చిరుతో గొడవ పడిన రాజశేఖర్ కు షాక్: రాజీనామా ఆమోదం

By telugu teamFirst Published Jan 5, 2020, 6:46 PM IST
Highlights

ఉపాధ్యక్ష పదవికి సినీ హీరో రాజశేఖర్ చేసిన రాజీినామాను మా ఆమోదించింది. ఇటీవల వేదికపై మెగాస్టార్ చిరంజీవితో రాజశేఖర్ వివాదానికి దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పదవికి రాజశేఖర్ రాజీనామా చేశారు.

హైదరాబాద్: ఉపాధ్యక్ష పదవికి సినీ హీరో రాజశేఖర్ చేసిన రాజీనామా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఆమోదించింది. చిరంజీవితో వేదికపై గొడవ పడిన రాజశేఖర్ ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. 

రాజశేఖర్ చేసిన రాజీనామాను ఆదివారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆమోదించారు. దాంతో పాటు క్రమశిక్షణ చర్యల కోసం ఉన్నతస్థాయి కమిటీని కూడా మా నియమించింది. కృష్ణంరాజు, చిరంజీవి, మురళీమోహన్, మోహన్ బాబు, జయసుధలతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. 

Also Read: 'మా' వివాదం.. నరేష్ పై శివాజీరాజా సంచలన కామెంట్స్!

నూతన సంవత్సరం సందర్భంగా ఇటీవల మా డైరీ ఆవిష్కరణ సభలో రాజశేఖర్, చిరంజీవిల మధ్య వాగ్వివాదం చెలరేగింది. దానికి ముందు... మంచి ఉింటే మైకులో చెబుదాం, చెడదు ఉంటే చెవిలో చెబుదాం అని చిరంజీవి మాలో నెలకొన్న విభేధాల గురించి నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.

దాంతో ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేతిలోంచి రాజశేఖర్ మైక్ లాక్కుని ఆవేశంగా ప్రసంగించారు. సభలో కూర్చున్న కృష్ణంరాజు, మోహన్ బాబు, చిరంజీవి కాళ్లకు మొక్కారు. ఆయన చర్యకు అందరూ తీవ్ర అసహనానికి గురయ్యారు. 

Also Read: చిరంజీవి, మోహన్ బాబుతో రాజశేఖర్ వాగ్వాదం.. వైరల్ అవుతున్న ఫొటోస్!

చిరంజీవి చాాల బాగా మాట్లాడారని, కానీ ఇక్కడ నిప్పును కప్పిపుచ్చితే పొగ వస్తుందని, మాలో గొడవలున్నాయని, రియల్ లైఫ్ లో హీరోగా పనిచేస్తుంటే తొక్కేస్తున్నరని రాజశేఖర్ అన్నారు. 

రాజశేఖర్ మాటలతో తీవ్ర అసహనానికి గురైన చిరంజీవి... తాను చెప్పిన మాటకు విలువ ఇవ్వడం లేదని, తమ మాటలకు గౌరవం లేనప్పుడు తామంతా ఇక్కడ ఎందుకు ఉండాలని, ఎందుకు సభను రసాభాస చేయడమని, రాజశేఖర్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. 

See Video: MAA Dairy Launch : పెద్దలు, వయోవృద్ధులూ...మోహన్ బాబుకు చిరంజీవి పంచ్

ఇంకా తీవ్రంగానే చిరంజీవి మాట్లాడారు. దాంతో అదే రోజు సాయంత్రం రాజశేఖర్ తన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా సమర్పించారు. ఆదివారం సమావేశమైన ఎగ్జిక్యూటివ్ కమిటీ రాజశేఖర్ రాజీనామాను ఆమోదించింది.

See Video: MAA Dairy Launch : మీరు అరిసేస్తే ఇది జరిగిపోదు...మోహన్ బాబుమీద రాజశేఖర్ ఫైర్

click me!