బాల‌య్య‌తో ఒట్టు వేయించుకున్న భార్య వ‌సుంధ‌ర‌ ! ఏ విషయంలో నంటే...

By Surya Prakash  |  First Published Dec 5, 2021, 2:05 PM IST

 ఎక్కడ చూసినా ‘అఖండ’ మేనియానే కొనసాగుతోంది. మరోవైపు మొదటి రోజే బాలయ్య రికార్డుల వేటలో పడ్డారు. అన్ని రికార్డులను బ్రేక్ చేసే దిశగా ‘అఖండ’ దూసుకెళ్తోంది.


నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబోలో వచ్చిన తాజా సినిమా అఖండ. ఈ సినిమా గురించే ఇప్పుడు అన్ని చోట్లా కబుర్లు. ఈ నేపధ్యంలో బాలయ్య కూడా హాట్ టాపిక్ అయ్యిపోయారు. ఈ సినిమాలో బాలయ్య మాస్ అప్పీల్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అలాగే బోయపాటి మేకింగ్ కూడా ఓ రేంజిలో ఉంది. వీరిద్దరూ గతంలో లెజెండ్, సింహా వంటి రెండు సక్సెస్ ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను ప్రేక్షకులకు ఇచ్చారు. అప్పటి నుంచి ఈ కాంబోలో సినిమా అంటే ప్రేక్షకుల మనస్సులో ఓ ప్రత్యేకమైన అంచనా ఉంటూ వచ్చింది. అయితే ఆ అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా ధియోటర్స్  దగ్గర జాతర స్దాయిలో జనం కనపడుతున్నారు. సంక్రాంతి పండగ ముందే వచ్చేసిందని చెప్తున్నారు. బాలయ్య సినిమా జనాలకు నచ్చితే  కలెక్షన్స్  ఏ రేంజ్ లో ఉంటాయో తాజాగా విడుదలైన ‘అఖండ’ను చూస్తే అర్థమవుతుంది. 

గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ బజ్ వస్తోంది. ఎక్కడ చూసినా ‘అఖండ’ మేనియానే కొనసాగుతోంది. మరోవైపు మొదటి రోజే బాలయ్య రికార్డుల వేటలో పడ్డారు. అన్ని రికార్డులను బ్రేక్ చేసే దిశగా ‘అఖండ’ దూసుకెళ్తోంది. ఇదిలా ఉండగా... బాలయ్య హోస్ట్‌గా చేసి ఆహా పోటీలో వస్తున్నా అన్‌స్టాప‌బుల్ షో కూడా అదిరిపోతుంది. తెలుగు బుల్లితెర మీద మిగిలిన అన్ని టాక్ షో లతో పోలిస్తే ఈ షో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటోంది. తాజాగా అనిల్ రావిపూడి – బ్ర‌హ్మానందంతో బాలయ్య చేసిన టాక్ షో స్ట్రీమింగ్ అయింది. ఈ షోలో బాలయ్య ఓ ఇంట్రస్టింగ్ విషయం చెప్పారు.

Latest Videos

బాలయ్య ఈ షోలో తన భార్య ఒట్టు వేయించుకుని సినిమాకు తీసుకొనివెళ్లే విషయం గురించి చెప్పుకొచ్చారు.తనకు సినిమా నచ్చకపోతే సినిమా మధ్యలో వెళ్లిపోవడం, పాటలు వచ్చే సమయంలో నిద్రపోవడం చేస్తానని అలా చేయడం భార్య వసుంధరకు నచ్చదని బాలకృష్ణ అన్నారు. అయితే పాటలు వచ్చిన సమయంలో నిద్రపోకుండా ఉండాలని, సినిమా మధ్యలో వెళ్లకూడదని భార్య తనతో ఒట్టు వేయించుకున్నారని బాలకృష్ణ వెల్లడించారు.
 
ఈ షో ద్వారా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందని బాలయ్య క్లారిటీ ఇచ్చారు.ఈ షోలో బ్రహ్మానందంను ఎన్టీఆర్ ఏఎన్నార్ లలో ఎవరంటే ఇష్టమని బాలయ్య అడిగారు.ఆ తర్వాత ఏఎన్నార్ ఇష్టమని బ్రహ్మానందం చెప్పినట్టు తన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని బాలయ్య వెల్లడించారు. అయితే బ్రహ్మానందం మాత్రం ఇద్దరూ రెండు కళ్లు అని చెప్పుకొచ్చారు.
 

click me!