ఐశ్వర్యకి వేధింపులు తప్పలేదు.. 'మీటూ'పై ఆమె స్పందన!

By Udayavani DhuliFirst Published Oct 10, 2018, 1:31 PM IST
Highlights

బాలీవుడ్ లో తనుశ్రీదత్తా, నానాపటేకర్ ల వివాదంతో మీటూ ఉద్యమం ఉదృతంగా మారింది. లైంగికంగా వేధించబడ్డ బాధితులు ఒక్కొక్కరిగా బయటకి వస్తూ తము ఎదుర్కొన్న చేదు అనుభవాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. 

బాలీవుడ్ లో తనుశ్రీదత్తా, నానాపటేకర్ ల వివాదంతో మీటూ ఉద్యమం ఉదృతంగా మారింది. లైంగికంగా వేధించబడ్డ బాధితులు ఒక్కొక్కరిగా బయటకి వస్తూ తము ఎదుర్కొన్న చేదు అనుభవాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు బాధితులకు మద్దతు తెలుపుతూ ట్వీట్లు పెడుతున్నారు.

తాజాగా ఐశ్వర్యరాయ్ కూడా ఈ విషయంపై స్పందించారు. సోషల్ మీడియాకి కృతజ్ఞతలు చెబుతూ.. ప్రపంచంలో ఏ మూలన ఉన్న మహిళైనా సరే తన బాధను సోషల్ మీడియా వేదిక ద్వారా చెప్పుకోవచ్చు.. ప్రపంచం ఆమె బాధని వింటుందని అన్నారు. ఇలాంటి విషయాలను బయట పెట్టడానికి టైమ్ తో పని లేదనన్నారు. 

ఆలస్యంగానైనా.. మన దేశంలో మీటూ ఉద్యమం రావడం నిజంగా మంచి పరిణామమని అన్నారు. బాధితులందరికీ దేవుడు మనోబలాన్ని ఇవ్వాలని కోరుకున్నారు. గతంలో ఐశ్వర్యకి కూడా ఈ రకమైన వేధింపులు తప్పలేదు. 

సల్మాన్ ఖాన్ నుండి ఆమె విడిపోయిన తరువాత కూడా అతడు ఆమెని ప్రశాంతంగా ఉండనిచ్చేవాడు కాదని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 

ఇవి కూడా చదవండి..

నేను అలా చేసి ఉంటే ఐశ్వర్య బతికుండేదే కాదు.. సల్మాన్ వీడియో వైరల్!

#మీటూ అంటున్న గుత్తా జ్వాలా.. షాకింగ్ కామెంట్స్

నాతో బలవతంగా మందు తాగించి రేప్ చేశాడు.. నటుడిపై ఆరోపణలు!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు!

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

ఆ నిర్మాత దారుణంగా హింసించాడు.. నటి ఫోటోలు వైరల్!

 

 

click me!