ఒక తెలుగోడి వంకాయ కబుర్లివి

 |  First Published Sep 9, 2017, 5:28 PM IST

ఎప్పుడూ ఇంగ్లీషు లో గొణుక్కొనే నాకు, ఈ రోజు తెలుగు తెగులు కూడ పట్టుకొవటం విశేషం. ఈ తెగులుకి కారణం మాతృ భాష పైన ప్రేమా అనుకో లేక ఇంకేదయినా కారణం ఉందా.... మొత్తానికి ఈ రొజు తెలుగుని ఉధ్ధరిద్దామని నిశ్చయించుకున్నాను. ఎందుకలా జరగిందబ్బా, చాలా  అలోచించాను. ఎస్, రీజని దే... నేను చెప్పాలని అనుకుంటున్నది వంకాయ గురించి. వంకాయకు నాకు ఉన్న అనుబంధం గురించి. అందుకే తెలుగు తన్నుకొచ్చింది.

నేను బీ.టీ వంకాయ గురించి చెప్పట్లేదు లే, భయ పడకు. నిజానికి, ఈ నా రాతకి ప్రేరణ గొల్లపూడి అని చెప్పి, ఒక గెద్ద ముక్కు పెద్దాయన. బాగా రాస్తాడు.  ఆ మధ్య వంకాయ అని టైటల్ పెట్టి, ఒక వ్యాసం రాసాడు, ఏదో ఆన్లైన్ పత్రిక లో. అసలే ఇంటి తిండి లేక అలమటిస్తున్న నాకు, వంకాయ పేరు విన గానే ఆల్మోస్టు నోట్లో నీళ్ళూరాయి. వ్యాసం మొదట్లో వంకాయ గొప్పతనం బాగానే పొగడటం జరిగింది. రాజకీయ వంకాయ అంటే బీటీ బ్రింజాల్ పైకి తన బండిని పోనిచ్చి, అలా ఆంధ్ర రాష్ట్రం లో జరుగుతున్న ఉద్యమాల దగ్గర ఆగి జోకులు కూడా ఏసాడు. బాగానే వుంది వ్యాసం.

Latest Videos

undefined

కాని, వంకాయ గురించి పూర్తిగా చెప్పకుండా, వంకాయకి తీరని అన్యాయం చేసాడు.నాకు కోపం వచ్చింది. పాపం, పత్రికాయన, గుత్తొంకాయ చుట్టు ఎక్కువ ముచట్లు అల్లొద్దన్నారేమోలే... పర్లేదు. మిగతావి నేను చెప్పాలని డిసైడ్ అయ్యాను.అదీకత.

 

దూరంగా వుంటేనే తప్ప అమ్మ ప్రేమ, వంకాయ రుచి అర్థం కాదు ఎవడికీ.  అందుకే, ఛాన్సు దొరికినప్పుడల్లా అమ్మ గొప్పతనాన్ని, వంకాయ ప్రాశస్త్యాన్ని గుర్తు చెేస్కుంటుంటాను.

 

