Allu Arjun:అల్లు అయాన్ నుండి పుష్ప టీమ్ కి బెస్ట్ విషెస్... ఆ డ్రాయింగ్ చూసి మురిసిపోతున్న అల్లు అర్జున్

Published : Dec 17, 2021, 03:50 PM ISTUpdated : Dec 17, 2021, 03:52 PM IST
Allu Arjun:అల్లు అయాన్ నుండి పుష్ప టీమ్ కి బెస్ట్ విషెస్... ఆ డ్రాయింగ్ చూసి మురిసిపోతున్న అల్లు అర్జున్

సారాంశం

నిద్రలేవడంతోనే అల్లు అర్జున్ కి ఓ స్పెషల్ విషెష్ అందాయి.  సర్ప్రైజింగ్ గా  అయాన్ పెన్సిల్ డ్రాయింగ్ వేశారు.  గొడ్డలి పట్టుకున్న ఓ బొమ్మ వేసి, అందులో పుష్ప రిలీజ్ డేట్ మెన్షన్ చేశాడు. 

పుష్ప థియేటర్స్ జనాలతో కళకళలాడుతున్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరాలు మిన్నంటగా... థియేటర్స్ ప్రేక్షకులతో కిక్కిరిసిపోయాయి.అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా కావడంతో  విడుదలకు ముందే పుష్ప చిత్రంపై భారీ హైప్ ఏర్పడింది. దీంతో రికార్డు ఓపెనింగ్స్ దక్కాయి. ఇక సినిమా సైతం పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న నేపథ్యంలో పుష్ప భారీ వసూళ్లు రాబట్టే సూచనలు కలవు. ఇక పుష్ప మూవీపై టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ టేకింగ్ అద్భుతం అంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. 

నిద్రలేవడంతోనే అల్లు అర్జున్ కి ఓ స్పెషల్ విషెష్ అందాయి.  సర్ప్రైజింగ్ గా  అయాన్ పెన్సిల్ డ్రాయింగ్ వేశారు.  గొడ్డలి పట్టుకున్న ఓ బొమ్మ వేసి, అందులో పుష్ప రిలీజ్ డేట్ మెన్షన్ చేశాడు. అలాగే ఆల్ ది బెస్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని రాశాడు. అది చూసి మురిసిపోయాడు అల్లు అర్జున్...  ఆ డ్రాయింగ్ ను ఇన్స్టాలో పోస్టు చేశాడు. ‘థ్యాంక్యూ సో మచ్ మై చిన్ని బాబు, ఐ లవ్ యూ అయాన్. నువ్వు నా ఉదయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చావు ’ అని క్యాప్షన్ పెట్టారు.

Aslo read Allu Arjun-Pushpa: పుష్ప మూవీ గురించి మైండ్ బ్లాకింగ్ నిజాలు.. అమ్మో అంత కష్టపడ్డారా!

సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా పుష్ప. గతంలో ఆర్య, ఆర్య2 వచ్చాయి. సూపర్ హిట్ అనుకున్న ఆర్య సుకుమార్ కి డెబ్యూ మూవీ కాగా, అల్లు అర్జున్ కి ఇమేజ్ తెచ్చిపెట్టిన చిత్రం. ఇప్పుడు మళ్లీ దాదాపు 12 ఏళ్ల తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో ‘పుష్ప’ వచ్చింది. ఈ సినిమా రెండు పార్ట్ లుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ నేడు విడుదలవ్వగా, రెండోది వచ్చే ఏడాది విడుదల కానుంది. మొదటి పార్ట్ కు ‘పుష్ప: ది రైజ్’ అని పెట్టారు. ఇక రెండో పార్ట్ కు ‘పుష్ప: ది రూల్’ అని పెట్టినట్లు సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ , రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు చేశారు. 

Also read Pushpa2 Title: పుష్ప పార్ట్ 2 టైటిల్ ను చెప్పేసిన సుకుమార్..

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్