అవునన్నా కాదన్నా నువ్వు కరెక్ట్

 |  First Published Dec 7, 2016, 11:53 AM IST

 

Latest Videos

undefined

ఎండలో తిరక్కు - తిరగను

వర్షం లో తడవకు - తడవను

ఆరు కల్లా ఇంట్లొ వుండాలి - వుంటాను

బయట వాళ్లతో ఆడకు - ఆడను  

తమదంటు ఒక ఉనికి లేని వాళ్ళను మనం చూస్తూనే వుంటాం.

తమకంటూ ఒక ఇష్టం, తమకంటూ ఒక నిర్దిష్టమైన నిర్ణయం లేని వాళ్ళను మనం చూస్తూనే వుంటాం.

వీడిదో పెద్ద నెగెటివ్ ఆట్టిట్యుడ్ ఏది పాసిటివ్ గా మాట్లాడడు కదా   అనే మాటలు వింటూనే వుంటాం.

హెన్రి ఫోర్డ్ అన్నాడు " నువ్వు అవునన్నా లేక కాదన్నా" నువ్వు కరెక్ట్. అంటే ఏదీ తేల్చి చెప్పని వాడు సరైన వాడు కాదన్నమాట  ఇవన్నీ మనిషి వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాలు 

 

వ్యక్తిత్వం

 

వ్యక్తిత్వం అనేది ఒక మనిషి నుండి మరో మనిషిని  వేరు పరచి చూపించే ప్రత్యేక లక్షణంగా నిర్వచించ వచ్చు . పసితనం నుండే పరిసరాల ప్రభావం మనిషిమీద పనిచేస్తూ ఆ ప్రభావం పట్ల అ మనిషి స్పందించే తీరూ,  ఆ మనిషి యొక్క అలవాట్లూ, ఆలోచనలూ,  జ్ఞాపకాలూ, నైపుణ్యాలూ మొదలైన విషయాలు ఆ మనిషి  వ్యక్తిత్వాన్ని రూపొందిస్తాయి.   ఈ ప్రక్రియలో నే  ఆ మనిషి  వైఖరి, వ్యక్తిగత అభిప్రాయాలూ,  సాంఘిక బంధాలూ, విలువలూ సామాజిక దృక్పధాలూ ఉత్పన్నమౌతాయి. ఒక వ్యక్తిత్వం రూపొందుతుంది.

 

వ్యక్తిత్వ వికాసం 

 

జీవితం పట్ల ధనాత్మక దృక్పధాన్ని ఏర్పరచుకుని, వృత్తిలో మరియు జీవితం లో చేసే పనుల్లో సాఫల్యాన్ని పొందుతూ, మానసిక వత్తిడి లేకుండా జీవితాన్ని కొనసాగించడానికి వ్యక్తిత్వ వికాసం సహాయపడుతుంది   మన  చుట్టూ ఉన్న మనుషుల తో - కుటుంబ వ్యక్తులైనా, స్నేహితులైనా, సభ్య సమాజపు వ్యక్తులైనా - మన వ్యక్తిగత సంబంధాల బలం మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

 

 

మనిషి సంఘజీవి.  సంఘమంటే మనుషులూ, వారి ప్రవర్తనల సమ్మేళనం. సంఘం తో సరైన  లావాదేవీలు జరపలేక పోతే జీవితం నిర్జీవంగా, దుర్భరంగా తయారవుతుంది. జీవితం లో కొంతమందిని చూస్తే వారికి దగ్గరవ్వాలని, వారితో ఎక్కువ సేపు గడపాలనీ, వారి దృష్టి లో మంచి వారనిపించుకోవాలనీ, వారు చెప్పేది వినాలనీ అనిపిస్తుంది. అలాగే ఇంకొంతమందిని చూస్తే వారికి సాధ్యమైనంత దూరంగా వుండాలనిపిస్తుంది. 

చూసే వారి దృష్ట్యా మొదటి తరహా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని ధనాత్మకంగానూ, రెండవ తరహా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని ఋణాత్మకంగానూ పరిగణించవచ్చు. ఎదుటి వారి దృష్టిలో మనం మొదటి తరహా వ్యక్తులుగా లేమని తెలిస్తే మన వ్యక్తిత్వంలో ఎదో లోపముందనుకోవాలి. శుభవార్త ఏమిటంటే సాధన ద్వారా వ్యక్తిత్వాన్ని మెరుగు పర్చుకో వచ్చు.  అందరూ కొనియాడే విధంగా మలుచుకోవచ్చు - వ్యక్తిత్వ వికాసం ద్వారా జీవనశైలి లో మార్పులు తీసుకురావచ్చు. మనల్ని మనం ప్రపంచానికి అనుగుణంగా, ప్రపంచం మెచ్చే విధంగా తయారు  చేసుకోవచ్చు.   

 

వ్యక్తిత్వవికాస ప్రక్రియ ద్వారా ఆత్మ న్యూనతా భావాన్ని తొలగించుకోవచ్చు.  ఆత్మ విశ్వాసాన్ని  పెంచుకోవచ్చు. సంభాషించే తీరు మెరుగు పరచుకోవచ్చు. మంచి అలవాట్లనీ, కొత్త నైపుణ్యాలనీ అలవర్చుకోవచ్చు సభ్యతా సంస్కారాలను పెంపొందించుకోవచ్చు.  నడకకీ, నడతకీ ఒక కొత్త శైలిని ఆపాదించవచ్చు. మొత్తంగా మనచుట్టు ఒక ఆహ్లదకరమైన వాతావరణాన్ని సృష్టించి స్ఫూర్తి దాయక వ్యక్తిగా మారవచ్చు.

 

వ్యక్తిత్వ వికాసానికి అనేక రకమైన శిక్షణా  సంస్థలూ, వందల సంఖ్యలో పుస్తకాలూ, అంతర్జాలం, వివిధరకాల చిట్కాలు వున్నాయి. అయితే ఎవరెంత చెప్పినా చేయవల్సింది మనమే. ఎవరైనా నియమాలు చెప్పగలరు. మనం పాటించ నంతవరకూ ఏ నియమం కూడా పనిచేయదు.              

click me!