తెలుగులో ఎంత ఉర్దూ ఉందోె చూడండి

 |  First Published Jan 10, 2017, 5:57 AM IST

మమ్మీ డాడీ సంస్కృతి మంచిది కాదనీ ,మనము అచ్చ తెలుగు మాత్రమే మాట్లాడాలని కొంత మంది జాతీయ వాదులు అంటూ ఉండటం మనం వింటూ ఉంటాము . ఇందులో జాతీయ భావం ఎక్కువ గా ఉన్నట్టుంది . పరాయి పాలనను గురించి చెప్పేటప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు మాత్రము పరాయి వాళ్ళు ,మహమ్మదీయులు కాదు అన్నట్టు కవులు  కథలు రాస్తున్నారు .సినిమాలు తీస్తున్నారు. ఇది ఒకరకంగా దోషయుక్తమైన దృష్టి . ఇంగ్లీష్ వాళ్ళు ఎంత పరాయి వాళ్ళో మహమ్మదీయులు కూడా అంతే . ఇంగ్లీష్ వాళ్ళు శత్రువులు మహమ్మదీయులు మిత్రులు అనటం రాజకీయం . వాళ్ళెంతో వీళ్ళంతే .

 

Latest Videos

undefined

ప్రయత్నం చేసి ఇంగ్లీష్ కి ప్రత్యామ్నాయంగా హిందీ పదాలు సృష్టించి అవి ప్రచారంలోకి తెస్తున్నాము . మరి మన తెలుగులో ఉన్న ఉర్దూ పదాల సంగతేమిటి .వాటిని ఇంగ్లీష్ పదాల మాదిరిగా తీసేయ గలమా ?నిజానికి తెలుగల్లే అని పిస్తూ ఈ మాటలు గూఢచారులల్లే తెలుగల్లే కనబడుతూ  తెలుగులో తిరుగుతున్నయి .చాలామందికి ఇవి ఉర్దూ మాటలని తెలియదు . 

తెలుగు లోకి వచ్చి తెలుగేళ్లే స్థిర పది పోయిన మాటలు

మనం వాడే మాటలలో

 

రోజు. పర్షియన్...  ఈరోజు బాగుంది       

 

పర్వా  భయం ..ఫర్వాలేదు....ఉర్దూ

 

తేడా ...వంకర

ఎంతో తేడాఉంది ...ఉర్దూ

 

భేష్  ....భేషుగ్గా ఉంది ... హిందీ

 

అసలు:అసలు సంగతేమిటి లో లాగా (అసలు, నకల్ )

అలాగే ... వీడికి వాడు నకలు .. వీ డిని చూసి వాడ్ని చూడక్కరలేదు.

 

ఆఖరి : ఆఖరి నెత్తురు బొట్టు వరకు పోరాడతాను (ఆఖిర్ అనే ఉర్దూమాట )

 

త్రాసు: వాడు న్యాయం అన్యాయం త్రాసులో తూచినట్టు చెబుతాడు.

      (తరాజ్ )

దర్జా ' : ఎం దర్జా వెలగ పెడుతున్నాడు (దర్జీ కూడా దీని లో నుంచి వచ్చిందే )

 

తాహత్ : ఇది నా తాహత్ కు మించిన పని . (ఇది తా ఖత్  యొక్క అపభ్రంశ రూపం )

 

దబాయించటం : ఏంటోయ్ దబాయిస్తున్నావ్

చలాయించటం : ఎం అధికారం చెలాయిస్తున్నారు రా వీడు,.

(ఫై రెండు మాటలు క్రమంగా దబానా , చలానా మాటలకు తెలుగు "ఇంచు " ప్రత్యయం చేర్చిన రూపాలు .

 

ఖాయం   ఈ మాటలు పురోహితులు కూడా వాడుతుంటారు.   ."ముహూర్తం ఖాయమైందా "(  కాయం అనే ఉర్దూ మాట . )

ఇక ఈ ఉర్దూ మాటలు వేదం పండితులు కూడా వాడేవారని చెప్పటానికి " స్మార్త కారికా వృత్తి" అన్న పుస్తకంలో

కీ : శే : చల్లా లక్ష్మి నరసింహ  శాస్త్రి గారు " వరాగమనం "కి చేసిన ఈ అనువాదం చూడండి.

"ఉష్ణి కంచుక నవామ్బర కజ్జల స్రగ్ర త్నాం గుళీయ " అంటే వరుడు తలగుడ్డ ,చొక్కా, నూతనాంబరములు ,సుర్మా (కాటిక )

ఉర్దూ మాటలు తెలుగు లోకి వచ్చి ఎంత లోతు  గా పాతుకు పోయినయ్యో అర్థమవుతుంది .

మెహర్బానీ : వీడేదో పెద్ద మెహర్బానీ చేసినట్లు (మెహర్బాన్) దయ చూబించినట్టు , గొప్ప ఉపకారం చేసినట్టు

జాబు : ఉత్తరం అన్న అర్థం లో వాడుతారు . దాని అసలు మాట జవాబ్ ..ప్రత్యుత్తరం అని అర్థం . రిప్లై

తహశీల్ దార్ '" జమీందార్ ,శిరస్తదార్ ,జవాబుదారి .. దార్ అంటే హక్కు కలిగిన వాడు అన్న అర్థంలో వాడినట్లు కనబడుతుంది .

శిస్తు : పన్ను

 

ఖబడ్దార్ : ఇది మనం హెచ్చరిక అన్న అర్థం లో వాడతాము . కానీ అసలు అర్థం ఖబడ్డార్ అంటే "ఖబర్ కలిగిన వాడు" అని అర్థం.

