ఆ బిజెపి నేత మాటే టిడిపిలో చెల్లుబాటు...అందుకే రాజీనామా: కేఈ ప్రభాకర్ సంచలనం

By Arun Kumar P  |  First Published Mar 13, 2020, 1:57 PM IST

స్థానికసంస్థల ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో  తెలుగుదేశం పార్టీకీ మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా చేసి షాకిచ్చారు.  


కర్నూల్: స్థానికసంస్థల ఎన్నికల సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టిడిపిని వీడగా తాజాగా మరో కీలక నాయకుడు కూడా పార్టీకి రాజీనామా  చేశారు. మాజీ  డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ రెడ్డి టిడిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 

రాజీనామా అనంతరం ఆయన మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో మనుగడ లేదన్నారు. ఆ పార్టీకి విధానాల వల్ల తాను తీవ్ర ఆవేదనకు గురయ్యానని... అందువల్లే పార్టీని వీడుతున్నట్లు పేర్కోన్నారు. కనీసం తాను అడిగిన కార్పొరేటర్ టికెట్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో టిడిపి పార్టీ ఉందన్నారు.

Latest Videos

undefined

READ MORE  చంద్రబాబు భారీ ఝలక్: టీడీపీకి కేఈ ప్రభాకర్ రాజీనామా

 ఓ బిజెపి నాయకుని మాటలనే టీడీపీ జిల్లా అధ్యక్షుడు వింటున్నారని... పార్టీ వ్యవహారాల్లో ఆ బిజెపి నాయకుడికున్న ప్రాధాన్యత మాకు లేకుండా పోయిందన్నారు. వీటన్నింటిని వల్లే టిడిపిని వీడుతున్నట్లు కేఈ తెలిపారు. 

తన అనుచరులకు, పార్టీ కోసం కష్టపడి పనిచేసే నాయకులకు టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని కేఈ ప్రభాకర్ ఆరోపించారు. ఇప్పటికయితే టిడిపి మాత్రమే రాజీనామా చేసినట్లు... ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుని ఏ పార్టీ లో చెరబోయేది ప్రకటిస్తానని కేఈ వెల్లడించారు.

READ MORE  17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో: సజ్జల రామకృష్ణారెడ్డి సంచలనం

ఇప్పటికయితే తనకు వైసిపి నుండి ఎలాంటి ఆహ్వానం రాలేదని తెలిపారు. ఒకవేళ వస్తే అందులోనే చేరతానని స్పష్టం చేశారు. ఇక తన సోదరుడు టిడిపిలోనే కొనసాగుతారా...లేక ఆయన కూడా పార్టీ మారతారా అన్న విషయం తనకు తెలియదని... అది ఆయన వ్యక్తిగత విషయమన్నారు. 

 

 

click me!