నాగార్జున వందో సినిమాలో అఖిల్ చైతూ అమ‌ల‌

Published : Feb 01, 2017, 06:17 AM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
నాగార్జున వందో సినిమాలో అఖిల్ చైతూ అమ‌ల‌

సారాంశం

వందో సినిమాకు రెడీ అవుతున్న హిరో నాగార్జున  నాగార్జున సినిమాలో న‌టించ‌నున్న అమ‌ల అఖిల్ నాగచైత‌న్య 

 

 వాస్తవానికి నాగ్ సినిమాలు వందకు చేరువ కాలేదు. కానీ కామియో రోల్స్ వగైరా కలుపుకుంటే వందకు దగ్గరవుతాయి. నాగ్ కు ఈ విషయంలో అంత ఆసక్తి లేకున్నా, అభిమానులు మాత్రం వందో సినిమా ఓ మైల్ స్టోన్ మాదిరిగా వుండాల్సిందే నని అంటున్నారట నాగ్ తో. దాంతో వందో సినిమాగా ఏది చేస్తే బాగుంటుంది అన్న దానిపై ఓ క్లారిటీకి వచ్చేసాడట. 

సినిమా కథ అయితే రెడీగా లేదు కానీ, క్యారెక్టర్ మాత్రం బంగార్రాజు అని నాగ్ ఫిక్సయిపోయాడట. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో బంగార్రాజు క్యారెక్టర్ ఎంత హిట్ అన్నది తెలిసిందే. అందుకనే ఈ బంగార్రాజు క్యారెక్టర్ ను సెంట్రల్ పాయింట్ గా తీసుకుని, మాంచి కథ రెడీ చేయమని ఒకరిద్దరు డైరక్టర్లకు సూచించాడట.

 అయితే ఇక్కడ ఇంకో గమ్మత్తు ఏమిటంటే అలా స్క్రిప్ట్ చేయమన్న డైరక్టర్లకు ఓ కండిషన్ పెట్టాడట.  అఖిల్, చైతూ ఇద్దరికీ కూడా మాంచి పాత్రలు వుండాలి ఆ స్క్రిప్ట్ లో.  అదీ కండిషన్. వీలయితే అమల కు కూడా మంచి క్యారెక్టర్ వున్నా మరీ మంచిదని చెప్పాడట.

అంటే మళ్లీ మనం మాదిరిగా ఓ మాంచి మైల్ స్టోన్ సినిమాను తన వందో సినిమాగా చేయాలని నాగ్ డిసైడ్ అయిపోయాడన్నమాట. అయితే ఈ లోగా రాజుగారి గది 2, చందుమొండేటి సినిమాలు పూర్తి కావాలి. మరోపక్క దిల్ రాజు ఓ స్క్రిప్ట్ పట్టుకుని నాగ్ ను ఒప్పించాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. 
 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి భారీ బడ్జెట్ చిత్రం, రిలీజ్ రోజే చనిపోవాలని అనిపించింది.. నిర్మాత చేసిన మిస్టేక్ వల్లే డిజాస్టర్
చనిపోయే ముందు శ్రీదేవి నన్ను కలిసింది.. అప్పుడు అందరం కలిసి గెట్ టుగెదర్.!