శరత్ బాబుతో సంబంధంపై క్లారిటీ ఇచ్చిన నమిత

Published : Oct 17, 2017, 08:10 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
శరత్ బాబుతో సంబంధంపై క్లారిటీ ఇచ్చిన నమిత

సారాంశం

గత కొంత కాలంగా శరత్ బాబు, నమితల రిలేషన్ షిప్ గురించి రూమర్స్ శరత్ బాబుతో సంబంధంపై క్లారిటీ ఇచ్చిన నమిత తనకు శరత్ బాబుతో సంబంధమా అంటూ అవాక్కయిన నమిత ఇప్పటికే నమితను చూసి ఎనిమిదేళ్లయిందని స్పష్టం చేసిన శరత్ బాబు

తన బొద్దు ముద్దు అందాలతో టాలీవుడ్ నేకాక కోలీవుడ్ ను ఊపేసిన ముద్దుగుమ్మ నమిత సీనియర్ నటుడు శరత్ బాబుని పెళ్లి చేసుకోబోతుందని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల క్రితమే ఈ రూమర్స్‌పై స్పందించిన శరత్ బాబు అదంతా కేవలం పుకార్లేనని కొట్టిపారేశాడు. అసలు ఆమెని చూసే ఎనిమిదేళ్లయిందని, ఆమెతో ఇప్పుడు నాకు పెళ్లేంటి అని స్పష్టంచేశాడు శరత్ బాబు. ఇదిలావుంటే, తాజాగా ఈ రూమర్స్ పై నమిత కూడా స్పందించింది.



శరత్ బాబుని పెళ్లి చేసుకోనున్న నమిత అని వస్తున్న వార్తల్ని చూసిన నమిత ఒక్కసారిగా అవాక్కయ్యిందట. జనం ఇలా ఎలా నోటికొచ్చినట్టు పుకార్లు గురించి చెప్పుకుంటారు అని ఆశ్చర్యం వ్యక్తం చేసిన నమిత అందులో ఇసుమంతైనా నిజం లేదని తీవ్రంగా ఖండించింది.

PREV
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం