తండ్రైన అనిల్ రావిపూడి.. సంతోషంతో మహేష్ ట్వీట్!

Published : Jan 05, 2020, 04:57 PM ISTUpdated : Jan 05, 2020, 05:01 PM IST
తండ్రైన అనిల్ రావిపూడి.. సంతోషంతో మహేష్ ట్వీట్!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. భారీ అంచనాల నడుమ సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతికి విడుదలవుతోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. భారీ అంచనాల నడుమ సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతికి విడుదలవుతోంది. దీనితో సంక్రాంతికి వారం ముందు నుంచే తెలుగు రాష్ట్రాల్లో మహేష్ మేనియా మొదలైపోయింది. 

ఈ చిత్ర సక్సెస్ కోసం అనిల్ రావిపూడి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ చిత్రం అనిల్ రావిపూడిని మరో స్థాయికి తీసుకెళుతుందనే అంచనాలు సర్వత్రా నెలకొని ఉన్నాయి. ఇదిలా ఉండగా నేడు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సరిలేరు నీకెవ్వరు చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఓ వైపు సరిలేరు నీకెవ్వరు గ్రాండ్ సెలెబ్రేషన్స్ మొదలు కాబోతుంటే..అనిల్ రావిపూడి ఫ్యామిలిలో కూడా సంతోషాలు వెల్లివిరిసాయి. 

అనిల్ రావిపూడి తండ్రయ్యాడు. ఆయన సతీమణి ఆదివారం రోజు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. దీనితో అనిల్ రావిపూడికి సినీ తారల నుంచి, ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురిచేసిన మహేష్ .. మచిలీపట్నంలో ఏం జరిగిందంటే!

తన డైరెక్టర్ తండ్రి కావడంతో మహేష్ బాబు సంతోషం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా వేదికగా అనిల్ రావిపూడికి శుభాకాంక్షలు తెలిపాడు. 'నా దర్శకుడు అనిల్ రావిపూడికి కొడుకు పుట్టాడు. ఆ తల్లిదండ్రులిద్దరికీ నా శుభాకాంక్షలు' అని మహేష్ బాబు ట్విట్టర్ లో పేర్కొన్నాడు. 

చిరంజీవి, మహేష్, విజయశాంతి ఎఫెక్ట్.. పోలీసులు ఏం చేస్తున్నారంటే..

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?