Mahesh Babu with Balakrishna బాలయ్య తో మహేష్... బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ కి సిద్ధం కండి!

By team telugu  |  First Published Dec 5, 2021, 3:31 PM IST

నెక్స్ట్ ఎపిసోడ్ భారీ ఎత్తున ప్లాన్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) బాలయ్య గెస్ట్ గా అన్ స్టాపబుల్ షోకి రానున్నారు. 


మెగా నిర్మాత అల్లు అరవింద్ ఆహా యాప్ అభివృద్ధి కోసం చేయాల్సినవన్నీ చేస్తున్నారు. పక్కా వ్యాపార సూత్రాలలో ముందుకు వెళుతున్నాడు. ఆహా యాప్ స్థాయి పెంచడం కోసం స్టార్స్ ని రంగంలోకి దించుతున్నారు. నట సింహం బాలయ్య (Balakrishna)తో టాక్ షో చేయాలని ఆలోచన రావడమే గొప్ప విషయం.  ఆ ఆలోచనను ఆచరణలో పెట్టి విజయం సాధించడం ద్వారా తన తెలివితేటలు నిరూపించుకున్నారు. 


కాగా బాలయ్య అన్ స్టాపబుల్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మోహన్ బాబు ఫ్యామిలీ మొదటి ఎపిసోడ్ కి గెస్ట్స్ గా రావడం జరిగింది. డిప్లమాటిక్ ప్రశ్నలు, సమాధానాలతో కాకుండా ఈ ఎపిసోడ్ బోల్డ్ గా సాగింది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లు ప్రేక్షకులు ఈ షోకి కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఎపిసోడ్స్ లో గెస్ట్స్ గా వచ్చిన నాని, బ్రహ్మానందం-అనిల్ రావిపూడి కూడా మంచి ఫన్ పంచారు. 

Latest Videos


కాగా నెక్స్ట్ ఎపిసోడ్ భారీ ఎత్తున ప్లాన్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) బాలయ్య గెస్ట్ గా అన్ స్టాపబుల్ షోకి రానున్నారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఫోటోలు బయటకు లీక్ కావడం జరిగింది. అయితే మహేష్ అధికారికంగా దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఆయన తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో బాలయ్యతో టాక్ షోలో పాల్గొన్న ఫోటో పంచుకున్నారు. బాలకృష్ణ గారితో ఈ సాయంత్రం ఫుల్ ఎంజాయ్ చేశాను అంటూ కామెంట్ చేశారు. 


ఇక వచ్చే వారం ఆహా వేదికగా అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో బాలయ్య , మహేష్ మధ్య నడిచే ఆసక్తికర సంభాషణ చూడవచ్చు. మరోవైపు ఎన్టీఆర్ (NTR)హోస్ట్ గా జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోలో కూడా మహేష్ పాల్గొన్నారు. ఇలా వరుసగా మహేష్ నందమూరి హీరోల టాక్ షోలలో పాల్గొనడం విశేషం. 

Also read బాల‌య్య‌తో ఒట్టు వేయించుకున్న భార్య వ‌సుంధ‌ర‌ ! ఏ విషయంలో నంటే...
ఇక గతంలో సీనియర్ ఎన్టీఆర్- కృష్ణ మధ్య విబేధాలు తలెత్తగా.. ఈ రెండు కుటుంబాలు దూరంగా ఉంటూ వచ్చాయి. ఎన్టీఆర్ మరణం తర్వాత కూడా కృష్ణ ఫ్యామిలీ నందమూరి కుటుంబంతో సన్నిహితంగా ఉన్న దాఖలాలు లేవు. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం కొనసాగుతుండగా... ఒకరితో మరొకరు సన్నిహితంగా ఉంటున్నారు. బాలయ్య అఖండ అద్భుతం అంటూ.. మహేష్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. 

Also read Akhanda:“అఖండ” చూడటానికి ఆఘోరాలు,ఏ ధియోటర్ లో నంటే...


 

click me!