బన్నీతో మిస్సైనా పవన్ మూవీలో జాక్ పాట్ కొట్టేసింది

pratap reddy   | Asianet News
Published : Dec 05, 2021, 03:01 PM IST
బన్నీతో మిస్సైనా పవన్ మూవీలో జాక్ పాట్ కొట్టేసింది

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ సంక్రాంతికి పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' చిత్రంతో అభిమానులని పలకరించబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భీమ్లా నాయక్ ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. చిత్రంలోని ఒక్కోపాటని విడుదల చేస్తూ ఆసక్తి పెంచుతున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ సంక్రాంతికి పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' చిత్రంతో అభిమానులని పలకరించబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భీమ్లా నాయక్ ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. చిత్రంలోని ఒక్కోపాటని విడుదల చేస్తూ ఆసక్తి పెంచుతున్నారు. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటించిన ఈ చిత్రం జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. 

ఇక భీమ్లా నాయక్ తర్వాత Pawan Kalyan క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో Hari Hara Veera Mallu చిత్రంలో నటించాల్సి ఉంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ కొంత భాగం జరిగింది. కోవిడ్ సెకండ్ వేవ్  కారణంగా షూటింగ్ ఆగిపోయింది. తిరిగి జనవరిలో ఈ చిత్ర షూటింగ్ షురూ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఈ చిత్రంలో ఊహించని పరిణామం చోటు చేసుకున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ యువరాణి పాత్రలో నటించేందుకు సైన్ చేసింది. కానీ ఆమెకున్న సమస్యలు, డేట్స్ ఇష్యూ వల్ల జాక్వెలిన్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు టాక్. 

దీనితో దర్శకుడు క్రిష్ మరో హీరోయిన్ ని ఆమె ప్లేస్ లో రీప్లేస్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరో బాలీవుడ్ మెరుపు తీగ నర్గీస్ ఫక్రిని హరిహర వీరమల్లు చిత్రం కోసం క్రిష్ ఎంపిక చేశారట. ఇండో అమెరికన్ బ్యూటీ నర్గీస్ వయసు 42 ఏళ్ళు. పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. 

అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో నర్గీస్ స్పెషల్ సాంగ్ కోసం ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యిందట. కానీ చివరి నిమిషంలో మేకర్స్ సమంత వైపు మొగ్గు చూపడంతో నర్గీస్ కు అవకాశం చేజారింది. కానీ పవన్ మూవీతో నర్గీస్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

Also Read: మరీ ఇంత దారుణంగానా, మలైకా ప్రైవేట్ పిక్ వైరల్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే
Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్