
అఖండ' ' సినిమా అఖండ విజయంతో మంచి జోష్ మీద ఉన్నాడు బాలయ్య(Balayya).ఈ విజయోత్సవం నడుస్తుండగానే తరువాతి సినిమాకు సంబంధించిన హడావిడి కూడా స్టార్ట్ చేశారు బాలకృష్ణ. ఈ సినిమాకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. బాలకృష్ణ(Balakrishna) తన నెక్ట్స్ మూవీని గోపీచంద్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'వేటపాలెం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
రాయలసీమ నేపథ్యంలో సాగే కథతో సినిమాను ప్లాన్ చేసుకున్నారు టీమ్. ఈసారి కూడా యాక్షన్ సీన్స్ తో (Balakrishna) రచ్చ చేయబోతన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో... తండ్రీకొడుకులుగా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారని సమచారం. ఒక పాత్రలో ఫ్యాక్షన్ లీడర్ గాను .. మరొక పాత్రలో పోలీస్ ఆఫీసర్ బాలకృష్ణ కనిపించనున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఓపెనింగ్ఈ జరుపుకున్న ఈ సినమా , జనవరి 20వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది.
ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన శ్రుతిహాసన్(Shruthi Hasan) ఆడి పాడబోతోంది. ఈ మూవీలో కూడా అందాల సందడి చేయనుంది. ఇంకో హీరోయిన్ గా భావనను తీసుకోబోతున్కునట్టు తెలుస్తోంది. ఈ సినిమకు మరో అట్రాక్షన్ గా... నెగెటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ లేడీ విలన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించబోతున్నారు. ఇంతకుముందు గోపీచంద్ మలినేని(Gopichand Malineni) చేసిన 'క్రాక్'(Krack) సినిమాలో కూడా ఆమె పాత్రకి ఒక రేంజ్ లో క్రేజ్ వచ్చింది. అందుకే ఈసారి కూడా ఆమెను తీసుకున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
Also ReadG: PUSHPA- KGF: ఆ విషయంలో KGF హిట్ అయితే.. పుష్ప మాత్రం ఫట్ అయ్యింది... ఎందుకు...?