ఏమిటో ఈ ‘తెలుగు’ గోల

First Published Dec 29, 2017, 3:00 PM IST
Highlights

ఈ మధ్య తెలుగునాట ‘తెలుగు భాష అంతరించిపోతున్నదేమో నని కొంతమంది పండితులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. తెలుగు వాడకం పెంచాలని లేకపోతే, మమ్మీడాడీల కల్చర్ తో తెలుగు అమ్మనాన్న లు మాయమవుతారని వాళ్లంటున్నారు. ఈ చర్చ ఒక చిన్న పండిత లోకానికి మాత్రమే పరిమితమయింది. అక్షరాసత్యత 64 శాతం కూడా మించని రాష్ట్రంలో తెలుగు ఎలా అంతరించిపోెతుందో చాలా మందికి అర్థం కావడంలేదు. కోట్లాది మంది చదువుకున్న వారు ఈ చర్చ కు చాలా దూరంగా ఉంటున్నారు. దీనితో  ‘తెలుగు’ అందోళన పనికిరాదని ప్రముఖ పండితుడు అందుకూరి శాస్త్రి చెబుతున్నారు. ఇది ఆయన వాదన.

... ప్రజా జీవితం లోకి తొంగి చూస్తే .తెలుగును తెలుగు ప్రజలు మరచిపోవటం ఎలాగో అర్థం కావటం లేదు.
ఇళ్లదగ్గర నుంచి మొదలు పెడితే ...ఇళ్లలో ఒకళ్లకొకళ్లు తెలుగులోనే మాట్లాడుకుంటున్నాం .అది అచ్చతెలుగు అవునో కాదో తెలియదు.

భర్త భార్యతో .తండ్రిపిల్లలతో .అన్నదమ్ములు ఒకళ్లతో ఇంకొకళ్లు ఇలా...

బజారుకు వెళితే కొట్టువాడితో తెలుగే 
ముఖ్యమైన ఎలక్ట్రిసిటీ Department 
వాటర్ కనెక్షన్లు ఇచ్చే డిపార్ట్మెంట్ లు దగ్గరకూడా తెలుగులోనే మాట్లాడుతారు. షాపుల లో కూడా తెలుగే మాట్లాడతారు. ఒక్క స్కూళ్లలో ఇంగ్లీషు ఎక్కువ ఉంటుందేమో . సినిమాలు చూసి ప్రే మలో పడ్డ ప్రేమికులు కూడా తెలుగులోనే మాట్లాడుకుంటారని ఊహించవచ్చు.
పెళ్లిమం త్రాలుకూడా తెలుగే .పురోహితుడు cell ఫోనులో కూడా తెలుగే మాట్లాడతాడు. 
ఇంకా జీవితం లో ఎన్నోసన్ని వేశాలు . ఉన్నయి .వాటన్నిటిలో తెలుగే. మనిషి బారసాలనుండి  చివరివరకూ అంతా తెలుగే .
NRI వరుడు/వధువు కూడా పెళ్లిలో తెలుగే . యాసలు వేరుకావచ్చు  కానీ తెలుగు రాష్టాలలో రోజులో మామూలు ప్రజలు మేలుకుని ఉన్న 12 గంటలలో కనీసం 8గంటలు తెలుగే మాడ్లాడతారు. ఇక తెలుగు మృతభాష‌ ఎట్లా అవుతుంది. 
గుళ్లో తెలుగు ప్రవచనాలలో తెలుగు 
ఆఖరికి నాకు తెలిసినంత వరకు క్రిస్టియన్ సోదరుల వివాహాలలో కూడా చర్చిలో తెెలుగే. ఒక్క మహమ్మదీయుల విషయం నాకు అంతగా తెలియదు. కానీ నాకు బంధువు లాంటి మహమ్మదీయ సోదరుడు. వారింట్లో మతసం బంధమైన సందర్భానికి తెలుగులో పిలుపుల పత్రిక వేయటం నాకు తెలుసు. 
మనిషిని పరీక్ష చేసే కళ్లతో చూస్తే XRay లో అంతా తెలుగే .
ఇంగ్లీష్ అనేది ఒక వేషధారణ మాత్రమే . హృదయం తెలుగే . 
భారతదేశం లో ప్రతి సామాన్యుడికి కనీసం మూడుభాషలతో పరిచయం ఉంటుంది. మాతృభాష . కొద్దిగా హిందీ(సినిమాలవల్ల)  కొద్దిగా ఇంగ్లీషు. పల్లెటూళ్లలో ఉండే వారికి కూడా ఈ మూడు భాషల పరిచయం ఉంటుంది .

ఎక్కువ భాషలు తెలియడం ఒక గొప్పతనమే. మాకు ఇంగ్లీష్ తప్పితే ఇంకొక భాష రాదు అనుకునే పాశ్చాత్యుల గర్వం అనాగరికం .
ఆ దశకు తెలుగు వారిని తీసుకుని వెళ్లాల్సిన అవసరం లేదు.

తెలుగు భాషను చదవద్దని ఎవరూ బల వంతం చేయటం లేదు . ప్రస్తుతపు Communications విప్లవం తో ప్రాచీన గ్రంధాలు అన్నీ దొరుకుతున్నయు.అందరూ చదివి తెలుగును వృద్ధి చేసుకోవచ్చు. ఎవరు కాదన్నారు.
లేదు తెలుగు భాషను రాజకీయం చేద్దామని అనుకుంటే అది వేరే విషయం . లోపల ఏవేవో ఆలోచనల తో మహాప్రాణాక్ష రాలను తీయమని ఒకరు . ఇతర భాషల విషయం లో కళ్లకు గంతలు కట్టుకో మనే రాజకీయ స్వాభావికులు ప్రజలకు మనం మంచి సలహా ఇస్తున్నామా అని ఆలోచించాలి
తెలుగు భాషను వృధ్ది చేయాలనే వారు మహా ప్రాణాక్షరాలను తీసేయమంటున్నారు.మన తెలుగుకు మూలం తత్సమాలు అంటే .
తత్సమ సంస్కతం..
తత్సమ ప్రాకృతం ....అవి తీసేయటమంటే ఏమిటో నాకు అర్థం కావటం లేది. తెలుగు సర్వసమగ్రమైన భాష అని దానిని రాష్ట్ర భాషగా చేసే అర్హత ఉందని చాలామంది చెప్పారు . ముఖ్యం గా, JBN Haldene లాంటివారు. ఇంగ్లీషు వారి టైములో (East India company దగ్గరనుంచి) నాణాల మీద ఉన్న నాలుగు భాషలలో తెలుగు ఒకటి. ఎక్కువ భాషలు వద్తుంటే సంతోషించాల్సింది పోయి......

ఇప్పటికే స్పందన పెద్దదయింది.దీని మీద వ్యాసం రాయాలి .  అంత పెద్ద subject ఇది. 

(* రచయిత అందుకూరి శాస్త్రి తెలుగు సాహితీవేత్త)
 

click me!