగులో చేసిన నాలుగు సినిమాల్లోనూ అనుపమ డిఫరెంట్ రోల్సే చేసింది.

 

దీంతో ఆమెకు పెద్ద బ్యానర్ నుంచి మంచి ఆఫరే వచ్చింది. ఓ రకంగా ఇది ఆమెకు అద్భుతమైన అవకాశమనే చెప్పాలి. కానీ అనుపమ ఆ రోల్ చేయనని సున్నితంగానే రిజెక్ట్ చేసిందట. ఎండింగ్ లో చనిపోయే పాత్ర కావడంతో ఈ సినిమా చేయడానికి ఇష్టం చూపించలేదని టాక్.  తాజాగా చేసిన ఉన్నది ఒకటే జిందగీలోనూ ఇంటర్వెల్ బ్యాంగ్ కు చనిపోయే రోల్ చేసింది. మళ్లీ అదే తరహా పాత్ర కావడంతో పెద్ద బ్యానరే అయినా వద్దని చెప్పేసింది.

 

ప్రస్తుతం అనుపమ ఫుల్ బిజీగా ఉంది. నాని హీరోగా డబుల్ రోల్ చేస్తున్న కృష్ణార్జున యుద్ధం సినిమాలో హీరోయిన్ గా అనుపమ నటిస్తోంది. ఎక్స్ ప్రెస్ రాజా ఫేం డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ హీరోగా కరుణాకర్ తీయబోయే లవ్ స్టోరీలోనూ ఫీమేల్ లీడ్ గా అనుపమనే తీసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Avatar 3: రిలీజ్‌కి ముందే 5000 కోట్లు.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో అవతార్‌ 3 సంచలనం.. బాక్సాఫీసు వద్ద డీలా
పూసలమ్మిన మోనాలిసా ఎంతగా మారిపోయిందో చూశారా