ఇప్పుడు జాకీచాన్‌తో ఎఫైర్: దిశాప‌టానీ

Published : Feb 01, 2017, 06:02 AM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
ఇప్పుడు జాకీచాన్‌తో ఎఫైర్: దిశాప‌టానీ

సారాంశం

కెరీర్‌లో ఎంతోమంది హీరోలతో న‌టించిన కొంద‌రే మ‌న‌సుకి న‌చ్చుతారు అంటున్న దిశాప‌టానీ అయితే  మనసుకు నచ్చినవాళ్ళంతా బాయ్‌ఫ్రెండ్స్‌ అయిపోలేరు కదా అంటున్న ముద్దుగుమ్మ‌

 

బాలీవుడ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌తో పీకల్లోతు ప్రేమాయణంలో వుందంటూ దిశా పటానీ గురించి గాసిప్స్‌ గుప్పుమంటున్నాయి. అన్నట్టు, టైగర్‌ ష్రాఫ్‌ ఏ హీరోయిన్‌తో కలిసి సినిమా చేసినా, ఆ హీరోయిన్‌తో అతనికి ఎఫైర్‌ వుందంటూ గాసిప్స్‌ పుట్టుకొచ్చేస్తుంటాయి. ఈ ఎఫైర్ గాసిప్స్ మీ మీదే ఎందుకు ఎక్కువగా వస్తాయి. అని ప్రశ్నిస్తే, 'ఇలాంటి ప్రశ్నలు సరదాగా వుంటాయ్‌.. సర్లే, అలాగే అనుకోండి.. వాళ్ళంతా నా గర్ల్‌ఫ్రెండ్స్‌ అనుకోడానికి ఫీలింగ్ బాగుంది కదూ..అంటూ నవ్వేశాడు ఓ సందర్భంలో. 

ఇక, టైగర్‌ ష్రాఫ్‌, దిశా పటానీ కలిసి చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారంటూ  ఆ మధ్య గాసిప్స్‌ ఓ రేంజ్‌లో విన్పించాయి. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారనీ ప్రచారం జరిగింది. ఇంతకీ, టైగర్‌తో పరిచయం ఎలాంటిది.? అనడిగితే, దానికి సమాధానమిస్తూ, 'హీ ఈజ్‌ మై బెస్ట్‌ ఫ్రెండ్‌.. ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్‌ కంటే ఎక్కువ.. అలాగని, ప్రేమికుడు కాదు..' అని చెప్పింది దిశా పటానీ. ప్రతి సినిమా సమయంలోనూ హీరోలతో హీరోయిన్లకు ఎఫైర్‌ వుంటే, నాకిప్పుడు జాకీచాన్‌తో ఎఫైర్‌ వుండి వుండాలి కదా.. అంటూ నవ్వేసిందీ బ్యూటీ.

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu:మనోజ్ మాటలకు ఏడ్చేసిన రోహిణీ, అందరి మనసులు గెలిచిన బాలు, మీనా
Shyamala Devi: కృష్ణంరాజు సతీమణికి ఇష్టం లేని ప్రభాస్ రెండు సినిమాలు.. అస్సలు భరించలేరట