జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

By telugu teamFirst Published Sep 19, 2019, 10:03 PM IST
Highlights

హుజూర్ నగర్ అభ్యర్థిగా పద్మావతిని తప్పించడానికి తెలంగాణ కాంగ్రెసు అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డితో మాట్లాడించారని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. హుజూర్ నగర్ అభ్యర్థిగా పద్మావతి పేరును ఉత్తమ్ ప్రకటించడాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించిన విషయం తెలిసిందే.

సూర్యాపేట: హుజూర్ నగర్ అసెంబ్లీ అభ్యర్థిగా తన భార్య పద్మావతిని తప్పించడానికి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎత్తు వేశారని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. పద్మావతి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ రేవంత్ రెడ్డి చేత మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డేనని ఆయన గురువారం మీడియాతో అన్నారు.

హుజూర్ నగర్ స్థానం నుంచి గెలిచేది తమ పార్టీ అభ్యర్థేనని జగదీష్ రెడ్డి అన్నారు. సాధారణ ఎన్నికల్లో తమ అభ్యర్థి స్వల్ప తేడాతో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఓడిపోయారని, అది కూడా ట్రక్ గుర్తు వల్ల తమ అభ్యర్థి ఓటమి పాలయ్యారని ఆయన అన్నారు. హుజూర్ నగర్ స్థానం అభ్యర్థి పేరును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్ణయిస్తారని ఆయన చెప్పారు. 

సాధారణ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన శానంపూడి సైది రెడ్డి 7 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన లోకసభ ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారు. దాంతో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. దాంతో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.

శాసనసభ సాధారణ ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి పోటీ చేసి ఓడిపోయారు. దాంతో తాను ఖాళీ చేసిన స్థానం నుంచి తన భార్య పద్మావతి పోటీ చేస్తారని ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అయితే, పద్మావతి పేరును ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకపక్షంగా ప్రకటించారంటూ రేవంత్ రెడ్డి వ్యతిరేకించారు. 

సంబందిత వార్తలు

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఈ మధ్యే వచ్చినోళ్ల సలహాలు అక్కర్లేదు: రేవంత్‌పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: కాంగ్రెసు అభ్యర్థి పద్మావతి, ఉత్తమ్ ప్రకటన

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: ఉత్తమ్ పద్మావతికి రేవంత్ రెడ్డి నిరసన సెగ

నాలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికలకు నోటిఫికేషన్: లిస్ట్‌లో లేని హుజూర్‌నగర్‌

హుజూర్‌నగర్‌ నుండి పోటీకి ఉత్తమ్ సతీమణి నో

హుజూర్‌నగర్: ఉత్తమ్ సీనియారిటీకి లోకల్ ట్విస్ట్

టీఆర్ఎస్ లో అసంతృప్తి... ఉత్తమ్ షాకింగ్ కామెంట్స్

click me!