Pushpa: అల్లు అర్జున్‌ సర్‌ ప్రైజ్‌ ట్రీట్‌.. `పుష్ప` ట్రైలర్‌ టీజ్‌ గూస్‌బంమ్స్

Published : Dec 03, 2021, 07:33 PM IST
Pushpa: అల్లు అర్జున్‌ సర్‌ ప్రైజ్‌ ట్రీట్‌.. `పుష్ప` ట్రైలర్‌ టీజ్‌ గూస్‌బంమ్స్

సారాంశం

`పుష్ప` సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు. అందులో భాగంగా ఈ నెల 6న(సోమవారం) చిత్ర ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు. అయితే అంతకంటే ముందే అభిమానుల కోసం సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు బన్నీ.

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun) హీరోగా రూపొందుతున్న సినిమా `పుష్ప`(Pushpa). క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రస్తుతం అత్యంత క్రేజ్‌ని సొంతం చేసుకున్న సినిమా ఇది. పాన్‌ ఇండియా లెవల్‌లో దీన్ని రూపొందిస్తున్నారు. Pushpa రెండు భాగాలుగా సినిమా రిలీజ్‌ కానుంది. అందులో భాగంగా `పుష్పః ది రైజ్‌` అనే మొదటి భాగాన్ని ఈ నెల(డిసెంబర్‌) 17న విడుదల చేయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై.నవీన్‌, రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. 

ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు. అందులో భాగంగా ఈ నెల 6న(సోమవారం) చిత్ర ట్రైలర్‌ని Pushpa Trailer teas విడుదల చేయబోతున్నారు. అయితే అంతకంటే ముందే అభిమానుల కోసం సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు బన్నీ. `పుష్ప` ట్రైలర్‌కి సంబంధించిన టీజ్‌ని విడుదల చేశారు. 26సెకన్లపాటు ఉండే ఈ టీజ్‌ గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. ట్రైలర్‌లోని హైలైట్‌ ఎలిమెంట్లని ఈ ట్రైలర్‌లో చూపించబోతున్నట్టు ఈ ట్రైలర్‌ టీజ్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. చివర్లో అల్లు అర్జున్‌ దూకే షాట్‌ అదరగొడుతుంది. బన్నీఊరమాస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. యాక్షన్‌ ప్రధానంగా సాగుతుంది. 

అదే సమయంలో ఇందులో బన్నీతోపాటు హీరోయిన్‌ రష్మిక మందన్నా, అనసూయ, సునీల్‌ ఇలా అన్ని ప్రధాన పాత్రలను చూపించారు. `పుష్ప` ట్రైలర్‌ టీజ్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ట్రైలర్‌ చూడాలనే ఆతృతని పెంచింది. ఇందులో అల్లు అర్జున్‌ సరసన రష్మిక మందన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ విలన్‌గా, సునీల్‌, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎర్రచందనం  స్మగ్లింగ్‌ నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఇందులో బన్నీ.. పుష్పరాజ్‌ అనే పాత్రలో ఎర్రచందనం దొంగగా కనిపించబోతున్నారని టాక్‌. 

ఎర్రచందన మాఫియా అటవి ప్రాంతంలోని పేదలను తమ స్మగ్లింగ్‌కి వాడుకుని వాళ్లని ఎలా బలి చేస్తున్నారు, వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు, మాఫియాని చివరికి ఎలా ఎదిరించాడనే కథాంశంతో ఈ సినిమా రూపొందుతుందని సమాచారం. `ఆర్య`, `ఆర్య2` చిత్రాల తర్వాత సుకుమార్‌, బన్నీ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో `పుష్ప`పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఇందులో సమంత స్పెషల్‌ నెంబర్‌ చేస్తుంది. ప్రస్తుతం అది చిత్రీకరణ జరుపుకుంటోందట. ఇదిలా ఉంటే ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్‌లో విడుదల కాబోతుంది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ప్రభాస్‌ గెస్ట్ గా రాబోతున్నట్టు సమాచారం. అదే సమయంలో హిందీలో ప్రసారమయ్యే `బిగ్‌బాస్‌ 15` షోలో బన్నీ సందడి చేయబోతున్నట్టు సమాచారం. 

also read: ప్రభాస్‌, సల్మాన్‌ ఖాన్‌లను వాడుకోబోతున్న అల్లు అర్జున్‌.. చిరంజీవి, వెంకటేష్‌లతో సల్లూభాయ్‌.. సరికొత్త గేమ్‌

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi: బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన హీరో, అతడికి కొడుకు పుట్టగానే జాతకం చెప్పిన చిరంజీవి
Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..