ఈ పోస్టు రాస్తున్న సందర్భం నంద్యాల ఉపఎన్నికే అయినా భూమా నాగిరెడ్డి మొదటిసారి ఎన్నికల్లో పొటి చేసింది 1991లో. దేశ,రాష్ట్ర రాజకీయల్లో చాలా ప్రాముఖ్యం వున్న సంవత్సరం అది. దేశ, రాష్ట్ర రాజకీయాలను ఈ సంవత్సరం ఎంతగా ప్రభావితం చేసిందో చూద్దాం.
undefined
1.YSRకు MLA ticket ఇవ్వని కాంగ్రెస్ పార్టీ
2.తొలి తెలుగు ప్రధాని కోసం MP పదవిని త్యాగం చేసిన నాయకుడు
3.పోలీసు దుస్తుల్లొ వచ్చి కాంగ్రేసు MLAను చంపిన (సూడో) నక్సల్స్
4.మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇంటికి చేరక ముందే మరణించిన నాయకుడు
5.నా ముందు పెద్దరామయ్యే తట్టుకోలేదు ఈ బుల్లిరామయ్య ఎంత!
6.ఓడిపోయిన ఏలూరు MP,రాజమండ్రి రంభ
7.ఉప ఎన్నికలో TDP అభ్యర్ధి నామినేషన్ అడ్డుకోవటానికి బాంబుల వర్షం కురిపించిన ప్రత్యర్ధులు
8.మొదటిసారి గెలిచిన 24 సంవత్సరాల తరువాత MLAగా గెలిచి మంత్రి అయిన నాయకుడు
P.V,భూమా నాగిరెడ్డి,పరిటాల రవి,జ్యోతుల నెహ్రు,గాదె వెంకట రెడ్డి ఇలా అనేక మంది రాజకీయ జీవితంతో ముడిపడిన ఎన్నికలు రాష్ట్రంలొ 1991లో జరిగిన ఉప ఎన్నికలు,వాటి వివరాల కోసం ఈ పోస్టు చదవండి.
1989లో V.P.సింగ్ నాయకత్వంలో జనతాదళ్/National Front ప్రభుత్వం ఏర్పడటం ఒక సంవత్సరం లోపే ఆప్రభుత్వం పడిపోవటం చంద్రశేఖర్ ప్రధాని కావటం 6 నెలలకే ఆ ప్రభుత్వం కూడ పడిపోవటంతో 1991 మేలొ సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి.
మొదటి దశ పోలింగ్ జరిగిన తరువాత రోజే అంటే 21-May-1991న రాజీవ్ గాంధిని LTTE ఆత్మాహుతిదళం చంపటంతో తరువాతి దశల ఎన్నికలు ఒక నెల వాయిదాపడి జూన్ 12 మరియు 15న జరిగాయి.
ఈ రెండవ దశ పోలింగుకు ఐదురోజుల ముందు ఆళ్ళగడ్డ MLAగా వున్న భూమా నాగిరెడ్డి అన్న "శేఖర్ రెడ్డి" "07-Jun-1991"న గుండెపోటుతో చనిపోయారు.
శేఖర్ రెడ్డి మరణానికి సరిగ్గా ఒక నెల ముందు "07-May-1991"న "పెనుకొండ" కాంగ్రేస్ MLA "సానె చెన్నారెడ్డి"ని పోతుల సురేష్ ROC గ్రూప్ ధర్మవరంలో చంపింది.1983 నుంచి అజ్ఞాతంలొ వున్న పరిటాల రవి చెన్నారెడ్డి హత్యకు సూత్రధారి అని కాంగ్రేస్ నాయకులు ఆరోపణలు చేశారు.
చెన్నారెడ్డి మరణంతో పెనుకొండకు 1991 నవంబర్లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రేస్ తరుపున చెన్నారెడ్డి కొడుకు వెంకట రమణారెడ్డి(ఓబుళ రెడ్డి అన్న) TDP గాదెలింగప్ప మీద గెలిచాడు.ఈ ఎన్నికల్లొ రవి వర్గం బహిరంగంగానే TDP తరుపున పనిచేసింది.1994లొ పరిటాల రవినే TDP తరుపున పోటీచేసి MLAగా గెలిచారు.రమణారెడ్డి,ఓబుళరెడ్డి ఇద్దరు హత్యగావించపడ్డారు,ఈపొస్టులొ ఆవివరాలు రాయటంలేదు.
