గర్వంతో పోలీసులకే సవాల్.. హాట్ బాంబ్ పనిపట్టేశారు

pratap reddy   | Asianet News
Published : Aug 14, 2021, 05:43 PM IST
గర్వంతో పోలీసులకే సవాల్.. హాట్ బాంబ్ పనిపట్టేశారు

సారాంశం

సోషల్ మీడియా హాట్ బ్యూటీ మీరా మిథున్ ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. నోరు అదుపులో లేకుండా ప్రవర్తించడంతో ఆమెని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల దళితులని కించపరిచేలా కామెంట్స్ చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది.

సోషల్ మీడియా హాట్ బ్యూటీ మీరా మిథున్ ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. నోరు అదుపులో లేకుండా ప్రవర్తించడంతో ఆమెని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల దళితులని కించపరిచేలా కామెంట్స్ చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. దీనితో మీరా మిథున్ తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొంది. 

ఆమెపై కేసులు కూడా నమోదయ్యాయి. మీరా మిథున్ ని వెంటనే అరెస్ట్ చేయాలనే డిమాండ్ కూడా వినిపించింది. తనపై వస్తున్న ట్రోలింగ్, పోలీస్ కేసులపై మీరా మిథున్ గర్వంతో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 'నన్ను పోలీసులు అరెస్ట్ చేయాలంటే అది కలలో మాత్రమే సాధ్యం అవుతుంది' అని పొగరుగా కామెంట్స్ చేసింది. 

కట్ చేస్తే ప్రస్తుతం మీరా మిథున్ కటకటాల వెనుక ఉంది. శనివారం రోజు కేరళ పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు. ఆమెని అరెస్ట్ చేసే టైంలో మీరా మిథున్ నానా హంగామా చేసినట్లు టాక్. ఆమె రూమ్ కి పోలీసులు ప్రవేశించగానే.. పోలీసులు తనని హరాజ్ చేస్తున్నారని.. బలవంతం చేస్తున్నారని ఫోన్ లో వీడియో తీసినట్లు తెలుస్తోంది. 

ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయమని పోలీసులు అడిగినా పట్టించుకోకుండా హై డ్రామా చేసిందట. కానీ చివరకు పోలీసులు ఆమెని అరెస్ట్ చేసి.. దళితులపై చేసిన కామెంట్స్ గురించి దర్యాప్తు చేస్తున్నారు. 

మీరా మిథున్ మోడల్ గా గుర్తింపు పొందింది. తమిళ బిగ్ బాస్ లో కూడా పాల్గొంది. సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఇన్స్టాగ్రామ్ లో అతిగా అందాల ప్రదర్శన చేస్తూ హాట్ బాంబ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. 

 

PREV
click me!

Recommended Stories

Toxic Cast Remuneration: రెమ్యూనరేషన్‌లో యష్‌ కి నయనతార గట్టి పోటీ.. టాక్సిక్ స్టార్ల జీతాల వివరాలు
Sridivya without Makeup: మేకప్ లేకుండా నేచురల్‌ అందంతో కట్టిపడేస్తున్న శ్రీదివ్య.. లేటెస్ట్ ఫోటోలు