అప్పట్లో ఒక బెంగాలీ బాబు అనిల్ గంగూలి తానే బెంగాలి లో నిర్మించిన సినిమాను "సాహెబ్" అంటూ హిందీలో అనిల్‌కపూర్ హీరోగా నిర్మించాడు.
undefined
ఇక బెంగాలీల ఫుట్‌బాల్ మోజు తెలిసిందే కదా.ఇంట్లో చిన్నవాడైన కథానాయకుడు ఆటలో మునిగితేలుతూ చీవాట్లు తింటుంటాడు.చివరికి యోగ్యులైన అన్నలు చెల్లి పెళ్లి చేయలేకపోతే,తాను ఇకమీదట ఫుట్‌బాల్ ఆడే అవకాశం ఉండదని తెలిసీ తన కిడ్నీ ని అమ్మేస్తాడు.
ఈసినిమా ఆధారంగా అనేక ప్రాంతీయ భాషల్లోనూ సినిమాలు తీసారు. తెలుగులో చిరంజీవి హీరోగా విజేత కు ఆధారం ఈసినిమానే.
ఈ దేశంలో ఎందరో కొన్ని వందలకే రక్తాన్నే అమ్ముకునేవారున్నారు,ఇక అప్పట్లో వేలు,లక్షలు వచ్చే కిడ్నీ అమ్ముకోరా?పేదరికం వాళ్ల పాలిట శాపమై ఆపని చేయిస్తుంది.ఇక అన్ని రంగాల్లానే ఇక్కడా దళారులు తయారయ్యారు. వీళ్లు లక్షల్లో బేరాలు చేసుకుని దాతలకు తృణమో ఫణమో చేతిలో పెట్టేవారు.ఇదో పెద్ద మాఫియా అయికూర్చుంది.ఆతర్వాత ప్రభుత్వం అవయవదాతల మీద ఆంక్షలు విధిస్తూ Human organs transplant act 1994 చట్టాన్ని తెచ్చారు.దీనికి 2011 లో మరిన్ని సవరణలు చేసి 2014 లో కొత్తనిబంధనలు ప్రకటించారు.
మనదేశంలో అవయవదానం మీద అవగాహన తక్కువ. ఏటా 5 లక్షలమంది అవయవదాతలు లేక మరణిస్తున్నారు.
ఈ దాతలను జీవించి ఉన్నవారు,మరణానంతర దాతలుగా రెండుగా విభజించారు.
రక్తసంబంధీకులు అంటే తల్లిదండ్రులు,తోబుట్టువులు,జీవితభాగస్వామి,పిల్లలు..ఆ తర్వాత తాత,అవ్వలనూ చేర్చారు.ఈ దాతలు ఒక కమిటీ ముందు హాజరై అవయవదానం చేస్తున్న కారణాన్ని వివరించాలి.రక్తసంబంధీకులు కాకుండా సన్నిహితమిత్రులు,బంధువులూ దానం చేయవచ్చు,బలమైన కారణాలు ఉండాలని చట్టం చెబుతుంది.
ఇక చనిపోయిన.. అంటే బ్రెయిన్ డెత్ అయినవారి నుంచీ అవయవాలు స్వీకరిస్తారు.ఈ చనిపోయిన వ్యక్తులు అంతకుముందు ఏ స్వచ్చంద సంస్థకైన అవయవదానం చేస్తామని రాసి ఉండాలి లేదా వారి దగ్గరి రక్తసంబంధీకులు దానానికి ఒప్పుకోవాలి.
ఈ బ్రైయిన్ డెడ్ అయినవారి గుండె,కాలేయము,మూత్రపిండాలు,ప్రేవులు,క్లోమగ్రంధులు దానం చెయ్యవచ్చు.బ్రెయిన్ డెత్ అని తెలిసాక అవయవాలకు అవసరమైన ఆక్సిజన్ ను పంపుతూ నిర్ణీతసమయంలో అవయవాలను సేకరించాలి. ఇదే కాకుండా గుండెజబ్బులతో మరణించినవారి టిష్యూ(కణజాలం)ను దానం చెయ్యవచ్చు.