అంటే ఒక రకం గా ముందు సమాచారం చెప్పటం .. పరంపర గా హెచ్చరించటం అనే అర్థమే వస్తుంది. " "హమ్  ఆప్కో ఖబర్దార్ కర్నేకో ఆయేహై :"

చివరికి బెదరించటం అనే అర్థం స్థిర పడిపోయింది.

  ఖతం .. ముగించటం .. అసలు ఖత్మ్ కాస్తా తెలుగులోకి వచ్చి  ఖతం అయింది.

ఖాతర్ : లెక్క చెయ్యటం అనే అర్థం లో వాడుతారు .   నా మాట కొద్దిగానయినా ఖాతరు చేయడు .

అమల్ చేయటం .. ఈ ఆర్డర్ అమలు లోకి వచ్చిమ్ది ( ప్రభావ వంతమైనది )

   గవర్నమెంటు రూలుంది  కానీ ఎవడు అమలు చేస్తున్నాడు .

 

ఫిర్యాదు : ఫరియాద్ అనే ఉర్దూ పదం

బరాబర్ : అంటే సమానమన్న అర్థం లో .. కానీ కావ్యాలలో వంది  మాగధుల బరాబారులు ..అంటే నువ్వు ఇంద్రుడి తో సమానం చంద్రుడితో సమానం అని వంది  మాగధులు పలకటం అన్న మాట

 

రాయితీ : హిందీ లో పన్ను రద్దు  చేయటం .. హిందీ ఉర్దూ రెండూ ...

రద్దు : అంటే నిష్ఫలమ్ చేయటం

బడాయి : ఉన్నదానికంటే బడా చేయటం అంటే పెద్ద గా చేయటం .. పోవోయ్ పెద్ద బడాయి అలాగే జిలాయ్ (మూలం తెలియదు) .

గులాము : బానిస..  ఇది ఉర్దూ అని తెలిసి కొంత మంది తెలియక కొంత మంది వాడుతుంటారు.

కోస్టల్ జిల్లాలలో .. పెళ్లిళ్ల లో వసంతం రంగులు చల్లుకోవటాన్ని గులాం చల్లుకోవడం అంటారు. .. అది గులాల్ కి వచ్చిన తిప్పలు..

 

నాన్న అన్నది అన్య భాషా పదం .. నానా అన్నాశబ్దం నుండి వచ్చిందేమో .. సంస్కృతం లో తాత అంటే తండ్రి. కానీ తెలుగులో తాత అంటే పితామహుడో  మాతామహుడో . అట్లాగే నానా శబ్దం కూడా నానా  అంటే తల్లి తండ్రి .  తండ్రి అని అర్థంవచ్చిందేమో

 

చౌరస్తా : చతుష్పథం : కూడలి : గాంధీ చౌరస్తా

బజార్: సంత అని అర్థం .. కానీ మనం దానిని రోడ్ , వీధి అనే అర్థం లో వాడుతాం .పట్నం బజార్ .. మొదలైనవి

మిఠాయి : మీఠా శబ్ద భవం  ; తీపివంటకం

హక్కు : హాక్ .. .స్వాతంత్రము  నా జన్మ హక్కు

బాబు : ఈ మాట రాను రాను చిన్న పిల్లవాడిని గురించి వర్ణన కిందికి వచ్చిమ్ది. దీనికి Brown గారిచ్చిన అర్థం ....Cognate with English Papa Sanscrit  పిత ,Hebrew Abba ,

ఫాదర్ తండ్రి , ఆ venerable man పూజ్యుడు బహుశా బాబు రాజేంద్ర ప్రసాద్ లోని అర్థం ఇదేనేమో .

హుకుం : ఆజ్ఞ (హుక్మ్ ) హుకుం జారీ చేసాడు .

హుళక్కి : ఇది కన్నడం మాట

హుషారు: బహుశా ఇది ఉర్దూ హోషియార్ నుంచి వచ్చింది. జాగరుకాతతో(మేలుకొనిఉండటం) ఉండమని అర్థం కావచ్చు .

ఇవేకాదు ఇంకా చాలా ఉన్నయి .మనం తెలుగనుకుని వాడుతున్నప్పుడు తెలుస్తయి .

కచేరీ : బహుశా రాజు గారికి ఆస్థానం లో జరిగేవేమో .. అందుకనే సంగీత కచేరీ అనే వాడుక వచ్చ్చిందేమో . 

హుజుర్ : ఇది ఉర్దూ మాట ప్రభువువారి సుముఖం లో ఉండటం ..జీ హుజూ ర్  

గురజాడ అప్పారావు గారు గిరీశం చేత అనిపిస్తారు,. :హమేషా బాద్షా వారి హుజుర్న్ ఉండటం :

 

ఇంకా చెప్పుకుంటూ పొతే విసుగు పుట్టి :"ఇన్ని ఉన్నయ్యా " అని పిస్తుంది.

అందుకని ఇకనైనా ఇంగ్లీష్ వాళ్ళు శత్రువులు మహమ్మదీయులు మిత్రులు అనే అభిప్రాయం వదిలేస్తే

బాగుంటుంది. మనని పాలించిన వారంతా మన మిత్రులే ..

కాదు అనుకుంటే మన భాష నుండి పరాయి భాషా పదాలను తీసివేయండి.

ఇంగ్లీష్ వాళ్ళు శత్రువులు కాదు మహమ్మదీయులు మిత్రులు కాదు. అయితే ఇద్దరు శత్రువులు లేకపోతే ఇద్దరు మిత్రులే .

click me!