Padamati Sandhyaragam: కోచ్ సర్ ని రిక్వెస్ట్ చేస్తున్న ఆధ్య.. బరిలోనే కుప్పకూలిన రామలక్ష్మి!

Published : Jun 17, 2023, 02:46 PM IST
Padamati Sandhyaragam: కోచ్ సర్ ని రిక్వెస్ట్ చేస్తున్న ఆధ్య.. బరిలోనే కుప్పకూలిన రామలక్ష్మి!

సారాంశం

Padamati Sandhyaragam: జీ తెలుగులో ప్రసారమవుతున్న పడమటి సంధ్యారాగం సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుంది. కూతురి ఇష్టాన్ని కాదనలేక, తన పద్ధతులని మార్చుకోలేక సతమతమవుతున్న ఒక తండ్రి కథ ఈ సీరియల్. ఈరోజు జూన్ 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

 ఎపిసోడ్ ప్రారంభంలో తండ్రి చూస్తుండగానే తల్లి ప్రోత్సాహంతో మ్యాచ్ కి బయలుదేరుతుంది రామలక్ష్మి. బరిలో అడుగుపెట్టేముందు తండ్రి మాటలు గుర్తొచ్చి అక్కడే ఆగిపోతుంది. ఆధ్య జానకమ్మకి సైగ చేయడంతో జానకమ్మ కూతురు దగ్గరికి వెళ్లి నేను మీ నాన్నగారికి అబద్ధం చెప్పి మరి ఎక్కడికి నిన్ను తీసుకువచ్చింది నీకు అలా నెరవేరటం కోసమే ఇప్పుడు నువ్వు ఆటలో గెలిస్తే అది ఎన్నో ప్రశ్నలకి సమాధానం అవుతుంది.

వెళ్ళు ఆడి, గెలు అని కూతురి తల మీద ముద్దు పెట్టి ప్రోత్సహించి పంపిస్తుంది. అదే ఆవేశంతో బరిలో దిగిన రామలక్ష్మి మంచి ఉత్సాహంతో  గేమ్ ఆడుతూ మంచి పాయింట్ లు తీసుకువస్తుంది. ఇదంతా చూస్తున్న రఘురాం కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన రామలక్ష్మి మళ్లీ డిసప్పాయింట్ అయిపోతుంది. ఆడలేక రాయిలా నిలబడిపోతుంది.

అది గమనించిన జానకమ్మ పరుగున భర్త దగ్గరికి వెళ్లి ఒక్క పది నిమిషాలు ఉండండి మీరు లేకపోతే రామలక్ష్మి ఆడలేదు. ఈ ఆటలో గెలవడం దాని ఆశయం అని బ్రతిమాలుకుంటుంది. నా మాటకి విలువ ఇవ్వకుండా నువ్వు మారిపోయింది కాకుండా నా కూతుర్ని కూడా మార్చేసావు నా మాటలకి విలువ లేని చోట నేను కూడా ఉండను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రఘురాం.

అప్పుడు ఆధ్య కోచ్ దగ్గరికి వెళ్లి సర్ మీరే రామలక్ష్మి ని ప్రోత్సహించాలి అని అడుగుతుంది. లేదు.. నేను తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని రామలక్ష్మి పోగొట్టుకుంది. రామలక్ష్మి మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని తను పోగొట్టుకుంది. ఈ మ్యాచ్ కూడా ఓడిపోయినట్లే ఉంటాడు కోచ్. లేదు సార్ తనకి ఆడాలని కసి ఇంకా ఉంది  మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే తను కచ్చితంగా ఆడుతుంది అని రిక్వెస్ట్ చేస్తుంది ఆధ్య.

సరే అంటూ రామలక్ష్మి దగ్గరికి వెళ్లి ఏం జరిగింది అని అడుగుతాడు కోచ్. నేను చాలా బాడ్ ప్లేయర్ని. మీ టీంలో నేను ఉండవలసిన దాన్ని కాను అని ఏడుస్తుంది రామలక్ష్మి. నువ్వు మంచి ప్లేయర్ వి కాకపోతే ఎందుకు మీ ఇంటికి వచ్చి మరి మీ నాన్నగారితో మాట్లాడుతాను. లే.. లేచి ఆడు. నీలో ఉన్న టాలెంట్ ని బయటకు తీయు నీకోసమే కాదు నిన్ను ఎంకరేజ్ చేస్తున్న ఆద్య కోసం, మీ గెలుపు కోసం ఎదురుచూస్తున్న మీ అమ్మగారి కోసం ఆడు అంటూ రామలక్ష్మి కి ఉత్సాహాన్ని ఇస్తాడు కోచ్.

కోచ్ ఇచ్చిన స్ఫూర్తితో మళ్ళీ బరిలో అడుగుపెడుతుంది రామలక్ష్మి. రామలక్ష్మి ఆటకి ఎదుటి టీం వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు తన సరిగ్గా ఆడిందంటే మన టీం ఓడిపోవలసిందే అందుకే తను నడవనీయకుండా చేద్దాం అని చెప్పి కావాలనే ఆమె కిందపడి స్పృహ కోల్పోయేలాగా చేస్తారు. రామలక్ష్మి తగిలిన దెబ్బకి బరిలోనే కుప్పకూలిపోతుంది. మరోవైపు రఘురాం బండి ఎంతకీ స్టార్ట్ అవ్వదు.

అప్పుడే అటువైపుగా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ వస్తారు. ఓడిపోతుందనుకున్న టీం ని గెలిపిస్తుంది రామలక్ష్మి. నిజంగా ఆ అమ్మాయిని కాదు తన తల్లిదండ్రులని మెచ్చుకోవాలి తండ్రి సపోర్ట్ ఉంటే ఏ ఆడపిల్ల అయినా విజయాన్ని సాధిస్తుంది అని మాట్లాడుకోవడం వింటాడు రఘురాం. మరోవైపు స్పృహ కోల్పోయిన రామలక్ష్మిని చూసి కోచ్ దగ్గరికి వెళ్లి నువ్వు రికమెండ్ చేసిన క్యాండిడేట్ అలా పడిపోయి ఉంది ఈ మ్యాచ్ కూడా గెలవలేము. నీ జాబ్ కూడా ఉంటుందో లేదో అంటూ కోపంగా మాట్లాడుతాడు ప్రిన్సిపల్.

 అదే సమయంలో ఒక టీమ్ మెంబర్ తల్లిదండ్రులు బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ రామలక్ష్మి దీన్ని గెలిపిస్తుంది అనుకున్నాను కానీ తనే గొప్ప కోల్పోయింది ఈ మ్యాచ్ ఓడిపోతే మన అమ్మాయి ఆశలన్నీ అయిపోతాయి కానీ కన్నీరు పెట్టుకుంటారు ఆ తల్లిదండ్రులు. ఆ మాటలు విన్న రఘురాం షాక్ అవుతాడు. మరోవైపు కోచ్ వెళ్లి రామలక్ష్మి లేపటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

PREV
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Jan 28: అమూల్యను అర్థరాత్రి ఎత్తుకెళ్లి నిజస్వరూపం చూపించిన విశ్వక్
Gunde Ninda Gudi Gantalu: ప్రభావతి నడుము విరగ్గొట్టిన మీనా, మనోజ్ నోరు మూయించిన శ్రుతి