‘ఆదిపురుష్’ బాక్సాఫీస్ వద్ద తొలిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రాబట్టిన వసూళ్ల వివరాలు వచ్చాయి. ఎన్ని కోట్ల వరకు కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం.
ప్రపంచ వ్యాప్తంగా ‘ఆదిపురుష్’ చిత్రం నిన్న (జూన్16) విడుదలైన విషయం తెలిసిందే. ఎన్నో విమర్శలు, వివాదాలను దాటుకొని థియేటర్ లోకి అడుగుపెట్టింది. చివరల్లో భారీ అంచనాలను నెలకొల్పిన ఈ చిత్రం ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆడియెన్స్ ఇచ్చిన రివ్యూలను బట్టి ఈ విషయం అర్థమవుతోంది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం Adipurush రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది. ఈ సందర్భంగా తొలిరోజు ఎన్ని కోట్ల వరకు కలెక్ట్ చేసిందో యూనిట్ అధికారికంగా వెల్లడించింది.
తొమ్మిదివేల వరకు థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అన్ని ఏరియాల్లో మాసీవ్ ఓపెనింగ్ తో స్టార్ అయ్యింది. తెలుగు స్టేట్స్ మరియు హిందీ, ఓవర్సీస్ లో మంచి వసూళ్లు ను సాధించింది. తాజాగా తొలిరోజు కలెక్షన్ల వివరాలు అందాయి. మేకర్స్ ప్రకటించిన దాని ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా అదిపురుష్ రూ.140 కోట్ల వరకు వసూళ్లు సాధించిందని తెలిపారు. కలెక్షన్ల పరంగా బ్రహ్మండమైన విజయాన్ని అందించారని సంతోషం వ్యక్తం చేశారు.
ఆదిపురుష్ మొదటి రోజు మొత్తం WW కలెక్షన్స్ రిపోర్ట్ చేస్తూ..
నైజాం: 13.68 కోట్లు
సీడెడ్: 3.52 కోట్లు
యూఏ : 3.72 కోట్లు
తూర్పు: 2.78 కోట్లు
పశ్చిమ: 2.24 కోట్లు
గుంటూరు: 4 కోట్లు (1.21cr అద్దెలు)
కృష్ణ: 2 కోట్లు
నెల్లూరు: 90 లక్షలు వసూళ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. AP-TG లో కలిపి మొత్తం మొత్తంగా రూ.60 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తోంది.
హిందీ బెల్డ్ : 45 కోట్ల గ్రాస్
కర్ణాటక : 8.17 కోట్లు
తమిళనాడు: 0.76 కోట్లు
కేరళలో : 0.26కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే అమెరికాలో మొదటి రోజు 1.5 మిలియన్ల డాలర్లు వసూల్ చేసింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా టోటల్ గా రూ.140 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.240 కోట్లు చేసినట్టు తెలుస్తోంది. దీంతో రూ.245 కోట్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి అవుతుంది. ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి ఈ లక్ష్యాన్ని దాటనుందని అంటున్నారు.
ఇక ప్రభాస్ నటించిన Baahubali2 ఓపెనింగ్ డే రూ. 213 కోట్లు సాధించింది. యాక్షన్ ఫిల్మ్ సాహో కూడా రూ.125 కోట్లు మొదటిరోజు కలెక్ట్ చేసింది. ఇక ఆదిపురుష్ రూ.140 కోట్లు సాధించడం విశేషం. సౌత్ ఇండియా ఫిల్మ్స్ లో ఆర్ఆర్ఆర్ ఓపెనింగ్ రూ.232 కోట్లు సాధించి మొదటి స్థానంలో ఉంది. చిత్రంలో ప్రభాస్ - కృతి సనన్ సీతారాములుగా నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్త హనుమంతుడి పాత్రలో జీవించారు. సైఫ్ అలీఖాన్ రావణుడిగా మెప్పించారు.
The triumph of at Global Box Office with a record-breaking opening of ₹ 140 CR.! This cinematic extravaganza shatters all the records and conquers the heart of audience across ages! The true-blue family blockbuster, this magnum opus has especially captivated the… pic.twitter.com/1xrI5lmiIx
— People Media Factory (@peoplemediafcy)