షాకింగ్.. బిగ్ ఆఫర్ చేజార్చుకున్న అమలాపాల్

pratap reddy   | Asianet News
Published : Nov 17, 2021, 04:35 PM IST
షాకింగ్.. బిగ్ ఆఫర్ చేజార్చుకున్న అమలాపాల్

సారాంశం

ఇటీవల అమలాపాల్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారుతోంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో అమలాపాల్ హాట్ టాపిక్ గా మారుతోంది. కెరీర్ ఆరంభంలో ఎక్కువగా అమలాపాల్ కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది.

ఇటీవల అమలాపాల్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారుతోంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో అమలాపాల్ హాట్ టాపిక్ గా మారుతోంది. కెరీర్ ఆరంభంలో ఎక్కువగా అమలాపాల్ కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. కానీ ప్రస్తుతం ఆమె బోల్డ్ పాత్రలు ఎంచుకుంటూ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. దర్శకులు కూడా అలాంటి కథలతోనే ఆమెని అప్రోచ్ అవుతున్నారు. 

పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. ఆడై చిత్రంలో Amala Paul న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. తెలుగులో 'ఆమె' పేరుతో ఆ చిత్రం విడుదలయింది. ఇదిలా ఉండగా ఓ క్రేజీ ఆఫర్ ని అమలాపాల్ చేజార్చుకున్నట్లు తెలుస్తోంది. 

కింగ్ Nagarjuna ప్రస్తుతం బంగార్రాజు చిత్రంతో పాటు.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'Ghost' మూవీలో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రం భారీ యక్షన్ అంశాలతో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ముందుగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఎంపికైంది. వారం పాటు షూటింగ్ లో కూడా పాల్గొంది. కానీ అనుకోని విధంగా కాజల్ ఈ చిత్రం నుంచి తప్పుకుంది. కాజల్ గర్భవతి కావడంతో ఈ మూవీ నుంచి వైదొలిగిందంటూ రూమర్స్ వినిపించాయి. 

దీనితో చిత్ర యూనిట్ మరో హీరోయిన్ వేటలో పడింది. ఇప్పటికే ప్రవీణ్ సత్తారు పలువురు హీరోయిన్స్ ని సంప్రదించగా ఎవరూ సెట్ కావడం లేదు. రీసెంట్ గా ఘోస్ట్ నిర్మాతలు అమలాపాల్ ని సంప్రదించారట. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ గురించి వివరించారట. అమలాపాల్ కూడా ఈ ఆఫర్ పట్ల చాలా ఎగ్జైట్ అయినట్లు తెలుస్తోంది. 

కానీ రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలకు ఆమెకు పొత్తు కుదర్లేదట. తాను డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ కి నిర్మాతలు సుముఖంగా లేకపోవడంతో అమలాపాల్ ఈ ఆఫర్ వదులుకున్నట్లు తెలుస్తోంది. అమలాపాల్ నాగార్జున తనయుడు నాగ చైతన్యతో కలసి దాదాపు పదేళ్ల క్రితం బెజవాడ చిత్రంలో రొమాన్స్ చేసింది. ఇప్పుడు నాగార్జునతో కలసి నటించే ఛాన్స్ వదులుకుంది. 

Also Read: Bigg Boss Telugu 5: ట్రైలర్ లోనే అసభ్యంగా.. సిరిపై నటుడి హాట్ కామెంట్స్, హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తే..

ఇదిలా ఉండగా ఘోస్ట్ నిర్మాతలు మెహ్రీన్ ని కూడా సంప్రదించారట. ఆమె ఈ చిత్రానికి రూ. కోటి పైగా పారితోషికం డిమాండ్ చేసి ఊహించని షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా నాగ్ ఘోస్ట్ చిత్రంలో హీరోయిన్ వ్యవహారం అంత త్వరగా తేలేలా కనిపించడం లేదు. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే