నటి సమంత తన స్టైలిష్ లుక్ తో అందరినీ ఆకర్షిస్తోంది, ముఖ్యంగా ఆమె ధరించే దుస్తులు, ఆభరణాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఖరీదైన బల్గరీ సర్పెంటీ వాచ్ తో సమంత ఇటీవల వార్తల్లో నిలిచింది.
చాలా కాలం అయ్యింది సమంత స్క్రీన్ మీద కనిపించి.. ఇక తాజాగా ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతోంది టాలీవుడ్ బ్యూటీ. ఈక్రమంలోనే సమంతకు సబంధించిన ఓన్యూస్ వైరల్ అవుతోంది.
సమంత టాలీవుడ్ స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళ భాషల్లో ఆల్మోస్ట్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది బ్యూటీ. ఆమధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చి కనిపించకుండా పోయిన్ ఈ హీరోయిన్.. రీసెంట్ గా మళ్లీ తన సినిమాలు మొదలు పెట్టడానికి రెడీ అయ్యింది. అటు
సోషల్ మీడియాలో కూడా సమంత హడావిడి మొదలయ్యింది. వరుస ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది బ్యూటీ.
ఒరేయ్ తమ్ముడు అంటూ.. మహానటి సావిత్రి ప్రేమగా పిలిచే స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?
ఖుషి సినిమా తరువాత రెస్ట్ కోసం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత.. ఏడాదిన్నరకు పైగా రెస్ట్ తీసుకుంది. తనకు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్ కు ట్రీట్మెంట్ చేయించుకుంది. తనకు నచ్చిన ప్లేస్ లు తిరిగింది. హ్యాపీగా ఎంజాయ్ చేసిన ఆమె.. రీసెంట్ గానే మళ్లీ తన పని మొదలు పెట్టింది. ఈక్రమంలోనే సామ్.. ఇటీవలే సిటాడెల్ వెబ్ సిరీస్ టీమ్ మెంబర్స్‌తో సందడి చేసింది. సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది.
అంతే కాదు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు చాలా ప్రెస్టేజియస్ గా ఫీల్ అయ్యే ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ను కూడా అందుకుంది సమంత. ఈమధ్య దుబాయ్ వేదికగా జరిగిన ఐఫా 2024 వేడుకలలో ఈ పురస్కారాన్ని అందుకుంది సామ్. దీంతో ఆమెకు బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఈవెంట్ లో సమంతను చూసి అంతా షాక్ అయ్యారు స్టైలీష్ లుక్ లో మెరిసిపోయింది బ్యూటీ.
ఈవెంట్స్, పార్టీలలో తన స్టైల్‌తో అందరిని ఆశ్చర్యపరిచింది. తన ఫ్రెండ్ క్రేషా బజాజ్ రూపొందించిన అద్భుతమైన పాస్టెల్ గ్రీన్ కో-ఆర్డ్ సెట్‌తో సమంత అద్భుతంగా కనిపించింది. అభిమానులను అలరించింది. ఇక ఈ గ్రీన్ స్టైలీష్ డ్రెస్సుకు తగినట్లుగా మాచింగ్ జువ్వెల్లరీ కూడా వేసుకుంది సమంత. అందులో గోల్డ్ ఇయర్ రింగ్స్ తో పాటు.. తన వాక్ కూడా మరింత స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.
శ్రీదేవికి అహంకారం ఎక్కువ.. జయప్రద కామెంట్స్
తన లుక్ కు తగినట్లుగా విలాసవంతమైన బల్గారీ సర్పెంటీ వాచ్ ధరించింది సమంత. ఈవాచ్ వల్ల సమంత లుక్ కంప్లీట్ గా మారిపోయింది. అంతే కాదు ఈ వాచ్ కాస్త్ కూడా భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఆ వాచ్ చూసిన ఆడియన్స్ దాని రేటు ఎంతో వెతకడం స్టార్ట్ చేశారు. సామ్ లుక్ ను మరింత అందంగా మార్చిన ఆ లగ్జరీ బల్గారీ వాచ్ ధర దాదాపుగా 45.5 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. దాంతో ఈ విషయం తెలుసుకుని అంతా షాక్ అవుతున్నారు.
కొన్నాళ్లుగా సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఆమెకు మయోసైటిస్ వ్యాధి ఉంది అని కొన్నేళ్ల క్రితం తెలిసింది. ఇక అప్పటి నుంచి సినిమాలు తగ్గించింది సామ్. ట్రీట్మెంట్ తీసుకుంటూనే.. సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తోంది. అంతే కాదు ఆమె తన జీవితాన్ని చాలా పద్దతిగా ప్లాన్ చేసుకుంటూ వస్తోంది. రోజు యోగా, మెడిటేషన్ చేస్తూ తన ఫాలోవర్లకు సైతం ఆరోగ్య సూచనలు ఇస్తుంది.
ఇక జిమ్ విషయంలో ఆమె ఎంత కష్టపడుతుందో అందరికి తెలిసిందే. రోజులో ఎక్కువ సేపు జిమ్ లో ఉండమన్నా ఆమె ఉంటుంది. ఫిట్ నెస్ కు.. హెల్త్ కుఅంత ఇంపార్టెన్స్ ఇస్తుంది సమంత. ఇక తన వ్యాధికి కూడా దేవ శిదేశాల్లో అన్ని రకాల ట్రీట్మెంట్లను ఆమె ట్రై చేసింది. అంతే కాదు రెగ్యూలర్ ట్రీట్మెంట్ తో పాటు.. ఆయుర్వేదం, హోమియోపతి లాంటి డిఫరెంట్ వాటిని కూడా ఆమె ట్రై చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఆమె ఎంత వరకు కోలుకుంది అనేది మాత్రం ఇంత వరకూ తెలియదు.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన సమంత.. స్టార్ హీరోలతో ఆడి పాడింది. అంతే కాదు ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఈ సినిమాలో నటించని నాగచైతన్యను ప్రేమించి.. ఆ ప్రేమను చాలా సీక్రేట్ గా మెయింటేన్ చేసి.. ఎక్కడా దొరక్కుండా బాగా మానేజ్ చేశారు. ఇద్దరు చాలా కాలం ప్రేమించుకుని.. చివరకు 2017 లో పెళ్లి చేసుకున్నారు.
క్రిష్టియన్ అయిన సమంతను రెండు పద్దతుల్లో పెల్ళాడాడు చైతన్య. క్రిష్టియన్ పద్దతితో పాటు.. హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి పెళ్ళి జరిగింది. కాని వీరి పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు. దాదాపు 3 ఏళ్లు కలిసి కాపురం చేసిన ఈ స్టార్ కపుల్.. ఆతరువాత మనస్పర్ధలతో 2021 లో విడాకులు తీసుకున్నారు. పెళ్ళి జరిగిన కొంత కాలానికే వీరి మధ్య గొడవలు స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది.