video: బిజెపి గాంధీ సంకల్ప యాత్ర... పత్తికొండలో భారీ ర్యాలీ

By Arun Kumar PFirst Published Oct 30, 2019, 8:58 PM IST
Highlights

దేశవ్యాప్తంగా బిజెపి పార్టీ చేపట్టిన గాంధీ సంకల్ప యాత్ర కర్నూల్ జిల్లాలో ముగిసింది. దాదాపు 15 రోజుల పాటు సాగిన ఈ యాత్ర పత్తికొండలో ముగిసింది.  

కర్నూల్: భారతీయ జనతా పార్టీ చేపట్టిన గాంధీ సంకల్ప యాత్ర కర్నూలు జిల్లాలో ముగిసింది. ముగింపు రోజయిన ఇవాళ(బుధవారం) స్థానిక ఆర్అండ్‌బి గెస్ట్ హౌస్ నుండి రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్.ర్యాలీగా వచ్చి పత్తికొండ నాలుగు స్తంభాల కూడలిలో గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ  ర్యాలీలో  బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు పార్థ సారథి కూడా పాల్గొన్నారు.   

కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజక వర్గాలను కలగలుపుతూ 15 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగింది. గ్రామాలు, పట్టణాల మీదుగా బిజెపి నాయకులు పాదయాత్ర చేపట్టారు. ఇలా దాదాపు 150 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగింది. 

"

యాత్ర సందర్భంగా రైతుల సమస్యలను తెలుసుకున్న బిజెపి నాయకులు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. పాదయాత్ర ముగింపు రోజు పత్తికొండలో బిజెపి నియోజకవర్గ ఇంచార్జి రంగా అధ్యక్షతన భారీ ర్యాలీ చేపట్టారు. 

అనంతరం నాలుగు స్తంభాల కూడలిలోని గాంధీ విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన సభలో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ప్రసంగించారు. గాంధీజీ చేపట్టిన అహింసా మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని... గాంధీజీ కలలను  మనమందరం నెరవేర్చాలని పిలుపునిచ్చారు.

read more సచివాలయానికి డుమ్మా... మంత్రులపై జగన్ సీరియస్

 బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థసారథి మాట్లాడుతూ...రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బిజెపితోనే సాధ్యమన్నారు.  గత ప్రభుత్వం... ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు.

 కేంద్ర ప్రభుత్వ నిధులతో ఉన్నటువంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే అది బిజెపి తోనే సాధ్యం అని ధీమా వ్యక్తం చేశారు. జగన్ పాదయాత్ర సమయంలో దాదాపు 600 హామీలు ఇచ్చారని అందులో కనీసం కొన్నైనా నెరవేర్చలేదని ఆయన ఎద్దేవా చేశారు.

click me!