1989లొ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లొ భూమా శేఖర్ రెడ్డి కాంగ్రేస్ గంగుల ప్రతాప్ రెడ్డి మీద గెలిచారు.శేఖర్ రెడ్డి మేనత్త భర్త ,అప్పటికి పలుసార్లు ఆళ్ళగడ్డ నుంచి MLAగా గెలిచిన S.V.సుబ్బారెడ్డిగారు నాడెంద్ల వర్గంలోకి వెళ్ళాటంతో 1985 ఎన్నికల్లొ సుబ్బారెడ్డిగారికి కాకుండ వారి మేనల్లుడైయ్యే శేఖర్ రెడ్డికి ticket ఇచ్చారు.ఆఎన్నికల్లొ సుబ్బారెడ్డిగారు కాంగ్రేసుకు మద్దతు ఇచ్చారు గంగుల ప్రతాప్ గారు గెలిచారు.
1991 లోక్ సభ ఎన్నికల్లొ కాంగ్రేస్ నంద్యాల నుంచి సిట్టింగ్ MP బొజ్జా వెంకట రెడ్డిగారిని కాదని ఆళ్ళగడ్డ నుంచి ఓడిపొయిన గంగుల ప్రతాప్ రెడ్డిగారికి MP ticket ఇచ్చింది.గంగుల వర్గం బొజ్జాగారి మీద వొత్తిడి తెచ్చారంటారు, ఆవివరాలు బహిరంగం కాలేదు.
1991 ఎన్నికల్లొ గంగుల ప్రతాప్ రెడ్డి TDP చల్లారామకృష్ణా రెడ్డి మీద 1.87 లక్షల మెజారిటీతో గెలిచారు.
రాజీవ్ చనిపోవటంతో P.V ప్రధాని అయ్యారు,ఆయన MPగా గెలవటానికి అవకాశమిస్తు ప్రతాప్ రెడ్డి రాజినామ చేశారు.
1991 నవంబర్లో జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లొ TDP P.Vగారి మీద పొటికి దిగలేదు,P.V BJP బంగారు లక్ష్మణ్ గారి మీద రికార్డ్ స్థాయిలొ 5.80 లక్షల మెజారిటి గెలిచారు.లక్ష్మణ్ గారికి వచ్చిన 46,000 ఓట్లలో కాంగ్రేస్ కార్యకర్తలు వేసినవే ఎక్కువ.ఏ పోలింగ్ బూతులో కూడ 100% ఓట్లు ఒకే అభ్యర్ధికి రాకుడు,అలా వస్తే re-polling జరిపే అవకాశం వుండటంతో రిగ్గింగ్ జరిగినప్పుడు 10 ఓట్లు ప్రత్యర్ధికి వెయ్యటం ఆనవాయితి.
1991 నవంబర్లో నంద్యాల లోక్ సభ మరియు ఆళ్ళగడ్డతో సహా 5 అసెంబ్లీ స్థానాలు ఉప ఎన్నికలు జరగవలసి వుండగా ఆళ్ళగడ్డలొ పోటికి దిగిన గంగుల వర్గానికి చెందిన స్వతంత్ర అభ్యర్ధి "అంబటి శివశంకర్ రెడ్డి" బాంబుదాడిలో గాయపడి కర్నూల్ హస్పటలుకు తరలిస్తుండగా మార్గమధ్యలొ చనిపోయారు.
అసలు భూమా నాగిరెడ్డి 1991 ఉప ఎన్నికలో పోటిచెయ్యటం పెద్ద సాహసం.అవి ఫ్యాక్సన్ ఉదృతంగా వున్న రోజులు పైగా కాంగ్రేస్ అధికారంలొ వుంది.ప్రధాని కోసం MP seat వదులుకున్న గంగుల ప్రతాప్ రెడ్డి కాంగ్రేస్ తరుపున పోటి చేశారు.NTR భూమాను పోటికి దిగొద్దని చెప్పారని భూమానే ఒక ఇంటర్యూలో చెప్పారు.
