Bheemla Nayak: 'భీమ్లా నాయక్' ఎఫెక్ట్.. సంక్రాంతి ఫైట్ పై ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశం

By telugu team  |  First Published Nov 17, 2021, 1:47 PM IST

టాలీవుడ్ లో సంక్రాంతి ఫైట్ ఉత్కంఠని రేకెత్తిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా మూడు భారీ చిత్రాలు సంక్రాంతి ఫైట్ లో నిలిచాయి.


టాలీవుడ్ లో సంక్రాంతి ఫైట్ ఉత్కంఠని రేకెత్తిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా మూడు భారీ చిత్రాలు సంక్రాంతి ఫైట్ లో నిలిచాయి. వీటిలో రాజమౌళి ఆర్ఆర్ఆర్, ప్రభాస్ 'రాధే శ్యామ్' పాన్ ఇండియా చిత్రాలు కాగా మరొకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీ. 

Bheemla Nayak, Radhe Shyam, Sarkaru Vaari Paata చిత్రాలు ముందుగానే సంక్రాంతి బెర్తులు ఖరారు చేసుకున్నాయి. కానీ ఊహించని విధంగా ఆర్ఆర్ఆర్ చిత్రం సంక్రాంతి రేసులోకి ఎంటర్ కావడంతో ఫైట్ హాట్ హాట్ గా మారిపోయింది. దీనితో సర్కారు వారి పాట చిత్రం విడుదల వాయిదా వేసుకుంది. అదే తరుణంలో పవన్ 'భీమ్లా నాయక్' చిత్రం కూడా వాయిదా పడుతుంది అంటూ వార్తలు వచ్చాయి. 

Latest Videos

కానీ తమ విడుదల తేదీలో ఎలాంటి మార్పులు లేవని.. ముందుగా అనుకున్నట్లుగానే జనవరి 12నే బరిలోకి దిగబోతున్నట్లు భీమ్లా నాయక్ నిర్మాత స్పష్టం చేశారు. విడుదల తేదీ ప్రకటిస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన పోటీ ఉంటే బావుంటుంది. కానీ ఇలా మూడు భారీ చిత్రాలు ఒకేసారి విడుదలైతే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టం తప్పదు. 

దీనితో ఈ సమస్యని పరిష్కరించేందుకు టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. భీమ్లా నాయక్ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేయాలని నిర్మాత సూర్య దేవర నాగవంశీపై ఒత్తిడి ఉన్నప్పటికీ ఆయన ససేమిరా అంటున్నట్లు టాక్. 

Also Read: మైండ్ బ్లోయింగ్ హాట్.. అవార్డుల వేడుకలో దివి అందాల విధ్వంసం, కుర్రాళ్లు ఉక్కిరి బిక్కిరి

దీనితో మూడు చిత్రాల్లో ఎదో ఒక చిత్రం విడుదల వాయిదా వేసుకునేలా ప్రొడ్యూసర్స్ గిల్డ్ సూచించబోతున్నట్లు తెలుస్తోంది. RRR Movie, రాధే శ్యామ్ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న మూవీస్. ఆ రెండింటి విడుదల వాయిదా వేయడం సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి భీమ్లా నాయక్ చిత్రమే మరో రిలీజ్ డేట్ చూసుకునేలా నిర్మాతల గిల్డ్ ప్రపోజల్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి దీనికి భీమ్లా నాయక్ టీమ్ ఒప్పుకుంటుందా అనేది సందేహంగా మారింది. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు భీమ్లా నాయక్ కోసం థియేటర్స్ కూడా బుక్ చేసుకుంటున్నారట. 

Also Read: నిర్మాతలతో లైంగికంగా.. క్యాస్టింగ్ కౌచ్ పై భూమిక ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న ఈ చిత్రాన్ని సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్నారు. పవన్ కి జోడిగా నిత్యామీనన్, రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. ఇప్పటికే విడుదలైన కొన్ని పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.  

click me!