బయోపిక్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నానన్న శ్రీను వైట్ల

By Udayavani DhuliFirst Published Nov 16, 2018, 9:48 AM IST
Highlights

ఇది బయోపిక్ ల సీజన్. ఎటు చూసినా బయోపిక్ లు నిర్మాణమవుతున్నాయి. ప్రతీ దర్శకుడు, హీరో ..ఏ బయోపిక్ తో ముందుకు వెళితే బాగుంటుందనే అన్వేషణ చేస్తున్నారు.

ఇది బయోపిక్ ల సీజన్. ఎటు చూసినా బయోపిక్ లు నిర్మాణమవుతున్నాయి. ప్రతీ దర్శకుడు, హీరో ..ఏ బయోపిక్ తో ముందుకు వెళితే బాగుంటుందనే అన్వేషణ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు సినిమా కథలు రాసుకోవటం కన్నా..ఏదన్నా మంచి బయోపిక్ దొరికితే మిన్న అని ఆలోచిస్తోంది ఇండస్ట్రీ. అందుకు దర్శకుడు శ్రీను వైట్ల అతీతుడు కాదు. 

రవితేజ, ఇలియానా జంటగా నటించిన చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’. శ్రీను వైట్ల దర్శకుడు. నవీన్‌ యర్నేని, యలమంచిలి రవికుమార్‌, మోహన్‌ చెరుకూరి నిర్మాతలు. ఈ రోజు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రం ప్రమోషన్ లో భాగంగా శ్రీను వైట్ల మీడియాతో మాట్లాడుతూ...తనకూ ఓ బయోపిక్ చేయాలనే ఉందనే ఆలోచనను  తెలియచేసారు. ఆ బయోపిక్ కూడా ఎలాంటిదై ఉంటో బాగుంటుందో క్లూ ఇచ్చారు.

శ్రీను వైట్ల మాట్లాడుతూ...   సావిత్రి బయోపిక్ 'మహానటి' ని ఈమధ్యే చూశా. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన విధానం నాకు ఎంతో నచ్చింది.. సినిమా ఒక మాస్టర్ పీస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డిజైన్ చేసారు. నాకూ ఒక బయోపిక్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది.. ఇప్పుడు ఎలాగు బయోపిక్ ట్రెండ్ ఉంది కాబట్టి బయోపిక్ తెరకెక్కించేందుకు ఒక గ్రేట్ పర్సనాలిటీని వెతుక్కోవాలి అని అన్నారు. 

అయితే తను డైరక్ట్ చేసే  సినిమానుండి ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ ను ఆశిస్తారని,  అందుకే ఎవరి జీవితాన్నైతే బయోపిక్ కోసం ఎంచుకుంటానో ఆ స్టొరీకి కామెడీ టచ్ ఇవ్వగలిగేలా ఉండాలన్నాడు. మరి ఆయనకు బాగా సన్నిహితుడైన, ఆయన సినిమాల్లో కంటిన్యూగా పాత్రలు చేసిన బ్రహ్మానందం బయోపిక్ చేయవచ్చు కదా అని చాలా మంది సూచిస్తున్నారు. 

click me!