undefined
నవంబర్, 1984, ఎనిమిదవ లోక సభ ఎన్నికలకు ముందు, కర్నూలు ప్రభుత్వ అతిథి గృహంలో నేను మొట్టమొదటి సారిగా రాజ శేఖరరెడ్డి గారిని కలిశాను. ఆయన అప్పుడు ఆంధ్ర ప్రదేశ కాంగ్రెస్ కమిటి (పిసిసి) అధ్యక్షులు. గుమికూడిన వాళ్ళందరమూ ఆయన ఆప్యాయ పలుకులతో ఉబ్బి పోయామంటె తక్కువే. మేమందరూ ఎన్నోరోజులనుండి ఆయనకు స్నేహితులుగా ఉన్నట్ల నిపించింది. ప్రేమించిన వాళ్ళంతా మొదటి చూపుతోనే ప్రేమించారని. ( Whoever he loved, he loved at first sight) షేక్స్ పియర్ అన్నది గుర్తుందిగా. ఆనాటినుండి, సెఫ్టెంబర్, 2, 2009 న చనిపోయేవరకూ, నన్నెప్పుడు కలిసిన, "ఏమయ్య, అన్నదాతా, బాగున్నారా?" అంటూ ఎవరికి పరియచయం చేసినా: "కర్నూలులో కాంగ్రెస్ పార్టికే అన్నదాత"అని ముందు అన్నాకే ’కర్నూలు పట్టణ కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు’ అనేవారు. ఈ అనుభవం, నా ఒకనిదే కాదు.అందరిది. అది ఆయన జీవిత శైలి. వందల మంది ఉన్న గుంఫులో, తనకి తెలిసిన, సన్నిహితుడెవరయినా కనబడితే పలకరించకుండా ముందుకు పోలేడు, కష్ట కాలములొ తనతొ ఉన్నవాళ్ళని, పేరుతొ పిలిచి, వాళ్ళ భుజం మీద చై పెట్టి పలకరించడం రాజశేఖర రెడ్డిగారి సొంతం. వారి పెదవుల పై, స్వాభావికమైన, శాశ్వతమైన చిరునవ్వు చెరగని ముద్ర.
1978 లో "రెడ్డి కాంగ్రెస్స్ పార్టీ" అభ్యర్థిగా, 29 ఏట మొట్ట మొదటి సారి వై.ఎస్.గారు పులివెందలనుండి శాసన సభకు ఎన్నికైనారు. పార్టీతొ పాటు, జాతీయ కాంగ్రెస్ లో చేరి పోయారు. 1980 లొ అంజయ్య గారి 60 మంది "ఎయిర్ బస్" మంత్రివర్గంలో, 1982 లో భవనం వెంకట్రామ్, 1982 -83 లొ కోట్ళ విజయ భాస్కర్ రెడ్డి గార్ల మంత్రివర్గములొ ఉన్నప్పుడు తప్పితే ఇంచు మించు, అందరూ ముఖ్యమంత్రులతొ ఆయనకు విభెదాలే. వారందరితోనూ పోరాటం. తనదంటూ ఒకవర్గం, జనాకర్షణ ఉన్నప్పటికి, కాంగ్రెస్ ను విడనాడలేదు. పోటీ చెసిన ప్రతి ఎన్నికలలోనూ గెలిచారు; ఐదు సార్లు శాసన సభకు, నాల్గు సార్లు లోక సభకు ఎన్నికైనారు. ఎన్నికలకు నామ పత్రాలు దాఖలు చీసిన తరువాత ఒక రోజు కూడా తన నియోజక్ వర్గములో ప్రచారం చెయకుండా ఇలా విజయం సాధించిన రెండవ వ్యక్తి వై.ఎస్. ఇంకొకరు, మహారాష్ట్ర, బారామతి కి చెందిన శరద్ పవార్. పవార్ పార్టి మారడమేగాక, పార్టి ఫిరాయింపులను ప్రోత్సాహించారు. అంత శక్తి ఉన్నప్పిటికి, వర్గ పోరాటం చెసిఉండవచ్చుగాక, వై.ఎస్., పార్టీ ఫిరాయించలేదు, ఫిరాయింపును ప్రొత్సహించలేదు.
వైెఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకున్న అనుబంధం గురించి వివరిస్తున్నారు తెలుగు-కన్నడ పండితుడు, కర్నూలు పట్టణ కాంగ్రెస్ ఒక నాటి అధ్యక్షుడు
కురాడి చంద్రశేఖర కల్కూర.సెప్టెంబర్, 2,2017న వైఎస్ ఆర్ 8 వ వర్ధంతి సందర్భంగా ఈ జ్ఞాపకం
1994 లొ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలొ ఓటమి పాలైన కొన్ని నెలల తరువాత, బెగంపేట విమానాశ్రయములొ, విఐపి. గదిలొ కలిచాను. టి తాపిచ్చి, మాజీ ముఖ్యమంత్రి విజయభాస్కర రెడ్డిగారి నాయకత్వాన్ని నిశితంగా విమర్శించారు. ఎక్కడ మాట వరుసకు కూడా అపశ్రుతి పలుకలేదు. అగౌరవం పరచే మాటలు లేవు. ఆఖరికి లేస్తూ: "కల్కూరాగారూ, మీరు ఆయన ఆంతరంగిక అనుచరుడు. "ఈ విషయాలను ఆయనుకు చెప్పుతారు. నాకు తెలుసు. ఐతె మీరు చాడి చెప్పరు. అందుకే మీదగ్గర చెప్పుతున్నాను. ఎంతైనా ఆయన మాకందరికి పెద్దాయనయ్యా, " అంటూ విమానమెక్క బోతూ, డ్రైవర్ ను పిలిచి, "స్వామిని ఎక్కడ కావాలంటె అక్కడ దించి ఇంటికెల్లి పో" అన్నారు. నేను నవ్వుతూ: "కర్నూలు పోతాను" అన్నా. డ్రైవర్ తొ: " డిసెల్ కు డబ్బులు ఉన్నాయా?" అని అడిగారు.
మనసా, వాచా, కర్మణా, రాజశెఖర రెడ్డిగారు, దేశము వెన్న ముక్కైన వ్యవసాయ రంగం మరియు రైతులు పక్షపాతి. ముఖ్య మంత్రిగా వై.ఎస్. గారు చెపట్టిన, రైతులకు ఉచిత విద్యుత్, దీనికి ఒక నిదర్శనమైతే, హైదరాబాద్ రాజెంద్రనగరములోని ఉన్న ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని పటిష్ఠం చెయ్యడముతొ పాటు, దాని పై ఒత్తిడి తగ్గించె యత్నములో , అధికారములోకి రాగానె, జులై, 15, 2005 నాడు, తిరుపతిలొ "శ్రీ వేంకటెశ్వర పశువైద్య విశ్వవిద్యాలం" ప్రారంభించారు. అదే దిశలొ జూన్, 26,2007 న ప.గొ. జిల్లా తాడేపల్లి గూడెములో ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. ఏప్రిల్, 11,2011 న దానిని "డా.వై.ఎస్.ఆర్, ఉద్యానవన విశ్వవిద్యాలయం" గా నామకరణమ్ చెయ్యడం ముదావహం. అలాగే దారిద్ర రేఖకు కింద ఉన్న వాళ్ళకు వైద్యబీమా సౌకర్యం, ఉచిత అంబ్యులెన్స్, చిన్న వ్యాపారస్తులకు పావలా వడ్డి పథకం, పేదలకు ఇందిరమ్మ ఇండ్ళ నిర్మాణం, కిలో రండు రూపాయిల బియ్యము, పథకం, అట్టడగున ఉన్న వర్గాలకు విద్యార్థి వేతనం, అల్ప సంఖ్యాకులలో ఉన్న పేదవాళ్ళకు రిజర్వేషన్ కల్పించడం, ఇతరేతరా సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు, పనికి ఆహార పథకాల సక్రమంగా అమలు పరచడం, నక్షలైట్ ల దూకుడుకు కళ్ళెం వేయ్యడం, పరిపాలనా పటిమకు నిదర్శనాలు. వై.