మంచి రోజని నామినేషన్లు ముగిసే చివరి రోజు భూమా నామినేషన్ వెయ్యటానికి ముహుర్తం పెట్టుకున్నారు.నామినేషన్ వెయ్యటానికి ఆళ్ళగడ్డ నుంచి నంద్యాల వెళ్ళాంటే గంగుల వాళ్ళ అడ్డాలంటి ప్రాంతాన్ని దాటుకోని వెళ్ళాలి.
భూమా నామినేషన్ వెయ్యటానికి బయలుదేరి గంగుల వాళ్ళ ఏరియాకు చేరుకోగానే ఇరువర్గాలు కవ్వింపు చర్యలకు దిగాయి.గొడవ చిలికి చిలిక బాంబుల వర్షంగా మారింది.భూమా క్యాన్వాయ్ ముందుకు వెళ్ళలేని పరిస్థితి.భూమాకు మద్దతుగా ఆళ్ళగడ్డలొ వున్న చల్లా మరియు S.V.సుబ్బారెడ్డి (S.V.సుబ్బారెడ్డిగారికి ఇష్టం లేకుండ 1986లో నాగిరెడ్డి శోభాగారిని పెళ్ళి చేసుకున్నారు.మొదట గొడవపడ్డా తరువాత కొంతకాలనికి అందరు ఒకటయ్యారు) తమ వర్గాలతో గంగుల వర్గాన్ని ఎదుర్కుంటు భూమాను main road మీద కాకుండ రుద్రవరం మీదుగా నంద్యాల పంపించారు.
దాదాపు మధ్యహాన్నం 2 గంటల సమయంలో నంద్యాల్లో అడుగుపెట్టిన భూమా కాన్వాయ్ మీద ఒక బాంబు పడింది. పోలీసులు చెకింగ్ పేరుతో ఆలస్యం చేస్తుండటంతో భూమా వర్గం ఒక CI మీద దాడి చేశారు.ఎట్టకేలకు గడువు ముగిసేలోపల నామినేషన్ వెయ్యగలిగారు.
శివశంకర్ రెడ్డిని ఎవరు చంపారు అన్నది స్పష్టంగా తేలలేదు... భూమా వర్గం చంపిందని గంగుల వర్గం,ఎన్నిక వాయిదా వెయ్యించటానికి గంగుల వర్గమే చంపిందని భూమా వర్గం ఆరోపణలు చేసుకున్నాయి.అప్పటి ఎన్నికల కమీషన్ నియమాల ప్రకారం అభ్యర్ధి మరణంతో ఎన్నిక వాయిదా పడింది. ఆతరువాత కేవలం గుర్తింపు వున్న పార్టి అభ్యర్ధి మరణిస్తేనే ఎన్నిక వాయిదా వెయ్యాలని నియమాలు సవరించారు.
శివశంకర్ రెడ్డి మరణంతో ఆళ్ళగడ్డ ఎన్నిక 1992 జనవరికి వాయిదా పడింది.భూమా సుమారు 8,000 మెజారిటీతో గెలిచారు.పెద్ద ఎత్తున బాంబుదాడులు జరిగినా అధికారిక లెక్కల ప్రకారం ఒక్కరు కూడ చనిపొలేదు!అనధికారికంగా కనీసం ముగ్గురు చనిపోయారంట...ఇరువర్గాల్లొ ఎవరు కేసులు పెట్టుకోలేదు.
1991లో శేఖర్ రెడ్డి మరణంతో మొదలైన భూమా MLA జీవితం 2017లో ఆయన మరణంతో ముగిసింది. శేఖర్ రేడ్డి కొడుకు బ్రహ్మానందరెడ్డి ఉప ఎన్నికలో పొటిచేస్తుండటం ...ఇదే జీవితం!
1994 ఎన్నికల ప్రచారంలొ NTR భూమా,పరిటాల నా రెండు కళ్ళలాంటివారు అని అన్నారు.
