ఈ చిత్రం రీసెంట్ రీసెన్సార్‌కు వెళ్లింది (The Greatest of All Time). అందుకు కారణం ఇప్పుడు తమిళ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ (Vijay) హీరోగా రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (ది గోట్). సెప్టెంబరు 5న విడుదల కానున్న ఈ సినిమాకు దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకుడు. ఈ చిత్రం రీసెంట్ రీసెన్సార్‌కు వెళ్లింది (The Greatest of All Time). అందుకు కారణం ఇప్పుడు తమిళ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చిత్ర టీమ్ కి కొన్ని మార్పులు సూచించిన బోర్డు.. మరోసారి సెన్సార్ చేసింది.
యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా ఫైనల్ రన్‌టైమ్ (The GOAT Movie Run Time) ఇంతకుముందు 2: 59 గంటలు. లేటెస్ట్ గా రీ సెన్సార్ చేసిన తర్వాత 3:03 గంటలు (ఫన్ బ్లూపర్స్‌తో కలిపి) రన్ టైమ్ పెరిగింది. అసలు ఉన్న రన్ టైమే ఎక్కువ మళ్లీ దాన్ని పెంచి రీసెన్సార్ చేయించటమేంటి అంటున్నారు. విజయ్ కెరీర్ లోనే ఎక్కువ రన్ టైమ్ ఉన్న సినిమా నంబన్ (తెలుగులో స్నేహితుడు). మళ్లీ ఇప్పుడు ఈ చిత్రం. ఎక్కువ లెంగ్త్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవుతున్నారని వినపడుతున్న ఈ టైమ్ లో ఇలా రన్ టైమ్ పెంచటం అదీ రీసెన్సార్ చేసి మరీ అనేది ఆశ్చర్యమే అంటున్నారు విశ్లేషకులు.
సెన్సార్ బోర్డు చెప్తున్న మేరకు.. ఓ లేడీ క్యారెక్టర్‌కు సంబంధించిన రియాక్షన్ షాట్‌ను తొలగించిన ‘ది గోట్’ టీమ్.. రెండు సెకన్ల నిడివి ఉన్న షాట్‌ను మరో షాట్‌తో భర్తీ చేసింది.సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి ‘డీ-ఏజింగ్’ టెక్నాలజీ వినియోగించారు. దీని సాయంతో విజయ్‌ని పాతికేళ్ల కుర్రాడిగా చూపించనున్నారు.
ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా కీలక పాత్రలు పోషించారు. కోలివుడ్ చరిత్రలోనే భారీ స్థాయిలో (తమిళనాడులో ఉన్న దాదాపు అన్ని థియేటర్లలో) ఈ సినిమా విడుదల కానుంది. తెలుగు ప్రేక్షకులనూ అలరించేందుకు సిద్ధంగా ఉంది. తమిళనాడులో సెప్టెంబరు 5న ఉదయం 4 గంటలకే షోలు మొదలవుతాయని సమాచారం.