 వంకాయ్ గురించి, అది నాలో పెడుతున్న మానసిక క్షోభ ని గురించి నీకు చెప్పాలనుకున్నా. ఎందుకనిఅడిగావా... నువ్వు ఇక్కడికి వచ్చి మా హాస్టలు లో తినుంటే  తెలిసేది. దూరంగా వుంటేనే తప్ప అమ్మ ప్రేమ, వంకాయ రుచి అర్థం కాదు ఎవడికీ.  అందుకే, ఛాన్సు దొరికినప్పుడల్లా అమ్మ గొప్పతనాన్ని, వంకాయ ప్రాశస్త్యాన్ని గుర్తు చేస్కుంటుంటాను. అమ్మ ముచ్చట్లు తర్వాత చెప్తాలే, ప్రస్తుతానికి వంకాయకి, నాకు వున్న సంబంధం గురించి చెప్తాను విను.చిన్నప్పుడు, మా బాప్ప(అత్త) వంకాయలు పండించేది. మా ఇల్లు ఆళ్ళ ఇంటికి చాలా దగ్గరగా వుండేదిలే. కూరలయిపోగానే సైకిల్ మీద మా బాప్ప గారి గుడ్డికి ఎళ్ళి వంకాయలు తెమ్మనేదిమా అమ్మ నన్ను. మా అమ్మని పిసినారి, కోతి అని తిట్టుకుని సైకిలు మీద ఎళ్ళే వాడిని. రెం....డు కిలోమీటర్ల ప్రయాణం. అక్కడికి ఎల్లి, వంకాయ గుడ్డిలో దూరి పుచ్చువో మంచివో ఏరుకుని వచ్చేవాడిని. ఇంటికి వొచ్చిన తర్వాత మా అమ్మ తిట్లు పట్టించుకొకుండా నా సైకిలి మీద స్వైర విహారనికి ఎల్లే వాడిని. వంకాయ లో పుచ్చులు వెతకడం బ్రహ్మ తరం కూడా కాదని చెప్పేవాడిని. ఉదయం, వంకాయ ఇగురు, మధ్యాన్నం వంకాయ ఫ్రయ్, రాత్రికి వంకాయ చారో, వంకాయ పప్పో వుండేవి. రాత్రి, పగలు ఈ వంకాయ టార్చర్ తట్టుకోలేక, మా అమ్మకి తిట్లు పడేవి బాగా. మా అమ్మని వంకాయ వండకుండా దిస్కరేజ్ చెయ్యడానికి బాప్ప గారింటి నుంచి తెచ్చే వంకాయలలో పుచ్చుల శాతం పెంచేవాడిని కూడా. ఐనా మా అమ్మ ఖాతరుచేయ లేదు. పైగా చిన్న వంకాయలు, రంగు తేలిన వంకాయలు .గుండ్రనివి,కోలవి తెమ్మని. గుచ్చి గుచ్చి మరీ చెప్పేది. మేము ఎన్ని తిట్టినా, అమ్మ మాత్రం ప్రతి ముద్ద కి వంకాయ గొప్పతనం కొనియాడేది. ‘వంకాయ నచ్చని కాపోడు వుండడనీ సామెతలు చెప్పేది. మా అమ్మే అనుకుంతే, మా డాడీ కూడా అంతే ఇష్టంగా తినేవారు. నాకు మాత్రం అది రోజూ తినలేక, కక్కలేక మింగలేక నానా తిట్లూ తిట్టేవాడిని వంకాయని. నాకు తోడు నా తమ్ముడు కూడా అదే రీతిలో నిరసన ప్రకటించేవాడు. అపుడపుడు నిరశన కూడా.
ఏళ్ళొచ్చిన కొద్దీ, రుచులు తెలిసిన కొద్దీ.రుచులు మారుతున్న కొద్ది, వంకాయ స్థానం పెరిగిపొయింది నా గుండెల్లో. వంకాయ అంటే నాకు ప్రాణమయింది, అమ్మ లాగ.


పోస్టు స్క్రిప్టు: అదృష్టవశాత్తు ఉద్యోగం హైదరాబాదు లో రావటం మూలాన, అమ్మ చేతి వంకాయ దొరక్కపోయినా నా రూం మేట్సు, నేను ఛాన్సు దొరికినప్పుడల్ల కర్రి పాయింటు నుంచి వంకాయ పచ్చో డో, వంకాయ వేపుడో, గుత్తి వంకాయో, వంకాయో కూరో తెచ్చుకుని దాని రుచిని పొగిడి మరీ తింటున్నాం.
వెధవ జీవితానికి వంకాయ తప్ప ఇంకేం కావాలి చెప్పు!!

 

 

 

 

( *విద్యాసాగర్ మంచి )

click me!