అక్షర ప్రైవేట్ ఫోటోలు లీక్.. చేసింది హీరోయిన్ కొడుకేనా..?

By Udayavani DhuliFirst Published Nov 16, 2018, 10:24 AM IST
Highlights

నటి అక్షర హాసన్ ప్రైవేట్ ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఓ ఫోటోషూట్ కోసం అలా ఫోటోలు దిగాల్సి వచ్చిందని, అయితే ఎవరో కావాలనే తన ఫోటోలను లీక్ చేశారని అక్షర పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

నటి అక్షర హాసన్ ప్రైవేట్ ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఓ ఫోటోషూట్ కోసం అలా ఫోటోలు దిగాల్సి వచ్చిందని, అయితే ఎవరో కావాలనే తన ఫోటోలను లీక్ చేశారని అక్షర పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఫోటోలను చూస్తుంటే మాత్రం ఫోటోషూట్ కోసం దిగినట్లుగా లేవని ఆమె కావాలని తీసుకున్న సెల్ఫీల మాదిరి ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఆ ఫోటోలను అక్షర మరెవరితోనైనా షేర్ చేసుకుందా..? అనే కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఇలాంటి ఫోటోలను షేర్ చేసుకోవడం కామన్ అయిపోయింది. ప్రేమలో బాగా ముదిరిపోయిన వారు ఇలాంటి హాట్ ఫోటోలను షేర్ కూడా చేసుకునే ఛాన్స్ లు ఉన్నాయి.

అక్షర కూడా ఆ విధంగా ఎవరికైనా ఫోటోలను పంపించి ఉంటుందా అని ఆమె పాత ప్రేమ వ్యవహారాలను వెలికి తీస్తున్నారు. ఈ క్రమంలో ఓ మాజీ హీరోయిన్ కొడుకు పేరు గట్టిగా వినిపిస్తోంది. నటి రతి అగ్నిహోత్రి తనయుడు తనూజ్ తో అక్షర కొంతకాలం పాటు ప్రేమాయణం సాగించింది. ఆ తరువాత ఇద్దరికీ బ్రేకప్ కూడా అయిందట.

రిలేషన్ లో ఉన్న సమయంలో అక్షర.. తనూజ్ కి ఇలాంటి ఫోటోలను షేర్ చేసి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మీడియా తనూజ్ ని ఈ విషయంపై ప్రశ్నించగా.. తన వద్ద లేని ఫోటోలను ఎలా లీక్ చేస్తానంటూ బదులిచ్చాడు. ఇలాంటి ఫోటోలు లీక్ అవ్వడం బాధాకరమని అన్నాడు. 

సంబంధిత వార్త.. 

ఆ స్టిల్స్ లో తప్పేముంది.. లీకైన ఫోటోలపై అక్షర కామెంట్!

కమల్ ఫ్యామిలీ షాక్: అక్షరహాసన్ ప్రెవేట్ ఫొటోలు లీక్‌!

 

click me!