undefined
1975 లో మళయాళంలో స్వామి అయ్యప్ప సినిమా విడుదలైనా ఆ తర్వాత మరో 3ఏళ్లకు దాన్ని తెలుగులో డబ్ చేసారు.అప్పటికి ఈ అయ్యప్ప ఎవరో,ఆ మాలధారణ ఏంటో జనాలకు తెలియదు...ఇప్పుడు శబరిమలై వెళ్ళే భక్తుల్లో అధికశాతం తెలుగువారే.
రాజేష్ ఖన్నా నటించిన దో రాస్తే సినిమాను తెలుగులో మా ఇద్దరి కథ అంటూ యన్‌టీఆర్ తో తీసారు..అందులో అనురాగంతో బంధం వేసే అందాల చెల్లి అంటూ పాటుంది..ఆ పాటకు నేపధ్యం చెల్లెలు రాఖీ కట్టడం...ఇప్పుడు ప్రతి గ్రామంలో రాఖీ పండుగ జరుపుతున్నారు.
ఇక హోలీ పండుగ...అంతకు ముందు నవ్‌రంగ్ లాంటి సినిమాల్లో ఉన్నా cult movie షోలే వల్ల చాలా మందికి తెలిసింది...అప్పట్లో మహా అయితే హైదరాబాద్ లో జరుపుకునేవాళ్లేమో...ఇప్పుడు కోస్తాంధ్రా అంతటా ఘనంగా జరుపుకుంటున్నారని విన్నాను.
మా రాయలసీమలో ఒకటీఅరా కాలేజ్ హాస్టల్స్ లో జరుపుకుంటున్నారు.
మరి రాయలసీమ వాళ్లకు రంగుల పండుగ లేదా?
లేకేం?పండుగలకు ప్రకృతికీ విడదీయరాని బంధం....శిశిరంలో ఆకురాలి మోడైన ప్రకృతి వసంతాగమనం తో కొత్త చిగుళ్లతో కొత్త అందాలు సంతరించుకుంటుంది...ప్రకృతే కాదు మన జీవితాలూ వర్ణభరితంగా ఉండాలని ఉగాదిరోజు రంగులు చల్లుకుంటారు.
మరీ హోలీలా రంగుపొడులు కాదు రంగునీళ్లు చల్లుకుంటారు...ఒకప్పుడు మగపిల్లలు బాటిళ్లలో రంగు తీసుకుపోతే అమ్మాయిలు వెదురు,రేకు పిచికారీలు వాడేవారు.ఇప్పుడంతా ఇన్‌స్టంట్..చేతిలో పౌడర్ వేసి కాసిన్ని నీళ్లు పోసి మొహానికి పులమడం.ఒకప్పుడు వీధివీధులా రంగు బండ్లు అని కట్టి పెడ్డ గంగాళాలు,బెళ్లం కాగుల్లో రంగు కలిపి ఊరంతా తిరుగుతూ రంగు చల్లేవారు...ఇప్పుడు ఆ వేదుక 80 శాతం తగ్గింది.
ఈ రంగుల పండుగ విజయనగ్ర రాజుల కాలం నాటి నుండే ఉండేదని తెలుస్తుంది.Robert Sewell రాసిన The forgotten Empire,తెలుగులో విస్మృత సామ్రాజ్యం లో అప్పటి ఇటలీ యాత్రికుడు నికోలో డీ కాంటీ చెప్పిన పండుగల్లో ఈ పండుగ ఉంది కానీ దాన్ని రచయిత,ఆయనకు సహాయకులుగా ఉన్న పండితులూ పొరబడి హోలీ అన్నారు.
అదేంటో చూద్దాం...
ఆ పుస్తకంలోని 7 వ అధ్యాయం..రెండవ దేవరాయల కాలంలో విజయనగర పట్టణం(క్రీ.శ 1420(?)-1443) నికోలో కాంటి రాతల ఆధారంగా...
"సంవత్సరంలో 3సార్లు వాళ్లు ప్రత్యేకమైన గంభీరతతో పండుగలు పాటిస్తారు.
** ఇలాంటి ఒక సందర్భంలో అన్ని వయసుల స్త్రీ,పురుషులు నది లేక సముద్ర స్నానం చేసి,కొత్తబట్టలు ధరించి మూడురోజులు ఆట,పాట,విందు వినోదాలతో గడుపుతారు.
** మరో పండుగ సందర్భంగా తమ దేవాలయాల్లో,బయట ఇంటికప్పులపైనా "సుసుమన్ని" తైలంతో దీపాలు వెలిగించి వాటిని రాత్రీపగలు వెలిగేట్లు చూస్తారు.
** మూడో పండుగ 9 రోజులపాటూ సాగుతుంది.అన్ని పెద్ద రాజవీధుల్లో దూలాలను ఏర్పాటు చేస్తారు,అవి పెద్ద ఓడల త్రచాప కొయ్యల్లాంటివి.వాటిపైన అందమైన వస్తాల ముక్కలను కడుతారు,మధ్యలో బంగారాన్నీ కుడతారు.ప్రతిదూలం పైనా ధర్మానికి అంకితమై,అన్నింటినీ స్థిరచిత్తంతో వీక్షించే మనిషిని,భగవంతుడి దయకోసం ప్రార్ధించడానికి కూర్చోబెడతారు.ఈ మనుషులను జనం కమలాలు,నిమ్మకాయలు,వాసన కలిగిన ఫలాలతో కొడతారు.ఆ మనుషులు ఎంతో ఓర్పుతో భరిస్తారు".
