జైల్లో చింతమనేనిని పరామర్శించిన నారా లోకేష్

By Arun Kumar P  |  First Published Oct 31, 2019, 2:20 PM IST

వివిధ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటూ ఏలూరు సబ్ జైల్లో వున్న చింతమనేని ప్రభాకర్ ను టిడిపి కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చింతమనేని కుటుంబసభ్యులను కూడా ఓదార్చారు.  


ఏలూరు: వివిధ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటూ ఏలూరు సబ్ జైల్లో వున్న టిడిపి నాయకులు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా సబ్ జైలుకు వెళ్లిన  లోకేష్ చింతమనేనిని కలుసుకున్నారు. కష్టకాలంలో  వున్న తనకి పార్టీ తరపునే కాదు వ్యక్తిగతంగా అండగా వుంటానని లోకేష్ హామీ ఇచ్చారు. 

వైఎస్సార్‌సిపి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి చింతమనేని ప్రభాకర్ పై కక్ష సాధిస్తూ వేదిస్తోందన్నారు. ఈ అక్రమ కేసులపై చింతమనేని చేస్తున్న న్యాయ పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని లోకేష్ వెల్లడించాడు.  

Latest Videos

undefined

జైలు నుండి నేరుగా చింతమనేని ఇంటికి వెళ్లిన లోకేష్ కుటుంబసభ్యులను పరామర్శించారు. తన  భర్తపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు,పోలీసులు వ్యవహరించిన తీరుని లోకేష్ కి చింతమనేని సతీమణి రాధ వివరించారు. వేధింపులకు భయపడకుండా పోరాటం చేస్తున్న వారి కుటుంబానికి అండగా ఉంటానని  లోకేష్ దైర్యాన్నిచ్చారు. 

read more  ఎంతకైనా తెగిస్తా: టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు

దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత  చింతమనేని ప్రభాకర్ ను కేసులు వెంటాడుతున్నాయి. ఈ కేసుల నుండి ఆయన తప్పించుకోలేకపోతున్నారు. జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్న చింతమనేని ప్రభాకర్ ను జోసెఫ్ ను బెదిరించిన కేసులో పోలీసులు మంగళవారం నాడు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై సెప్టెంబర్ 11వ తేదీన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టయ్యాడు. అప్పటి నుండి ఆయనను ఏలూరులోని జిల్లా జైలులో రిమాండ్‌లో ఉంచారు.

చింతమనేని ప్రభాకర్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలోనే పాత కేసుల్లో పీటీ వారంట్ పై అరెస్ట్ చూపిస్తున్నారు పోలీసులు.  ఇందులో భాగంగానే ఇప్పటికే 13 కేసుల్లో పిటీ వారంట్‌పై చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్ట్ చూపించారు.

read more  చింతమనేనికి చుక్కలే చుక్కలు: మరో కేసు నమోదు

పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన  చెరుకు జోసెఫ్‌ను ఈ ఏడాది ఆగష్టు 28వ తేదీన చింతమనేని ప్రభాకర్‌, మరికొందరు  దాడి చేసి కులం పేరుతో దూషించారనే కేసు నమోదైంది. ఈ కేసును ఉపసంహరించుకోవాలని లేదంటే అతడిని అతడి కుటుంబ సబ్యుల అంతు చూస్తామని చింతమనేని ప్రభాకర్‌తో పాటు మరికొందరు బెదిరింపులకు పాల్పడినట్టుగా ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో జోసెఫ్ ఫిర్యాదు చేశాడు.

ఈ ఫిర్యాదు మేరకు  ఏలూరు త్రీ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.ప్పటికే మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ రిమాండ్‌ ఖైదీగా జిల్లా జైలులో ఉండడంతో పీటీ వారెంట్‌పై ఈ కేసులో అరెస్టు చూపించారు. 

 ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దెందులూరు అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న చింతమనేని ప్రభాకర్ కూడ ఓటమి పాలయ్యాడు.

చింతమనేని ప్రభాకర్ ఓటమి చెందగానే ఆయనపై ఉన్న పాత కేసులు తిరగతోడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి చింతమనేని ప్రభాకర్ ను వేధింపులకు గురిచేస్తున్నారని టీడీపీ నేతలు వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు.

read more  మరోసారి చింతమనేని అరెస్ట్...ఇది మరో కేసు

ఈ కేసుల్లో జిల్లా జైలులో ఉన్న చింతమనేని ప్రభాకర్‌  తనను బెదిరించాడని జోసెఫ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఫోన్‌లో తనను బెదిరించాడని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ ఫోన్ లో జోసెఫ్ ను ఎలా బెదిరించాడని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఏపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కీలకమైన టీడీపీ నేతలపై కేసులు నమోదౌతున్నాయి. కోడెల శివప్రసాదరావు కుటుంబసభ్యులపై  మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావులపై నమోదైన కేసుల గురించి టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.


 

click me!