కాంగ్రేస్ నాయకత్వం చెన్నారెడ్డిని దించి నేదురుమల్లిని ముఖ్యమంత్రిని చెయ్యటం,జనార్ధన్ రెడ్డిని కూడ దించుతారన్న ప్రచారం జరుగుతుండటం మరియు MPలను CMలుగా పంపించమని కాంగ్రేస్ అధిష్టానం చెప్పటంతో 1989లొ పులివెందుల నుంచి MLAగా గెలిచిన తమ్ముడు Y.S.వివేకానంద రెడ్డిగారితో రాజీనామ చేయించారు,ఆ రాజీనామా ఆమోదం పొందింది.కాని కాంగ్రేస్ అదిష్టానం YSRకు తప్ప ఆయన చెప్పిన ఎవరికైన MLA టికెట్ ఇస్తామని తేల్చి చెప్పటంతో Y.S బాబాయి డాక్టర్ పురుషోత్తం రెడ్డిగారు పోటిచేసి 97,500 మెజారిటీతో TDP అభ్యర్ధి మీద గెలిచారు.పులివెందుల చరిత్రలో ఇదే అత్యధిక మెజారిటి.YS బలంతో పాటు పురుషోత్తం రెడ్డిగారి మీద ప్రజలకు వున్న సానుకూలతతో ఇంత మెజారిటి సాధ్యం అయ్యింది.
1991 జూన్ లో మిగిలిన స్థానాలతోపాటు జరగవలసిన కడప లోక్ సభ ఎన్నిక స్వతంత్ర అభ్యర్ధి వెంకటసుబ్బయ్య హత్యతో వాయిదాపడి P.V నంద్యాల ఎన్నికతో పాటు 1991 నవంబరులో జరిగింది.YSR 4.19 లక్షల మెజారిటీతో TDP రామచంద్రయ్యగారి మీద గెలిచారు.
1991 జూన్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లొ పర్చూరు sitting TDP MLA దగ్గుబాటి వెంకటేశ్వరరావ్ గారు బాపట్ల నుంచి,జగ్గంపేట sitting TDP MLA తోటా సుబ్బారావ్ గారు కాకినాడ నుంచి MPలుగా గెలిచారు.
దగ్గుబాటి MPగా గెలవటంతో ఖాళి అయిన పర్చూరు స్థానంలో కాంగ్రేసు తరుపున గాదె వెంకటరెడ్డి పోటిచేసి TDP దామచర్ల ఆంజనేయులుగారి మీద 15,000 మెజారిటీతో గెలిచారు.గాదె వెంకటరెడ్డిగారు 1967లో మొదటిసారి MLA అయ్యారు.అప్పటి నుంచి అంటే 1972 నుంచి 1989 వరకు ప్రతి ఎన్నికలో పొటిచేసి ఓడిపోయారు.1978లో జనతా పార్టి తరుపున మిగిలిన నాలుగుసార్లు కాంగ్రేసు తరుపున పోటిచేశారు.1994లొ పర్చూరు నుంచి,2004 & 2009లొ బాపట్ల నుంచి గెలిచారు.ఇంత సుదీర్ఘ రాజకీయ వున్న గాదె వెంకటరెడ్డిగారు 2014 ఎన్నికల్లొ పోటిచెయ్యలేదు,గత సంవత్సరం TDPలో చేరారు.
తోట సుబ్బారావుగారు కాకినాడ MPగా గెలవటంతో ఖాళి అయిన జగ్గంపేట నుంచి ఆయన వారసుడిగా(అల్లుడు వరుస) జ్యోతుల నెహ్రు(వెంకట అప్పారావు)గారు TDP తరుపున పొటిచేసి కాంగ్రేస్ అభ్యర్ధి "తోట వెంకటచలం" గారి మీద ఓడిపోయారు. 1994,1999 & 2014లొ నెహ్రుగారు గెలిచారు.
యాదృచ్చికమే అయినా భూమా నాగిరెడ్డి,జ్యోతుల నెహ్రు రాజకీయ జీవితం 1991 ఉప ఎన్నికలో TDP తరుపున మొదలైంది.2009లొ PRP తరుపున భూమా నంద్యాల MPగా,జ్యోతుల జగ్గంపేట MLAగా పోటిచేసి ఓడిపోయారు.PRP కాంగ్రేసులో విలీనం అయినప్పుడు భూమా జగన్ వైపు,నెహ్రు TDP వైపు వెళ్ళారు.2014 ఎన్నికల్లో మాత్రం భూమా & జ్యోతుల ఇద్దరు YCP తరుపున MLAలుగా గెలిచారు.PAC చైర్మన్ గా వున్న భూమా TDPలోకి మారటంతో ఖాళి అయిన PAC పదవి జ్యోతుల ఆశించారు .అది దక్కక కొన్ని నెలల తరువాత జ్యోతుల కూడా టీడీపీ లోకి వెళ్లిపోయారు
63 సంవత్సరాల నెహ్రు తన కొడుకు నవీన్ను వారసుడిగా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 2019 ఎన్నికల్లొ నెహ్రు పోటి చేయ్యక పోయినా లేదా ఓడిపోయినా భూమా మరియు జ్యోతుల నెహ్రు రాజకీయ జీవిత అత్యంత సాపత్యం అలా మిగిలిపోతుంది. వీరిద్దరు ఒక్కరోజు కూడ కాంగ్రేసులో లేకపోవటం కూడ గమనించవచ్చు.
