విషాదంః కరోనాతో ప్రముఖ దర్శక, నటుడు ఆర్ఎన్‌ఆర్‌ మనోహర్‌ కన్నుమూత

Published : Nov 17, 2021, 04:23 PM ISTUpdated : Nov 17, 2021, 04:24 PM IST
విషాదంః కరోనాతో ప్రముఖ దర్శక, నటుడు ఆర్ఎన్‌ఆర్‌ మనోహర్‌ కన్నుమూత

సారాంశం

ఆర్‌ఎన్‌ఆర్‌ మనోహర్‌.. నటుడిగా, దర్శకుడిగా కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. `మాసిలమణి` చిత్రంతో బాగా పాపులర్‌ అయ్యాడు. దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

కోలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు ఆర్‌ఎన్‌ఆర్‌ మనోహర్‌(54)(RNR Manohar) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆయన చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు కొన్ని రోజుల క్రితం కరోనా సోకింది. దీంతో ఆసుపత్రి పాలయ్యారు. గత 20 రోజులుగా కరోనాతో పోరాడుతూ చివరికి ఈ రోజు(బుధవారం) ఉదయం RNR Manohar కన్నుమూశారు. మనోహర్‌ మరణంపై తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. 

ఆర్‌ఎన్‌ఆర్‌ మనోహర్‌.. నటుడిగా, దర్శకుడిగా కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. `మాసిలమణి` చిత్రంతో బాగా పాపులర్‌ అయ్యాడు. దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తొలి చిత్రంతోనే దర్శకుడిగా నిరూపించుకున్నారు. ఇందులో నకుల్‌, సునైనా జంటగా నటించారు. ఈ సినిమా మంచి కమర్షియల్‌ హిట్‌తోపాటు ప్రశంసలందుకుంది. ఇక 1994లో `మైందన్‌` చిత్రంతో కో డైరెక్టర్గా, రైటర్‌గా కెరీర్‌ని ప్రారంభించాడు మనోహర్‌.  ప్రముఖ దర్శకుడు కెఎస్‌ రవికుమార్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆయన వద్ద `బ్యాండ్‌ మాస్టర్‌`, `సూరియన్‌ చంద్రన్‌` చిత్రాలకు వర్క్ చేశారు. ఈ క్రమంలో 2009లో `మాసిలమణి` చిత్రంతో దర్శకుడిగా మారారు. 

అంతకంటే ముందు 1995లో `కోలంగల్‌` చిత్రంతో నటుడిగా తెరంగేట్రం చేశారు. దాదాపు 45 చిత్రాల్లో నటుడిగా మెప్పించారు. తెలుగులో నాగచైతన్య నటించిన `సాహసం శ్వాసగా సాగిపో` చిత్రంలో హీరోకి తండ్రి పాత్రలో నటించారు మనోహర్. నటుడిగా `కళ్లజాగర్‌`, `ధిల్‌`, `సుత్తా పజమ్‌`, `యా యా`, `వీరం`, `కాలా కూతు`, `విశ్వాసం`, `అయోగ్య`, `ఖైదీ`, `కాప్పాన్‌`, `భూమి` చిత్రాల్లో నటించారు. చివరగా ఆర్య,సాయేషా నటించిన `టెడ్డీ `చిత్రంలో నటించారు మనోహర్. రైటర్‌గా, దర్శకుడిగా, నటుడిగా తమిళనాట విశేష గుర్తింపు తెచ్చుకున్న ఆర్‌ఎన్‌ఆర్‌ మనోహర్‌ మరణంగా కోలీవుడ్‌కి తీరని లోటని సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. 

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్