మిస్‌ ఫైర్‌ అయిన ప్రాంక్‌.. భర్తను చితక్కొట్టిన నటి

Published : Apr 17, 2020, 10:44 AM IST
మిస్‌ ఫైర్‌ అయిన ప్రాంక్‌.. భర్తను చితక్కొట్టిన నటి

సారాంశం

నటుడు ప్రిన్స్ నరులా తన భార్య టీవీ నటి యువికా చౌదరిని సరదాగా ఆటపట్టిస్తూ ఓ వీడియో చేశాడు. అయితే ప్రిన్స్ చేసిన ఈ ప్రయత్నం మిస్‌ ఫైర్‌ అయ్యింది. తన ఇన్స్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఈ ప్రాంక్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు ప్రిన్స్.

కరోనా ప్రభావంతో ప్రపంచమంతా ఇంటికే పరిమితమైంది. లాక్ డౌన్‌ కారణంగా సెలబ్రిటీలు కూడా ఇళ్లలోనే ఉంటున్నారు. ఈ సమయాన్ని చాలా మంది బోర్‌గా ఫీల్ అవుతుంటే.. మరికొందరు మాత్రం ఎంజాయ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీ కపుల్‌ తమ ప్రైవేట్ లైఫ్ కు సంబంధించిన వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంతో హిందీ టెలివిజన్‌ నటులు పోస్ట్ చేసిన ఓ ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నటుడు ప్రిన్స్ నరులా తన భార్య టీవీ నటి యువికా చౌదరిని సరదాగా ఆటపట్టిస్తూ ఓ వీడియో చేశాడు. అయితే ప్రిన్స్ చేసిన ఈ ప్రయత్నం మిస్‌ ఫైర్‌ అయ్యింది. తన ఇన్స్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఈ ప్రాంక్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు ప్రిన్స్. ఈ పోస్ట్‌లో ప్రిన్స్ చెపుతున్న విషయాన్ని చాలా సీరియస్‌గా విన్న యువికా తరువాత అది ప్రాంక్‌ అని తెలియగానే  భర్తను చితక్కొట్టింది. ఈ వీడియోతో పాటు `ప్రాంక్ వీడియో.. వైఫ్‌ యువికాతో సరదాగా` అంటూ కామెంట్ చేశాడు. 

యువికా, ప్రిన్స్్ లు 2015లో ఓ టీవీ రియాలిటీ షోలో తొలిసారిగా కలుసుకున్నారు. 2018లో వివాహం చేసుకున్నారు. కరోనా లాక్ డౌన్‌ కారణంగా పేద మధ్యతరగతి కుటుంబాలు సమస్యలను ఎదుర్కొంటుంటే.. ఉన్నత వర్గాల వారు మాత్రం హాలీ డేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తూ తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?