కేంద్ర జలశక్తి మంత్రితో అనిల్ కుమార్ భేటీ... పోలవరంపై స్పష్టమైన హామీ

By Arun Kumar PFirst Published Dec 10, 2019, 10:08 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర జల శక్తి మంత్రి షెకావత్ నుండి స్పష్టమైన హామీ లభించినట్లు ఏపి నీటిపారుదల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.  

అమరావతి: పార్లమెంటు సమావేశాల తర్వాత పోలవరం సందర్శనకు వస్తానని కేంద్ర జల శక్తి మంత్రి షెకవత్ తెలిపినట్లు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి చెప్పారని అన్నారు. ప్రస్తుతం డిల్లీలో వున్న మంత్రి అనిల్ వైసిపి ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు.

ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను అనిల్ వెల్లడించారు. రివర్స్ టెండరింగ్ పై కేంద్ర మంత్రి సంతృప్తి చెందారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ఈ రివర్స్ టెండరింగ్  ఉపయోగించి కేంద్రానికి  రూ. 800 కోట్లు ఆదా చేశామని చెప్పామని అన్నారు. 

onion crisis video: ఉల్లి కోసం పోరాటం... కిలో మీటర్ మేర క్యూ

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చిన్న అమౌంట్ పై కేంద్ర మంత్రి కొన్ని సందేహాలు అడిగారని... వాటికి అవసరమైన సమాధానం ఇచ్చామన్నారు. రెండు మూడు రోజుల్లో రూ.1850 కోట్లు విడుదల అవుతాయని... మిగిలిన నిధులకు సంబంధించి ఆడిటింగ్  కూడా పూర్తయిందని కేంద్ర మంత్రి తెలిపారని అన్నారు. 

రూ. 55 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులో  11 వేల కోట్ల రూపాయలు పనులు మాత్రమే టిడిపి పూర్తి చేసిందని అనిల్ విమర్శించారు. అంతకుముందే కుడి, ఎడమ కాలువలు పూర్తి చేసింది వైయస్ రాజశేఖర్ రెడ్డేనని అన్నారు. పోలవరం పనులు 35 శాతం మాత్రమే ఇప్పటివరకు పూర్తయ్యాయని...2021 కల్లా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. 

నా భర్త సంసార జీవితానికి పనికిరాడు... న్యాయం చేయండి: పోలీసులను ఆశ్రయించిన యువతి

click me!