కర్నూల్ రైల్వేస్టేషన్లో కరోనా కలకలం... సంపర్క్ క్రాంతి రైల్లో అనుమానితుడు

By Arun Kumar PFirst Published Mar 20, 2020, 4:19 PM IST
Highlights

కర్నూల్ జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపింది. వ్యాది లక్షణాలున్న ఓ అనుమానితుడిని చేజ్ చేసి మరీ పట్టుకు న్నారు డోన్ పోలీసులు. 

కర్నూల్ జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపింది. ఈ వైరస్ బారినపడిన ఓ వ్యక్తి బయట తిరుగుతున్నాడన్న సమాచారంతో రైల్వే పోలీసులతో పాటు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో అతడి కోసం తీవ్రంగా గాలించి ఎట్టకేలకు అదపులోకి తీసుకోగలిగారు.  

కర్నూల్ జిల్లా డోన్ రైల్వే కమ్యూనికేషన్ అధికారులకు అనిల్ కుమార్ అనే వ్యక్తికి కరోనా లక్షణాలున్నట్లుగా గుంతకల్ రైల్వే సీనియర్ డిసిఎం నుండి సమాచారం అదింది. దీంతో స్థానిక అధికారులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మొదట అయితే అతడు ఎక్కడి నుంచి వచ్చాడు అనే సమాచారం కూడా అదికారులకు  తెలియదు. కేవలం బస్సులో వచ్చాడని మాత్రమే వారికి సమాచారం ఉంది.

read more   రాజధాని ఉద్యమంపై కరోనా ఎఫెక్ట్... రైతు నాయకులకు పోలీస్ నోటీసులు

దీంతో అతని కోసం డోన్ పోలీసులు మరియు రైల్వే పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. చివరకు అతను ఏపీ సంపర్క్ క్రాంతి రైల్లో డోన్ నుంచి ఝాన్సీ కు టికెట్ రిజర్వేషన్ చేసుకున్నట్టు గుర్తించి... అతడిని కర్నూలులో అదుపులోకి తీసుకున్నారు.

సంపర్క్ క్రాంతి ట్రైన్ లో S2 భోగి సీట్ నంబర్ 48లో అనిల్ కుమార్ (35 సంవత్సరాలు)ను కర్నూల్ లో అదుపులోకి తీసుకున్నారు. అయితే అంతకుముందు అతడు ప్రయాణించిన బస్సులోని 11 మంది ప్రయాణికులను కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. వారికి కూడా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.  

click me!