పోలీస్ పవర్ చూపిస్తానంటున్న కార్తీ

First Published Sep 12, 2017, 2:58 PM IST
Highlights
  • కార్తీ,రకుల్ జంటగా ఖాకి
  • వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఖాకి
  • నిర్మాతగా ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఉమేశ్ గుప్త

తమిళ నటుడు కార్తీ హీరోగా..రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ‘ఖాకి’. ది పవర్ ఆఫ్ పోలిస్ అనేది ఉపశీర్షిక. తమిళంలో ‘ధీరన్ అదిగారమ్ ఒండ్రు’ పేరుతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఖాకి పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు.

 

రెండు దశాబ్దాలుగా ఆడియో రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న సంస్థ ‘ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’. ఈ సంస్థ అధినేత ఉమేశ్ గుప్త.. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈసినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 

ఈ సందర్భంగా ‘ఆదిత్య మ్యూజిక్‌’ సంస్థ అధినేత ఉమేశ్‌ గుప్తా మాట్లాడుతూ– ‘‘ఇందులో కార్తీ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. లుక్స్, ఫిజిక్‌ పరంగా ఆయన చాలా కేర్‌ తీసుకున్నారు. 2005లో ఓ పత్రికలో వచ్చిన వాస్తవ సంఘటన ఆధారంగా దర్శకుడు హెచ్‌. వినోద్‌ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. కథ వినగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలని సినిమా రైట్స్‌ తీసుకున్నా. తెలుగులో ‘రన్‌ రాజా రన్‌’, ‘జిల్‌’, ‘బాబు బంగారం’, ‘హైపర్‌’ తదితర చిత్రాలకు అద్భుతమైన సంగీతమందించిన జిబ్రాన్‌ ఈ సినిమాకూ సూపర్‌ హిట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. అతి త్వరలో టీజర్ ను, పాటలను , చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

click me!