కర్నూల్ జిల్లాలో ఓ యువతి దారుణానికి పాల్పడింది. తాను కోరుకున్నట్లు ప్రభుత్వ ఉద్యోగం రాలేదన్న మనస్థాపంతో కఠిన నిర్ణయాన్ని తీసుకుని తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది.
సచివాలయం ఉద్యోగం రాలేదన్న తీవ్ర మనస్తాపంతో ఓ కాంట్రాక్టు ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడింది. తన మీదనే ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల నమ్మకాన్ని నిజం చేయలేక పోయినందుకు మన్నించమని అంటూ చివరి లేఖ రాసి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. ఈ విషాదకర సంఘటన కర్నూలు పట్టణంలోని పీవి నరసింహారావు నగర్ లో చోటుచేసుకుంది.
పాణ్యం మండలానికి చెందిన ప్రియాంకకు రెండు సంవత్సరాల నుండి అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ గూడూరు మండలంలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తోంది. అయితే అప్పటి నుండి ఆ ఉద్యోగాన్ని పర్మినెంట్ చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలన్ని విఫలం కావడంతో ఇక లాభం లేదనుకుని ఇటీవల ప్రభుత్వం నోటిపికేషన్ జారీ చేసిన సచివాలయ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యింది.
undefined
ఈ ఉద్యోగానికి కి అప్లై చేసి అర్హత సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ అవి సక్సెస్ కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయనందుకు తనువు చాలించాలని కఠిన నిర్ణయం తీసుకుంది.
గూడూరులో విధులు ముగించుకున్న ప్రియాంక నగరంలోని పీవీ నరసింహారావు నగర్ లోని తన గదికి సాయంత్రం చేరుకుంది. గదిలోని ఫ్యాన్ కు చున్నీతో ఉరివేసుకుని బలవంతపు మరణానికి పాల్పడింది.
ప్రియాంక కోసం ఆమె గదికి వచ్చిన స్నేహితురాలు గమనించి ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలియ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ప్రియాంక వద్ద అ సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తాను సచివాలయ ఉద్యోగం సాధించలేక పోయినందుకు తండ్రికి క్షమాపణ చెబుతూ చివరి లేఖను రాసింది. తన మరణంతో ఎవరు దిగులు పడవద్దని... అక్కను బాగా చూసుకోవాలని అందులో కోరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
read more సచివాలయానికి డుమ్మా... మంత్రులపై జగన్ సీరియస్
తల్లి రజిత హత్య: కీర్తితో మద్యం తాగించి, రెచ్చగొట్టిన శశికుమార్