ఎస్. కీర్తి కిరీటములొ కలికితురాయి జలయజ్నం: పోలవరం, పులిచింతల, చెవెళ్ల- ప్రాణహిత, హంద్రి -నీవా, గాలేరు -నగరి, మొదలగు ప్రాజక్టులకు ప్రాణం పోసింది ఆయనే. జలయజ్నం ఆంధ్రల దశాభ్దాల కల. దానికి కొత్త పేరులను పెట్టలేదు. అందువల్ల పై, పొరుగు రాష్ట్రాలనుండి అభ్యంతరం కూడా లేవు. గొప్పవాళ్ళెప్పుడూ "నేను సృష్టించాను" అని చెప్పుకొలేదు. "సత్యం, అహింస, పర్వతాలు, నది అంతే పురాతమైనవి. అందువల్ల, నేను చెప్పదగిన కొత్త సందేశాలేమి లేవు" గాంధీ అనుకరిస్తున్నట్లు ఆయన డాంబికానికి పోలేదు. వై.ఎస్.గారి ఆఖరి అధికార ప్రయాణం "రచ్చబండ" కార్యక్రమం. వ్యవస్థే కాదు, ఆ పదాన్ని కూడా తెలుగు ప్రజలు మరిచి పోయే స్థితి ఉండింది. గ్రామీణ భారతంలో ఇటువంటి వ్యవస్థల కార్యాచరణ గురించి, గ్రామ సీమలలో శాంతి, భద్రతలను, అన్యోన్య భావాలను పెంచడంలొ వాటి పాత్రగురించి, హింది రచయిత ప్రేమ్ చంద్ వంటి వాళ్ళు కళ్ళకు కట్టినట్టుగా వ్రాసియున్నారు. ఆ వ్యవస్థను పునరుద్ధరణ చెయ్యడము, గ్రామీణ సంస్కృతికి సంప్రదాయానికి నిలువెత్తు సాక్షాత్కారమైన వైఎస్ గారి ఉద్దేశం; దానిని సాధించకుండానే పోయారు.
ప్రజల నాడిని అర్థం చేసుకొని, చిన్న, చిన్న దేవాలయాలకు దూప, దీప, నైవైద్యం సౌకర్య, అర్చకులకు, కనీసం గౌరవ వేతనం, దేవాలయాల ఆస్తులను కాపాడడములో చొరవ, పేదరిక రేఖ నుండి కిందున్న ప్రజలకు, ప్రణాళికలను అమలు పరచడం ద్వారా వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో ఉండి పోతారు. చని పోవడానికి కొన్నాళ్ళ ముందు, ఒంగోలులొ, ఎవ్వరో, ప్రకాశం పంతులుగారి ముని మనమడు దీన స్థితిలొ ఉన్నాడంటే అప్పుటికప్పుడే ఆ అభాగ్యునికి ఉద్యోగం కల్పిస్తూ, ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చెయించారు.
i మేధావి కాక పోయినా, వై.ఎస్.ఆర్, చదువుకొన్న వ్యక్తి. ప్రతి పక్షంలొ ఉన్నప్పుడుగాని, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడుగాని, బహిరంగ సభలో కాని, శాసన సభలో గాని మాట్ళడడానికి లేచినారంటె, సందర్భానికి అతికే తెలుగు పద్యాలు, పాటలు, సామెతలు, వాఘ్రూడిలు చెప్పడం ఆయన సొంతం. తెలుగు పద్యాలు, శాసన సభలోనూ, బహిరంగ సభలోనూ, పాడె ఇంకొక ముఖ్యమంత్రి మనకు వస్తారా? పంచ కట్టుతొ, ఆయన నిలువెత్తు, పదహారణాల తెలుగువాడు. రాయలసీమ గ్రామీణ సంస్కృతి, సంస్కారానికి ఆయన ప్రత్యక్ష సాక్షి. నవంబర్ 27, 2003 న హైదరాబాద్ లొ ’ది హిందూ’, పత్రిక 125 వ జయంతిలొ పాల్గొని, షేక్స్ పియర్ మాటలలో, పత్రికను క్లియో పట్రాతో పోల్చి: "Age cannot wither her, nor custom stale her infinite variety". అన్నారు.