ఎమీ జాక్సన్ కన్నా కుక్క డాన్స్ బెటరంటే ఇంకేం చెప్తాం

Published : Apr 06, 2017, 11:35 AM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
ఎమీ జాక్సన్ కన్నా కుక్క డాన్స్ బెటరంటే ఇంకేం చెప్తాం

సారాంశం

ఐపీఎల్ 2017 ప్రారంభ వేడుకలో ఎమీ జాక్సన్ ప్రదర్శన ఎమీ నృత్య ప్రదర్శనలో తేలేయటంతో అభిమానుల అసంతృప్తి ట్విట్టర్ లో యమా ట్రోలింగ్ కుక్క బెటర్ అంటూ ట్రోలింగ్ జరిగిందంటే ఇంకేం చెప్తాం

బాలీవుడ్ లో తనకంటూ ఓ క్రేజ్ సంపాదించి పెట్టుకుంది బ్రిటిష్ భామ, హాట్ స్టార్ ఎమీ జాక్సన్. ప్రస్థుతం రజినీకాంత్ రోబో 2.0లో ఓ రోల్ చేస్తున్న ఎమీ జాక్సన్ హాట్ హాట్ ఫొటో షూట్లకైతే ఓకే కానీ.. స్టేజ్ మీద డ్యాన్సులేయడానికయితే కష్టం. కానీ ఆలోచించకుండా అమ్మడిది ఇంటర్నేషనల్ రేంజ్ కదా అని ఇండియన్ ప్రిమియర్ లీగ్ పదో సీజన్ ఆరంభోత్సవానికి పట్టుకొచ్చారు. ఆమెతో డ్యాన్స్ చేయించారు. అమీకి ఎవరు స్టెప్పులు నేర్పించారో కానీ.. అవి మరీ సిల్లీగా తయారయ్యాయి. నిన్నటి ఆరంభ వేడుక అంతా అంగరంగ వైభవంగా జరిగింది కానీ.. అమీ డ్యాన్సే విమర్శలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయింది.

అభిమానుల ఆకాంక్షలకు భిన్నంగా ఒంటిని బట్టలతో కప్పుకుని వచ్చి వాళ్లను నిరాశ పరిచిన అమీ.. డ్యాన్స్ కూడా ఘోరంగా చేసింది. ఆమె హావభావాలు.. స్టెప్పులు తేలిపోయాయి. ఇక సోషల్ మీడియాలో జనాలు తిట్టిన తిట్టు తిట్టకుండా ట్రోలింగ్ చేసి పడేస్తున్నారు. సోషల్ మీడియా జనం అమీని ఒక ఆటాడేసుకున్నారంతే.

 

జనాల కమెంట్స్ చూస్తే... బ్యాడ్ డ్యాన్సర్ సన్నీ లియోనీనే అమీ కంటే బాగా డ్యాన్స్ చేస్తుందని ఒకరంటే.. తన ఇన్‌స్ట్రక్టర్ క్లాసులో లేనపుడు.. జుంబా డ్యాన్స్ చేసినట్లుగా ఉందని ఇంకొకరు సెటైర్ వేశారు. ఒకరేమో ఏకంగా ఎమీ కంటే నా కుక్క బాగాల డాన్స్ చేస్తుందని ట్వీట్ చేశారు. ఇలా జనాలు ఎవరి స్థాయిలో వాళ్లు అమీని ఆడుకుంటున్నారు. 

ఎమీ బదులు లోకల్ హీరోయిన్లను పెట్టుకుని ఉంటే డబ్బు ఆదా అయ్యేదని, డ్యాన్స్ కూడా లోకల్ ఫ్లేవర్ తో అదిరిపోయేదని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్