రణబీర్ కపూర్ నోట RRR మాట.. అలియాతో అంత మాట అనేశాడేంటి ?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 17, 2021, 01:28 PM IST
రణబీర్ కపూర్ నోట RRR మాట.. అలియాతో అంత మాట అనేశాడేంటి ?

సారాంశం

ఇటీవలే విక్కీ కౌశల్, కత్రినా ల వివాహం ముగిసింది. బాలీవుడ్ లో ఒక్కో ప్రేమ జంట వివాహం జరుగుతుంటే రణబీర్, అలియా గురించి కూడా హాట్ హాట్ గా చర్చ మొదలయింది. వీరిద్దరూ ఎప్పుడు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు అంటూ బిటౌన్ జనాలు చర్చించుకుంటున్నారు.

ఇటీవలే విక్కీ కౌశల్, కత్రినా ల వివాహం ముగిసింది. బాలీవుడ్ లో ఒక్కో ప్రేమ జంట వివాహం జరుగుతుంటే రణబీర్, అలియా గురించి కూడా హాట్ హాట్ గా చర్చ మొదలయింది. వీరిద్దరూ ఎప్పుడు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు అంటూ బిటౌన్ జనాలు చర్చించుకుంటున్నారు. వీరిద్దరూ కలసి ఎప్పుడు వేదికపై కనిపించినా అభిమానులకు కనుల విందుగా మారుతోంది. 

అలియా, రణబీర్ కపూర్ ప్రస్తుతం భారీ బడ్జెట్ మూవీ బ్రహ్మాస్త్రలో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు. త్రిశూలం పట్టుకుని రణబీర్ పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నాడు. మోషన్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ చిన్న ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో వేదికపై ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. 

అలియా, రణబీర్ ఇద్దరూ వేదికపై నిలబడి ఉన్నారు. కొంత సమయానికి రణబీర్ కిందికి వెళ్లిపోవడానికి రెడీ అయ్యాడు. దీనితో అలియా ఎందుకు వెళ్ళిపోతున్నావు అని ప్రశ్నించింది. నువ్వు చాలా హాట్ గా ఉన్నావు. నాకు ఎదో అయిపోతోంది అని రొమాంటిక్ గా బదులిచ్చాడు. రణబీర్ అలా అనేసరికి అలియాకు ఏమాట్లాడాలో అర్థం కాలేదు. సిగ్గుపడుతూ చూస్తూ ఉండిపోయింది. 

వీరిద్దరి మధ్య మరో ఆసక్తికర సంఘటన కూడా చోటు చేసుకుంది. ఇటీవల ముంబైలో ఆర్ఆర్ఆర్ చిత్ర మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మీడియా ప్రతినిధులు.. ఆర్ మీకు బాగా కలిసి వచ్చిన అక్షరమా అని ప్రశ్నించారు. అలియా ఆ ప్రశ్నకు సిగ్గుపడుతూ మౌనంగా ఉండిపోయింది. రణబీర్ బ్రహ్మాస్త్ర ఈవెంట్ లో అలియాని దీని గురించి ప్రశ్నించాడు. అందరూ ఎందుకు నిన్ను ఆర్ గురించి అడుగుతున్నారు అని అడిగాడు. దీనికి బదులుగా అలియా 'A' అంటే నీ దృష్టిలో ఏంటి అని ప్రశ్నించింది. రణబీర్ తన పేరు చెబుతాడేమో అని ఆశించింది. కానీ రణబీర్ మాత్రం 'A' అంటే అమితాబ్ బచ్చన్ అని సమాధానం ఇచ్చి అలియాని ఆటపట్టించాడు. 

Also Read: 'ఊ అంటావా మావ' అంటూ ఊపేస్తున్న విష్ణు ప్రియ.. సమంత ఐటెం సాంగ్ కి హాట్ డ్యాన్స్

PREV
click me!

Recommended Stories

2025 Flop Heroines: 2025లో ఫ్లాప్ సినిమాలతో పోటీ పడ్డ హీరోయిన్లు.. వాళ్ళిద్దరికీ మూడేసి డిజాస్టర్లు
Sobhan babu జీవితాన్ని ఒక్క సినిమాతో నిలబెట్టిన ఎన్టీఆర్, ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా?