మరలా ఆసుపత్రిలో చేరిన కెప్టెన్‌ విజయకాంత్...ఆయన ఆరోగ్యంపై డీఎండీకే  పార్టీ వివరణ

Published : Oct 07, 2020, 04:53 PM IST
మరలా ఆసుపత్రిలో చేరిన కెప్టెన్‌ విజయకాంత్...ఆయన ఆరోగ్యంపై డీఎండీకే  పార్టీ వివరణ

సారాంశం

నటుడు మరియు రాజకీయవేత్త విజయ్ కాంత్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు ఆ పార్టీ వర్గాలకు చెక్ పెట్టాయి. విజయ్ కాంత్ తాజా ఆరోగ్య పరిస్థితిపై వారు ఓ లేఖ విడుదల చేయడం జరిగింది. దీనితో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.   

సీనియర్ నటుడు, రాజకీయవేత్త విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో అనేక కథనాలు వెలువడుతూ ఉండగా డీఎండీకే పార్టీ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. సామాజిక మాధ్యమాలలో ప్రచారం అవుతున్న వార్తలలో ఎంత మాత్రం నిజం లేదని వివరించారు.  తాజా ప్రకటనతో విజయ్ కాంత్  ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతున్న ఆయన ఫ్యాన్స్ ఒకింత ఊపిరి పీల్చుకున్నారు. 

గత నెల 22న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనకు కొవిడ్‌-19 సోకిందని తేల్చారు. అనంతరం చికిత్స తీసుకున్న విజయకాంత్‌ కోలుకున్నాక ఈ నెల 2న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. నిన్న సాయంత్రం ఆయన మరోసారి అస్వస్థతకు గురి కావడంతో మళ్లీ ఆసుపత్రిలో చేరారు. 

కాగా, ఆయన ఆరోగ్య పరిస్థితిపై సామాజిక మాధ్యమాల్లో ఎన్నో వదంతులు వస్తున్నాయి. దీంతో డీఎండీకే పార్టీ దీనిపై ప్రకటన చేసింది. విజయకాంత్  ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపింది. తదుపరి ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారని, సామాజిక మాధ్యమాల్లో ఆయన గురించి వస్తోన్న వార్తలను నమ్మవద్దని చెప్పింది.

PREV
click me!

Recommended Stories

Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది
8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్