భీమ్లా నాయ‌క్ నుంచి మ‌రో క్రేజీ అప్డేట్ .. ఫోర్త్ సింగిల్ ఎప్పుడంటే..?

By team telugu  |  First Published Dec 3, 2021, 6:09 PM IST

 పవన్‌ కళ్యాణ్‌-  ద‌గ్గుబాటి రానా ల‌ క్రేజీ కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం భీమ్లా నాయ‌క్. ఈ చిత్రం నుంచి త‌రుచూ క్రేజీ అప్డేట్స్ ఇస్తూ.. ఈ చిత్రంపై హైప్స్ క్రియేట్ చేస్తున్నారు మూవీ మేక‌ర్స్. తాజాగా ఈ చిత్రం నుంచి  ఫోర్త్ సింగిల్ ను డిసెంబ‌ర్ 4న విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు చిత్ర యూనిట్.
 


పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌- యంగ్ హీరో ద‌గ్గుబాటి రానా ల‌ క్రేజీ కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం భీమ్లా నాయ‌క్. మలయాళంలో సూపర్ డూప‌ర్ హిట్‌గా నిలిచిన ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ మూవీని తెలుగులో భీమ్లా నాయ‌క్ పేరుతో  డైరెక్ట‌ర్ సాగర్‌ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మల్టీ స్టార‌ర్ రీమేక్ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ తెరకెక్కుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. 

పవన్‌, రానా కాంబో అనగానే ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయ్యాయి. భారీ బ‌డ్జెట్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే పవన్‌, రానా ఫస్ట్‌లుక్స్ కు భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. త‌రుచు ఈ చిత్రం నుంచి ఒక్కొ అప్డేట్ ఇస్తూ.. అదే అంచనాల‌ను అలానే క్యారీ చేస్తున్నారు మూవీ మేక‌ర్స్. నిన్న కాక మొన్ననే రిలీజైన టైటిల్‌ అండ్‌ ఫస్ట్ గ్లింప్స్‌ యూట్యూబ్‌ దద్దరిల్లేలా రీసౌండ్‌ చేసింది. అభిమానుల్లో ఎక్కడలేని జోష్ ను నింపింది. నెట్టింట భీమ్లా నాయక్‌ను టాప్‌లో నిలబెడుతూ …. రిలీజైన గంటలోనే ట్రెండింగ్‌లో నిలిపారు. 

Latest Videos

Read also: https://telugu.asianetnews.com/gossips/venkatesh-planning-to-make-film-driving-license-r3jel0
 
సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుక‌రావాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు మూవీ మేక‌ర్స్ . ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 12 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌బోతున్న చిత్రం నుంచి నాలుగవ సాంగ్ ను విడుదల చేస్తున్నారు. వాస్త‌వానికి ఈ పాట‌ను నవంబర్ 30వ తేదీ విడుదల చేయాల్సింది. కానీ అదే రోజున ప్రముఖ సినీ గీత రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కన్నుమూయడంతో వాయిదా వేశారు. దానికి ఇప్పుడు ముహూర్తం ఖరారు చేశారు.

ప‌వ‌న్, రానా ఫాన్స్ లో జోష్ నింపడానికి ఈ నెల 4న నాలుగో పాటను ఉదయం 10.08 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ‘అడవి తల్లి మాట’ అనే ఈ గీతాన్ని ‘భీమ్లా నాయక్’ మూవీ ఎసెన్స్ అని మూవీ టీమ్ చెబుతోంది. ఇంతవరకూ విడుదలైన ఈ చిత్రం నుంచి విడుద‌లైన పాట‌లు సోష‌ల్ మీడియాలో ద‌ద్ద‌రిల్లాయి. యూట్యూబ్ లో న‌యా రికార్డుల‌ను సృష్టిస్తున్నాడు. ముఖ్యంగా ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ కు వ‌చ్చినా రెస్పాన్స్ అదిరింది. ఎక్క‌డ లేని రీ-సౌండ్ వ‌చ్చింది. ఈ పాట‌ అభిమానుల్లో పునకాలు తెప్పించిద‌న్న‌డంలో ఏలాంటి అతియోక్తి లేదు.

Read Also: https://telugu.asianetnews.com/entertainment/pushpa-team-planning-to-invite-prabhas-for-the-pre-release-event-r3d7yi 

మరి ‘అడవి తల్లి మాట’ పాట ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో మ‌రికొన్ని గంటలు వేచి చూడాల్సిందే! పవన్ కళ్యాణ్, రానా పాత్రలు ఢీ అంటే ఢీ అన్నట్టు సాగే ఈ చిత్రాన్ని సాగర్ చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు రచిస్తున్నాడు.  ఇందులో పవన్‏కు జోడిగా నిత్యా మీనన్ నటిస్తుండగా.. రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నట్లుగా టాక్. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు.


 

అడవి తల్లి మాట❤️ 4th Single will be out tomorrow at 10:08am🎵

A Musical 🎶 pic.twitter.com/1Q836EsLT3

— Sithara Entertainments (@SitharaEnts)
click me!