సాయి ధరమ్ తేజ్...'రాక్షసుడు' అవతారం ఎత్తుతాడా?

Published : Nov 16, 2018, 09:55 AM IST
సాయి ధరమ్ తేజ్...'రాక్షసుడు' అవతారం ఎత్తుతాడా?

సారాంశం

ఒకటా ..రెండా వరస పెట్టి ఆరు డిజాస్టర్ సినిమాలు ..ఏ హీరో ని అయినా ఇండస్ట్రీ నుంచి ఇట్టే మాయం చేసేస్తుంది. కాని మెగా క్యాంప్ నుంచి వచ్చి సాయి ధరమ్ తేజ్ కు వాటిని తట్టుకునే సామర్ధ్యం ఉంది. 

ఒకటా.. రెండా వరస పెట్టి ఆరు డిజాస్టర్ సినిమాలు ..ఏ హీరో ని అయినా ఇండస్ట్రీ నుంచి ఇట్టే మాయం చేసేస్తుంది. కాని మెగా క్యాంప్ నుంచి వచ్చి సాయి ధరమ్ తేజ్ కు వాటిని తట్టుకునే సామర్ధ్యం ఉంది. ఆయనకు  మరో ప్రయత్నం చేయటానికి  ఇండస్ట్రీ ఎప్పుడూ అవకాసం ఇస్తూనే వస్తోంది. ప్ర‌స్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో "చిత్ర‌ల‌హ‌రి" సినిమాతో బిజీగా ఉన్న సాయిని మరో రీమేక్ తలుపు తట్టబోతోందని సినీ వర్గాల సమాచారం.

కొత్తదనం ఉండే కథలను ఎంచుకుంటూ తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం కోసం ప్రయత్నిస్తున్న హీరో విష్ణు విశాల్‌. అతను  తొలిసారిగా చేసిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌  ‘రాక్షసన్‌’ పెద్ద హిట్టైంది. రజనీకాంత్ సైతం ఈ సినిమాని మెచ్చుకున్నారు. ‘ముండాసుపట్టి’తో ప్రతిభావంతుడైన దర్శకుడిగా నిరూపించుకున్న రామ్‌కుమార్‌ ఈ సినిమాని డైరక్ట్ చేసారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ కు డైరక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించే అవకాసం ఉందని తెలుస్తోంది. 

అయితే సుధీర్ వర్మ ఈ కథను అంతే సమర్ధవంతంగా మోసే హీరో కోసం ఎదురుచూస్తున్నారట. అందులో భాగంగా సాయి ధరమ్ తేజ అయితే ఎలా ఉంటారనే ఆలోచన వచ్చిందని సమాచారం. ఈ మేరకు సాయిని కలిసి..ఈ సినిమాని చూడమని చెప్పారట. 

సాయికి నచ్చితే ముందుకు వెళ్లే ఆలోచన ఉందిట. అయితే ఈ సినిమాలో సాయి రెగ్యులర్ సినిమాల్లో ఉండే మాస్ ఎలిమెంట్స్, పాటలు వంటివి ఉండవు. థ్రిల్లర్ మోడ్ లో సినిమా సాగుతుంది. కాబట్టి సాయి ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

20 ఏళ్ళ నాటి సీక్రెట్ చెప్పి న దీపికా పదుకొణె, షారుఖ్ కు షాక్ ఇచ్చిన నటి
నమ్రత ఎంత చెప్పినా వినకుండా డిజాస్టర్ చూసిన మహేష్ బాబు ? ఆ సినిమా చేసి తప్పు చేశాడా?