లైంగిక ఆరోపణలతో అనారోగ్యం బారిన పడ్డ నటుడు!

Published : Oct 10, 2018, 10:26 AM IST
లైంగిక ఆరోపణలతో అనారోగ్యం బారిన పడ్డ నటుడు!

సారాంశం

ప్రముఖ నటుడు అలోక్ నాథ్ పై నిర్మాత వినతా నందా లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనకు మద్యం పట్టించి బలవంతంగా అత్యాచారం చేశాడంటూ వినతా నందా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 

ప్రముఖ నటుడు అలోక్ నాథ్ పై నిర్మాత వినతా నందా లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనకు మద్యం పట్టించి బలవంతంగా అత్యాచారం చేశాడంటూ వినతా నందా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

ఈ ఇష్యూ కాస్త పెద్దది కావడంతో అలోక్ నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాత వినతా నందా చేసిన ఆరోపణలపై మాట్లాడకపోవడమే మంచిదని అన్నారు. అత్యాచారం జరిగి ఉండొచ్చు కానీ వేరేవాల్లేవరో చేసి ఉండొచ్చని.. ఈ విషయంపై అంతగా మాట్లాడకపోవడమే తనకు మంచిదని అన్నారు. 

తనకు వినతా నందా ఒకప్పుడు మంచి స్నేహితురాలని ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందని అన్నారు. ఇప్పుడు అలోక్ నాథ్ అనారోగ్యపాలైనట్లు తెలుస్తోంది. దీంతో వైద్యులు అతడిని విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు.

ఈ సందర్భంగా అలోక్ తరఫు న్యాయవాది అశోక్ సరావగీ మీడియాతో మాట్లాడారు. అలోక్ నాథ్ పరిస్థితి చూసైనా సంయమనం పాటించాలని రెండు రోజుల తరువాత ఆయనే స్వయంగా మీడియా ముందు మాట్లాడతారని అన్నారు. 

సంబంధిత వార్తలు.. 

‘‘రేప్ జరిగిందేమో.. కానీ నేను చేయలేదు’’

నాతో బలవతంగా మందు తాగించి రేప్ చేశాడు.. నటుడిపై ఆరోపణలు!

 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్
Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. 13 వారం ఈ కంటెస్టెంట్ ఔట్‌