డిజిపి ఆఫీస్ పై వైసిపీ నిఘా... అందుకోసమే: దేవినేని ఉమ సంచలనం

By Arun Kumar P  |  First Published Mar 19, 2020, 8:35 PM IST

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమ సంచలన ఆరోపణలు చేశారు. 


అమరావతి: యావత్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్ ను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం చాలా లైట్ గా తీసుకుంటోందని మాజీ మంత్రి, టిడిపి నాయకులు దేవినేని ఉమ ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నా ముఖ్యమంత్రి జగన్ అహంకారంతో కనీసం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. 

విదేశాల నుండి ఇప్పటివరకు దాదాపు 11వేల మంది రాష్ట్రానికి వచ్చారని... వారి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని ఉమ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కనీసం కరోనా లక్షణాలున్న వారినయినా పరీక్షించారా? అని అడిగారు. దేశ ప్రధాని, ఇతర రాష్ట్రాల సీఎంలు బయటకు వచ్చి ప్రజలకు ధైర్యం చెబుతుంటే జగన్ మాత్రం ఒక్కసారి కూడా రాష్ట్రప్రజల ముందుకు రాలేదని అన్నారు. 

Latest Videos

undefined

జగన్ ప్రభుత్వం చేస్తున్న దాడినుండి రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత  దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై వుందన్నారు. కాబట్టి సుమోటోగా దీన్ని స్వీకరించి వైసిపి నుండి రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాలని కోరారు.  ఇప్పటికే డీజీపీ ఆఫీసుపై వైసీపీ నిఘా పెట్టిందని... తమ పార్టీకిచెందిన దినపత్రికకు చెందిన ఉద్యోగులను డీజీపీ కార్యాలయంలోని ప్రతి ఫ్లోర్‌లో ఉంచారని దేవినేని ఉమ ఆరోపించారు. 

read more  హోంశాఖకు ఈసీ లేఖ...చంద్రబాబు సన్నిహితులైన వారి నుండే: డిజిపితో వైసిపి ఎమ్మెల్యేలు

రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు రక్షణ కావాలంటూ కేంద్ర హోంశాఖను కోరడం పరిస్థితిని తెలియజేస్తుందన్నారు. ఆయనకు, ఎన్నికల సంఘం ఆఫీసును కేంద్రబలగాలు రక్షణ కల్పిస్తున్నాయని గుర్తుచేశారు. మంత్రులు, వైసిపి నాయకుల దౌర్జన్యం చేస్తూ గందరగోళం సృష్టించడం  వల్లే కేంద్ర సాయాన్ని కోరడం జరిగిందన్నారు దేవినేని ఉమ. 
 

click me!