"ఇంకో 3 పండుగలు కూడా ఉన్నాయి.పండుగల్లో దోవన పోయేవాళ్లందరి మీదా,రాజు-రాణి మీద కూడా కాషాయం రంగునీళ్లు చల్లుతారు.ఆ నీరు మార్గం పక్కన ఏర్పాటు చేసుకుంటారు.జనం దీన్ని సంతోషంగా స్వీకరిస్తారు".
పైన చెప్పిన మొదటి పండుగ కన్నడిగుల ఉగాది...డామింగో పెయిస్(పోర్చుగీస్) తన కథనంలో తాను విజయనగరం పర్యటించినప్పుడు అక్టోబర్ 12 న వచ్చిందని చెప్పాడు.
రెండోది దీపావళి..అది సుమారుగా అక్టోబర్ నెలలో వస్తుంది.
మూడో పండుగ మహానవమి.
పెయిస్ పర్యటనప్పుడు అది సెప్టంబర్ 12న వచ్చింది.
ఇక్కడ మనం గమనించాల్సింది మొదటిది కన్నడ ఉగాది అంటున్నాడు..కానీ తెలుగు,కన్నడ ఉగాదులు ఒకేరోజున వస్తాయి..పెయిస్ చెప్పినట్టు అది అక్టోబర్ లో రాదు..మార్చ్ చివరి,ఏప్రిల్ మొదటి వారాల్లో వస్తుంది.మరి ఆ సమయంలో దసరా,దీపావళి కాకుండా వచ్చే పండుగలు ఏమున్నాయని చూస్తే మహాలయా అమావాస్య ఉంది..ఆ పండుగప్పుడు నది,సముద్ర స్నానాలు అన్నాడు కాబట్టి బహుశా జనం పిండప్రధానాలు ఇవ్వడానికి పోయి ఉండవచ్చు..ఆ మహాలయ పక్షమంతా జరుపుకోవచ్చు కానీ చివరి మూడు రోజుల్లో ఎక్కువమంది జరుపుకుని ఉండొచ్చు..పితృ దేవతలకు బట్టలూ పెట్టి వాటిని ధరించి ఉంటారు..ఇక మద్యాన్ని నివేదించే సంప్రదాయం ఉంది కాబట్టి బ్రహ్మాండంగా తాగిఊగిండవచ్చు.
మహాలయ అమావాస్య అయిన మరుసటిదినమే దసరా నవరాత్రులు ప్రారంభం అవుతుంది.దస్రా తర్వాత 20రోజులకు వచ్చే అమావాస్య దీపావళి.సాధారణంగా దసరా సెప్టంబర్ చివరి,అక్టోబర్ మొదటివారాల్లో వస్తుంది.ఇక్కడ వర్ణించిన మూడు పండుగలూ నెల వ్యవధిలో వస్తాయి
దీపావళి గురించి ఏ సందేహాలూ లేవు.
ఇక మహానవమిలో వర్ణించినది సిడిమాను అయి ఉంటుంది.పూలు,పళ్లు విసిరెయ్యటం ఇప్పటికీ తిరునాళ్లలో తేరు మీద విసురుతారు..కదిరి తిరునాళ్ల తేరు మీదకు దవణం,మిరియాలు విసిరే ఆచారం ఉంది.ఇక తిరుమలలో నాణేలు విసరకండి,అర్చకులకు గాయాలవుతున్నాయనే అభ్యర్ధన చదువుతుంటాము.
కావ్యాల్లో వర్ణించిన వసంతోత్సవాలు ఉగాది కాక హోలీ ఎందుకవుతుంది?అప్పటికి వసంతమే రాదు.
అసలు హోలీ ఒక విషాద పండుగ.
ఇవాళ్టిరోజుల్లో వికీల్లో,పుస్తకాల్లో,పత్రికల్లో హోలీ పండుగ రాధాకృష్ణుల రాసలీలగానే కాకుండా ప్రహ్లాదుడి కథలో అతన్ని మోసపుచ్చి వళ్లో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దిగి దహనమైన హోళిక కథ చెబుతున్నారు.
నిజానికి ఒకప్పటి పండుగల జాబితాలో దీన్ని "కాముని పున్నమి" అనేవారు కాదా!
శివపార్వతుల కళ్యాణం కోసం పంపబడి శివుడి క్రోధాగ్నిలో భస్మమైన కామదేవుడు మన్మధుని పండుగ హోలీ.
మా చిన్నప్పుడు కామన కట్టెలు అని పోగు చేసేవారు..ఆ పున్నమి రాత్రి వాటిని దహనం చేసేవారు..ఇదే కామదహనం...ఇప్పుడు ఈ ఆచారం మాయమైంది కానీ ఇంకా ఒకటీ అరా సుగాలి/లంబాడా తండాల్లో మిగిలుందేమో తెలియదు.హోలీ ప్రధానంగా వారి పండుగ.
కామదహనం జరిగాక శోకిస్తూ ఆ బూడిదను పూసుకునే ఆచారం ఉండేదట.
సరే.. ఇంతకూ ఈ కాముని ఆరాధన మనదేనా?మనమొక్కరమే జరుపుకునేవారమా?