video: ఉన్నతాధికారుల వేధింపులు... నడిరోడ్డుపై కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

By Arun Kumar P  |  First Published Nov 1, 2019, 3:46 PM IST

అనంతరపురం పట్టణంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనంగా మారింది. ఉన్నతాధికారుల వేధింపులతో తాను బలవన్మరణానికి ప్రయత్నించినట్లు పేర్కొనడంతో పోలీస్ శాఖలో దుమారం రేగింది.  


అనంతపురం పట్టణంలో ఓ పోలీస్ కానిస్టేబుల్ పట్టపగలే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా అక్కడేవున్న ట్రాఫిక్ పోలీసులతో పాటు ఇతర సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అతడు తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. 

అనంతపురం పరిధిలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తనను డీఎస్పీ వీరరాఘవ రెడ్డి వేధిస్తున్నట్లు బాధితుడు ప్రకాశ్ ఆరోపించాడు. అతడి నిత్యం పెట్టే వేధింపులను తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడినట్లు సదరు కానిస్టేబుల్ వెల్లడించాడు. 

Latest Videos

undefined

 read more ఉద్యోగాల భర్తీ... ఏపి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్

ఆయనపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసినా స్పందించకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఈ ఘటన తర్వాత అయినా అధికారులు స్పందించి తనను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని  కానిస్టేబుల్ ప్రకాశ్ డిమాండ్ చేశాడు.  

read more వీక్లీ ఆఫ్ మంచి నిర్ణయం...ఏపి పోలీస్ శాఖపై ప్రధాని ప్రశంసలు

ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ పనితీరుపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. గుజరాత్ వడోదరలో జరుగుతున్న ఆల్ ఇండియా పోలీస్ టెక్నికల్ ఎగ్జిబిషన్ లో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపి పోలీసులు ఏర్పాటుచేసిన స్టాల్ ప్రధానిని అమితంగా ఆకట్టుకోవడంతో అక్కడే కాస్సేపు ఆగి వివరాలను అడిగిమరీ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏపి పోలీసులను పొగిడారు.

ఇలా ప్రధాని నుండి ప్రశంసలు పొందిన తర్వాత రోజే పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యానికి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. పోలీస్ శాఖలో కిందిస్థాయి సిబ్బందిపై ఉన్నతాధికారులు విపరీతమైన బాసిజాన్ని ప్రదర్శిస్తారని ప్రచారం వుంది. అంతేకాదు కొందరు అధికారులతయితే కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగులతో వెట్టిచాకిరి చేయించిన కొన్ని సంఘటలను గతంలో బయటపడ్డాయి. 

వీడియో కోసం పక్కనున్న లింక్ పై క్లిక్ చేయండి   news video : పట్టపగలు..అందరూ చూస్తుండగా..ఒంటిపై కిరోసిన్ పోసుకుని...

అయితే ఇటీవలకాలంలో ప్రభుత్వాలు చేపడుతున్న సంస్కరణల కారణంగా  పోలీస్ శాఖలో చాలా మార్పులు వచ్చాయి. అయినప్పటికి కిందిస్థాయి సిబ్బందిపై మాత్రం వేధింపులు తగ్గలేవనడానికి కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నమే నిదర్శనంగా నిలించింది. 
 

 

click me!