
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పీఎస్‌పీకే 25 లో పవన్ కళ్యాణ్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలోంచి కీర్తి సురేష్‌కి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ని రిలీజ్ చేసింది ఆ చిత్ర నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్. కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు చెబుతూ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఈ స్పెషల్ పోస్టర్‌ని విడుదల చేసింది.
త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా నుంచి గతంలోనే పవన్, కీర్తి సురేష్ ఇద్దరూ కలిసి వున్న ఫోటో ఒకటి రిలీజవడమేకాకుండా ఇంటర్నెట్‌లో సందడి చేస్తోంది కూడా. అయితే కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్భంగా తను మాత్రమే వున్న కలర్ ఫుల్ ఫోటోను రిలీజ్ చేసి చిత్ర యూనిట్ సర్ ప్రైజ్ ఇవ్వడం విశేషం.