మాగంటి రవింద్రనాథ్ చౌదరి (దెందులూరు) 05-Aug-1991న నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి మంత్రివర్గంలొ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఇంటికి వెళ్ళే దారిలోనే గుండేపొటుతో చనిపోయారు.మాగంటి మురళిమోహన్,చిరంజీవిలతో అనేక సినిమాలు నిర్మించారు,గ్యాంగ్ లీడర్ ముఖ్యమైనది. ఉప ఎన్నికలో రవింద్రనాథ్ చౌదరి శ్రీమతి వరలక్ష్మిగారు గెలిచి మంత్రి అయ్యారు. రవింద్రనాథ్ చౌదరి కొడుకు మాగుంట వెంకటేశ్వర రావ్(బాబు) ఇద్దరు కాంగ్రేసు తరుపున మంత్రిగా పనిచేశారు.మాగుంట బాబు 2014లొ TDP తరుపున ఏలూరు MPగా గెలిచారు.
1989లో ఏలూరు నుంచి సూపర్ స్టార్ కృష్ణ కాంగ్రేస్ తరుపున MPగా గెలిచారు.1991 ఎన్నికల్లొ మాత్రం ఒడిపోయారు.TDP అభ్యర్ధి "బోళ్ళ బుల్లిరామయ్య"ను ఉద్దేశించి కృష్ణ చేసిన "పెద్దరామయ్యే తట్టుకోలేదు ఈ బుల్లిరామయ్య ఎంత" అన్న మాట ఆ ఎన్నికల్లొ బాగా పాపులర్.
1989లో జమున కాంగ్రేసు తరుపున రాజమండ్రి నుంచి MPగా గెలిచి 1991లొ ఓడిపోయారు.
1991 ఎన్నికల్లొ TDP వర్గాలు ఏలూరు MP రాజమండ్రి MLA అని విమర్శించారు.
రాజీవ్ గాంధి హత్య కన్నా ఒక్కరోజు ముందు అంటే 20-May-1991న జరిగిన తొలిదశ ఎన్నికల్లొ శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు వున్న 15 స్థానల్లొ 11 స్థానాలు TDP గెలిచింది.తరువాతి దశల్లొ జరిగిన 27 స్థానల్లొ TDP 2, మిత్రపక్షాలైన కమ్యునిస్టులు 2 స్థానల్లొ గెలిచారు.మొత్తంగా 1991 ఎన్నికల్లొ కాంగ్రేస్ 25,TDP - 13,CPI-1,CPM-1,BJP-1,MIM-1 గెలిచాయి.
ఆవిధంగా సూపర్ స్టార్ కృష్ణ,"సత్యభామ" జమున One Time MPగా మిగిలిపోయారు.
ఇంత రాసి నంద్యాల్లో ఎవరు గెలుస్తారో రాయకపోవటానికి కారణం ఉప ఎన్నికలు పార్టీల బలాబలా ఆధారంగా జరగవు!ప్రభుత్వ బలం పోలింగు రోజు ఎంత పనిచేసింది అన్నదాని మీద ఫలితం ఆధారపడి వుంటుంది. ప్రతిపక్ష్యానికి బలం వున్న ప్రాంతల్లొ పోలింగు జరగనిస్తారా లేదా అన్నది కూడ ముఖ్యం.
1991లో ఉప ఎన్నికల్లొ 4 చోట్ల అధికార కాంగ్రేస్,కేవలం ఒక చోట ప్రతిపక్ష్య TDP గెలిచాయి.1994 ఎన్నికల ఫలితాలు అందరికి తెలిసిందే!