Maa Elections: ‘‘ జెండా ఎగరేస్తాం’’ .. వైరల్ అవుతోన్న ప్రకాశ్ రాజ్ ట్వీట్

Siva Kodati |  
Published : Aug 14, 2021, 05:48 PM ISTUpdated : Aug 14, 2021, 05:50 PM IST
Maa Elections: ‘‘ జెండా ఎగరేస్తాం’’ .. వైరల్ అవుతోన్న ప్రకాశ్ రాజ్ ట్వీట్

సారాంశం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో విలక్షణ నటుడు  ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘‘ జెండా ఎగురవేస్తామని ’’ ట్వీట్ చేశారు. మా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారంటూ సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి తన విలక్షణను ప్రదర్శించారు. జస్ట్ రెండే రెండు పదాల్లో ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ‘‘ జెండా ఎగురవేస్తామని ’’ ట్వీట్ చేశారు. మా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారంటూ సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మా ఎన్నికలు ఎప్పుడంటూ నెల క్రితం ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత తెగేవరకు లాగొద్దంటూ 10 రోజుల క్రితం మరో ట్వీట్ చేశారు. 

కాగా.. తమిళ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు. మరోవైపు మా ఎన్నికల్లోనూ ఆయన ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇలాంటి సమయంలో.. ఆయన షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. చేతికి గాయం కావడంతో...  మెరుగైన చికిత్స కోసం చెన్నై నుంచి హైదరాబాద్ కి వచ్చారు.

ALso Read:జీవిత హర్టై ఉంటారు, ఎన్ని అవమానాలు జరిగితే హేమ అంత గట్టిగా మాట్లాడుతుంది: ప్రకాశ్ రాజ్

ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. డెవిల్ ఈజ్ బ్యాక్.. సర్జరీ పూర్తయ్యిందంటూ ట్వీట్ చేశారు. తన మిత్రుడు డాక్టర్ గురువారెడ్డి సర్జరీ చేసినట్లు చెప్పారు. తాను క్షేమంగా ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ దన్యవాదాలు తెలియజేశారు. త్వరలోనే తాను మళ్లీ తిరిగి నటిస్తానంటూ ప్రకటించారు.


 

PREV
click me!

Recommended Stories

IMDB మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్.. టాప్ 20లో ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారంటే?
నయనతార హీరోయిన్ గా ఒకే కథతో 3 సినిమాలు.. ముగ్గురు స్టార్ హీరోలు ఎవరు?