ఇక మరణించిన వ్యక్తి నుంచి సేకరించిన కార్నియాతో ఇద్దరికి కంటిచూపు తెప్పించవచ్చు.
కాలిన గాయాలవారికి చర్మం,హృద్రోగులకు గుండె కవాటాలు ఉపయోగపడుతాయి.
మొత్తానికి జీవించినవారైతే...రక్తం,ఎముకలమూలుగు,మూత్రపిండం..క్లోమగ్రంధి,కాలేయాల్లోని చిన్నభాగాలను దానం చెయ్యవచ్చు.
చనిపోయినవారి కళ్లు,గుండెకవాటాలు,చర్మం,ఎముకలు,సిరలు,ధమనులు దానం ఇవ్వవచ్చు.
బ్రెయిన్ డెత్ వారినుంచి పిండాలు,కాలేయం,ఊపిరితిత్తులు,చర్మం,కళ్లు,వేళ్లు,క్లోమగ్రంధి,ప్రేవులు....ఎన్నో దానం చెయ్యవచ్చు.
మన ధర్మాలు చెప్పిందీ "పరోపకారార్ధం ఇదం శరీరం" అనేగా...ఇవాళ ఎన్నో స్వచ్చంద సంస్థలు ఉన్నాయి..ఈదానం ఇవ్వలనే సంకల్పం తీసుకుని వారిదగ్గర పేరు నమోదు చేయించుకోవాలి లేదా మన సన్నిహిత బంధుమిత్రులకు మన కోరిక తెలియజేయాలి...చనిపోయాక ఎంతసేపు ఏడుస్తూ కూర్చుంటారు?చిన్న ఊర్లలో అన్ని అవయవాలు తీసుకునే సౌకర్యం లేకున్న కళ్లు తీసుకుంటున్నారు...చావు ఇంట్లో ఎవరోఒకరు పూనుకుని ఇంటివారికి నచ్చజెప్పి కళ్లు దానం చేఇంచాలి..కొందరికి అపోహ ఉన్నట్లు కనుగుడ్లు మొత్తం పెకిలించరు..ఈ దానం వల్ల ఇద్దరికి చూపు వస్తుంది..మనదేశంలో కిడ్నీ అవసరమైన 3000 మందిలో ఒకరికి దాతలు దొరుకుతున్నారు.ఏటా 25,000 మందికి కాలేయమార్పిడి అవసరమైతే 800 మాత్రం సేకరిస్తున్నారు...
100 ఏళ్లు ఉన్నవారి కార్నియ,70 ఏళ్లవరకూ చర్మాన్ని ,50 ఏలవారైనా మూత్రపిండాలు,కాలేయం ఇవ్వొచ్చు...
ఇంతా చేసి మనదేశంలో పారదర్శకత ఉందా అంటారా?నాకూ అనుమానమే!
ఎందరో రోగులు అవయవదాతల కోసం ఎదురుచూస్తూ తమ పేర్లు నమోదు చేయించుకున్నారు....
అదేం విడ్డూరమో...కొందరు భాగ్యశాలులకు మాత్రం అవయవాలు ఇట్టే దొరుకుతాయి....
ఉదాహరణకు మన చిన్నమ్మ సుష్మా స్వరాజ్ నే తీసుకోండి...ఏదో జ్వరానికి చేరినట్టు వైద్యశాలలో చేరింది..వెంటనే మూత్రపిండాలు దొరికాయి..మార్చేసారు...ఇవాళ ఇల్లు చేరుతుంది.
సరే ఇట్లాంటి చెత్తాచెదారాలు జరుగుతునే ఉంటాయి....వర్షం అన్ని చోట్లా వర్షిస్తుంది అనుకుంటూ మనం చేసేపని మనం చేద్దాం....చచ్చీ చిరంజీవులమవుదాం...